AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విడాకులు తీసుకుంటే ఆ హక్కు ఉండదు..! స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం.. ఎందుకో తెలుసుకోండి..?

OCI Status After Divorce : భారతీయ పౌరులను పెళ్లి చేసుకున్న విదేశీయులు ఎవ్వరైనా విడాకులు తీసుకుంటే ఇక నుంచి వారికి ఓవర్సీస్‌ సిటిజన్స్‌ ఆఫ్‌ ఇండియా (ఓసీఐ) హక్కు ఉండదని

విడాకులు తీసుకుంటే ఆ హక్కు ఉండదు..! స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం.. ఎందుకో తెలుసుకోండి..?
Oci Status After Divorce
uppula Raju
|

Updated on: Apr 10, 2021 | 5:30 AM

Share

OCI Status After Divorce : భారతీయ పౌరులను పెళ్లి చేసుకున్న విదేశీయులు ఎవ్వరైనా విడాకులు తీసుకుంటే ఇక నుంచి వారికి ఓవర్సీస్‌ సిటిజన్స్‌ ఆఫ్‌ ఇండియా (ఓసీఐ) హక్కు ఉండదని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. విడాకులు తీసుకున్న మరుక్షణమే ఆ హోదా రద్దవుతుందని తెలిపింది. ఈ విషయం భారతీయ చట్టంలో స్పష్టంగా ఉందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఢిల్లీ హైకోర్టుకు విన్నవించింది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

భారతీయ పౌరుడిని పెళ్లాడిన ఒక బెల్జియం మహిళ కొంతకాలం క్రితం భర్త నుంచి విడాకులు తీసుకుంది. దీంతో ఓసీఐ కార్డును తిరిగి ఇచ్చేయాలని బెల్జియంలోని భారత రాయబార కార్యాలయం ఆమెను కోరింది. ఇందుకు ఆ మహిళ అభ్యంతరం వ్యక్తం చేసింది. అంతేకాకుండా సవాలు చేస్తూ బెల్జియం మహిళ దిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. అయితే విచారణకు వచ్చిన ఈ కేసులో కోర్టు ప్రశ్నించగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వివరాలు తెలియజేస్తూ అఫిడవిట్‌ దాఖలు చేసింది.

భారత పౌరసత్వ చట్టం – సెక్షన్‌ 7డి (ఎఫ్) ప్రకారం, భారత పౌరులను వివాహమాడిన విదేశీయులు, విడాకుల తర్వాత ఓసీఐ హోదాను కోల్పోతారు. లేదా అర్హతలేని విదేశీయుల ఓసీఐ కార్డు రిజిస్ట్రేషన్ రద్దవుతుందని తేలింది. భారత పౌరుడిని పెళ్లి చేసుకున్నందున బెల్జియంలోని భారత రాయబార కార్యాలయం ఆ మహిళకు 2006 అగస్టు 21న పర్సన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఆరిజిన్‌ కార్డు (పీఐఓ)ను జారీ చేసింది.

అనంతరం 2011 అక్టోబరులో ఆ మహిళ అతని నుంచి చట్టబద్ధంగా విడాకులు తీసుకుంది. విడాకుల తర్వత ఆమెకు జారీ చేసిన పీఐఓ కార్డు రద్దు కావాల్సి ఉన్నప్పటికీ..ఆ సమయంలో అది రద్దు కాలేదు. అయితే, 2017లో ఆమెకు అనుకోకుండా ఓసీఐ కార్డు జారీ అయినట్లు కేంద్ర హోం మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఇప్పటికీ ఆమెకు జారీ చేసిన ఓసీఐ కార్డు రద్దు కాలేదనీ, దాన్ని తిరిగి అప్పజెప్పాలని లేదంటే చట్ట ప్రకారం కార్డు రద్దు చేస్తామని కేంద్రం స్పష్టం చేసింది.

నిరుద్యోగులు అలర్ట్..! యూనివర్సిటీ పోస్టులకు ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్ల వర్తింపు.. టీఎస్‌పీఎస్‌సీ తాజా నిర్ణయం..

తొలిపోరులో బోణీ కొట్టిన కోహ్లీసేన.. చివరి బంతి వరకు ఉత్కంఠ.. ముంబై ఇండియన్స్‌పై బెంగుళూర్‌ రాయల్‌ ఛాలెంజర్స్‌ గెలుపు..

మీరు హైదరాబాద్‌లో ఉంటున్నారా..! అయితే తప్పకుండా ఈ విషయం తెలుసుకోండి.. లేదంటే మీ జేబు ఖాళీ అవుతుంది..