రాష్ట్రంలో మళ్లీ గుబులు పుట్టిస్తున్న కరోనా.. కొత్తగా మూడు వేలకు చేరవగా పాజిటివ్ కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కొత్తగా 2,909 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
Telangana corona cases: తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గురువారం రాత్రి 8గంటల నుంచి శుక్రవారం రాత్రి 8గంటల వరకు 1,11,726 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా… కొత్తగా 2,909 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే కరోనాతో ఆరుగురు మరణించారు. దీంతో కరోనాతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 1,752కి చేరుకుంది. ఈమేరకు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శనివారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొంది.
కాగా, కరోనా బారి నుంచి నిన్న 584 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 3,04,548కి చేరింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 17,791 యాక్టివ్ కేసులు ఉన్నాయని, వారిలో 11,495 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని, మిగిలినవారు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నామని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక, కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా గ్రేట్ హైదరాబాద్ పరిధిలో 487 కేసులు నమోదయ్యాయి.