Corona Vaccine: కరోనా రెండో వేవ్ ముంచేస్తున్న తరుణంలో.. వేధిస్తున్న వ్యాక్సిన్ కొరత.. పలు రాష్ట్రాల్లో నో వ్యాక్సిన్ బోర్డులు!

కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి ఆయుధంగా భావిస్తున్న వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కరోనా వ్యాక్సిన్ తగినంత అందుబాటులో లేదంటూ దేశవ్యాప్తంగా పలురాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Corona Vaccine: కరోనా రెండో వేవ్ ముంచేస్తున్న తరుణంలో.. వేధిస్తున్న వ్యాక్సిన్ కొరత.. పలు రాష్ట్రాల్లో నో వ్యాక్సిన్ బోర్డులు!
corona-vaccine
Follow us

|

Updated on: Apr 10, 2021 | 11:49 AM

కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి ఆయుధంగా భావిస్తున్న వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కరోనా వ్యాక్సిన్ తగినంత అందుబాటులో లేదంటూ దేశవ్యాప్తంగా పలురాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఒక పక్క కరోనా మళ్ళీ విరుచుకుపడుతోంది. మరోవైపు వ్యాక్సిన్ కొరత వేధిస్తోంది. కేంద్ర ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్ కొరత లేదని చెబుతున్నా వాస్తవానికి పరిస్థితులు అందుకు అనుగుణంగా లేవని తెలుస్తోంది. ఇప్పటికే మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సిన్ కొరతపై ఆందోళనలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోనూ వ్యాక్సిన్ కొరత ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ముంబయిలో పలు టీకా కేంద్రాల్లో వ్యాక్సిన్ అందుబాటులో లేదని బోర్డులు దర్శనం ఇస్తున్నాయి. ఇక మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో తమకు వ్యాక్సిన్ అందలేదని ప్రజలు ఆందోళనకు దిగారు. ముంబయిలో ఉన్న 120 వ్యాక్సిన్ సెంటర్లలో 75 సెంటర్లను టీకాల కొరత కారణంగా మూసివేసినట్లు అధికారులు చెప్పారు. ప్రయివేట్ ఆసుపత్రుల్లో ఎక్కువగా ఈ పరిస్థితి ఉంది.

ఇక రాజస్థాన్ లో రెండు రోజులకు సరిపడా వ్యాక్సిన్ మాత్రమే అందుబాటులో ఉందనీ, 30 లక్షల డోసులు పంపించాలని ఆ రాష్ట్ర ముఖాయమంత్రి అశోక్ గెహ్లాట్ కేంద్రాన్ని కోరుతూ ప్రధాని మోడీకి లేఖ రాశారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో కూడా కరోనా వ్యాక్సిన్ నిల్వలు తగ్గిపోయాయి. దీంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా ప్రధానికి 25 లక్షల డోసులు కావాలని ఇప్పటికే లేఖ రాశారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో వ్యాక్సిన్ కొరత ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ వార్తలను తోసిపుచ్చుతోంది. ఇక టీకా అందలేదని మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ లో స్థానిక ప్రజలు ఆందోళనకు దిగారు. శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి క్యూలో నించున్నప్పటికీ.. వ్యాక్సిన్ అందుబాటులో లేదంటూ సిబ్బంది బోర్డు పెట్టారంటూ వారు చెప్పారు.

ఇదిలా ఉండగా.. కరోనా రెండో వేవ్ తీవ్రంగా విరుచుకుపడుతోంది. హరియాణా, బీహార్ లలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతుండటంతో ఆ రాష్ట్రాలు కఠిన ఆంక్షలు విధించాయి. హరియాణా ప్రభుత్వం 8వ తరగతి వరకూ పాఠశాలలు మూసివేస్తున్నట్టు ప్రకటించింది. ఇక అటు బీహార్ లోనూ పాఠశాలలు మూసివేశారు. ఈనెల 18 వరకూ పాఠశాలలు, కళాశాలలు, కోచింగ్ సెంటర్లను మూసివేస్తున్నటు ప్రకటించారు. ఈ నెల 31 వరకు కోవిద్ నిబంధనలు పాటించాలని..సాయంత్రం 7 గంటలకల్లా దుకాణాలను మూసివేయాలని స్పష్టం చేసింది. అదేవిధంగా రాజస్థాన్ లోని 10 నగరాల్లో రాత్రి కర్ఫ్యూను ఏప్రిల్ 30వ తేదీ వరకు పాడిగిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!