Coronavirus: ఇండో-టిబెట్‌ సరిహద్దు భద్రతా దళ శిక్షణా కేంద్రంలోని 11 మంది సైనికులకు కరోనా పాజిటివ్‌

దేశవ్యాప్తంగా కరోనావైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకూ కేసులు వేలల్లో వెలుగులోకి వస్తున్నాయి. లక్షకుపైగా రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతుండటంతో అంతటా ఆందోళన నెలకొంది....

Coronavirus: ఇండో-టిబెట్‌ సరిహద్దు భద్రతా దళ శిక్షణా కేంద్రంలోని 11 మంది సైనికులకు కరోనా పాజిటివ్‌
Coronavirus
Follow us
Subhash Goud

|

Updated on: Apr 10, 2021 | 1:46 PM

దేశవ్యాప్తంగా కరోనావైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకూ కేసులు వేలల్లో వెలుగులోకి వస్తున్నాయి. లక్షకుపైగా రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతుండటంతో అంతటా ఆందోళన నెలకొంది. కరోనా మహమ్మారి రోజురోజుకు పెరిగిపోతోంది. కరోనా కట్టడికి ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా.. ఏ మాత్రం తగ్గడం లేదు. తాజాగా ఇండో టిబెట్‌ సరిహద్దు భద్రతా దళ శిక్షణా కేంద్రంలోని 11 మంది సైనికులకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో వీరిని చెన్నైలోని శివగంగ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శివగంగ జిల్లా ఇలుపకుడిలోని ఇండో-టిబెట్‌ సరిహద్దు భద్రత దళ శిక్షణ కేంద్రంలో మహారాష్ట్ర, ఒడిసా, కర్ణాటక, ఆంధ్ర తదితర రాష్ట్రాలకు చెందిన 500 మంది శిక్షణ పొందుతున్నారు. వీరికి గురువారం కరోనా పరీక్షలు నిర్వహించగా, మహారాష్ట్రకు చెందిన 11 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. వీరిని ఆస్పత్రికి తరలించినట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. అయితే మరి కొందరు రిపోర్టులు రావాల్సి ఉందని వెల్లడించారు.

కాగా, దేశ రాజధాని ఢిల్లీలో పెద్ద ఎత్తున వైద్యులు కరోనా బారిన పడ్డారు. ఢిల్లీ ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఆసుపత్రిలో 32 మంది వైద్యులకు కరోనా సోకింది. ఎయిమ్స్‌లో 32 మంది డాక్టర్లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు శుక్రవారం ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. దీంతోపాటు దాదాపు 30 మంది హెల్త్ వర్కర్లకు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయినట్లు వెల్లడించారు. రోజురోజుకు పెద్దఎత్తున కేసులు నమోదవుతుండటంతో ఎయిమ్స్‌లో నేటి నుంచి అత్యవసర సర్జరీలకు మాత్రమే అనుమతిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. సాధారణ చికిత్సలు ఉండవని.. పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, ఢిల్లీలోని మరో ప్రముఖ గంగా రామ్‌ ఆసుపత్రిలో గురువారం 37 మంది వైద్యులకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. వీరిలో ఎక్కువ మంది యువకులు ఉన్నారు. వీరంతా కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నారని గంగారామ్ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం 32 మంది వైద్యులు హోమ్‌ క్వారంటైన్‌లో ఉండగా, ఐదుగురు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

ఇవీ చదవండి: రాష్ట్రంలో మళ్లీ గుబులు పుట్టిస్తున్న కరోనా.. కొత్తగా మూడు వేలకు చేరవగా పాజిటివ్ కేసులు

Pfizer vaccine: పిల్లలకూ కరోనా వ్యాక్సిన్‌.. దరఖాస్తు చేసుకున్న ఫైజర్‌.. ఎక్కడంటే..?

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..