Pfizer vaccine: పిల్లలకూ కరోనా వ్యాక్సిన్.. దరఖాస్తు చేసుకున్న ఫైజర్.. ఎక్కడంటే..?
Pfizer-BioNTech COVID-19 vaccine: ప్రపంచవ్యాప్తంగా ఓవైపు కరోనావైరస్ తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతంగా
Pfizer-BioNTech COVID-19 vaccine: ప్రపంచవ్యాప్తంగా ఓవైపు కరోనావైరస్ తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతంగా కొనసాగుతోంది. ప్రస్తుతం పెద్దవారికి మాత్రమే వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ తరుణంలో ప్రపంచ ఫార్మా కంపెనీలు ఫైజర్-ఎన్ బయోటెక్ మరో ముందడుగు వేశాయి. అమెరికాలో 12 నుంచి 15 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలకు కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి శుక్రవారం ఫైజర్ కంపెనీ.. యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) కు దరఖాస్తు చేసింది. ప్రస్తుతం కోవిడ్ వ్యాక్సిన్ 16 సంవత్సరాలు పైబడిన వారికి మాత్రమే అందుబాటులో ఉంది. రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఇతర నియంత్రణ సంస్థల నుంచి కూడా వ్యాక్సిన్ వినియోగ అనుమతులు పొందేందుకు దరఖాస్తు చేయనున్నట్లు ఫైజర్, జర్మనీకి చెందిన బయో ఎన్‌టెక్ కంపెనీలు సంయుక్తంగా వెల్లడించాయి.
మార్చి చివర్లో 2,260 మంది పిల్లలపై నిర్వహించిన ట్రయల్స్ ట్రయల్స్ ఫలితాలను ఫైజర్-ఎన్ బయోటెక్ ఇటీవలనే ప్రకటించాయి. 12-15 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లల్లో వ్యాక్సిన్ వందశాతం ప్రభావంతంగా పని చేస్తుందని పేర్కొన్నాయి. ట్రయల్స్‌లో ఎటువంటి ప్రతికూల ప్రభావాలు నమోదు కాలేదని, మంచి ఫలితాలు వచ్చాయని పేర్కొన్నాయి. టీకా వేసినప్పుడు పెద్దలు ఎలాంటి స్వల్ప అస్వస్థతకు గురయ్యారో అలానే చిన్న పిల్లల్లో తలెత్తిందని పేర్కొన్నాయి. స్వల్ప జ్వరం, జలుబు, ఒళ్లు నొప్పులు వంటి చిన్న, చిన్న సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొంది.
ఫైజర్-బయోఎన్‌టెక్ వ్యాక్సిన్ దీర్ఘకాలిక రక్షణ, భద్రత గురించి మరింత సమాచారం కోసం తమ అధ్యయనాన్ని ఇంకా కొనసాగిస్తామని రెండు ఫార్మా కంపెనీలు పేర్కొన్నాయి. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే 12 నుంచి 15 ఏళ్ల వారికి కోవిడ్ వ్యాక్సిన్ వేయడం ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీనివల్ల తల్లిదండ్రుల్లో పిల్లల చదువుపై ఒత్తిడి తగ్గుతుందని పేర్కొంటున్నారు. కాగా ఈ టీకాకు అమెరికా ఆమోదం లభించిన వెంటనే వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించనున్నారు.
Also Read: