నిరుద్యోగులు అలర్ట్..! యూనివర్సిటీ పోస్టులకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల వర్తింపు.. టీఎస్‌పీఎస్‌సీ తాజా నిర్ణయం..
EWS Reservation Applicable : తెలంగాణలోని వ్యవసాయ, పశుసంవర్థక యూనివర్సిటీల పరిధిలో చేపట్టే నియామకాలకు ఆర్థికంగా వెనుకబడిన రిజర్వేషన్లు (ఈడబ్ల్యూఎస్) అమలవుతాయని
EWS Reservation Applicable : తెలంగాణలోని వ్యవసాయ, పశుసంవర్థక యూనివర్సిటీల పరిధిలో చేపట్టే నియామకాలకు ఆర్థికంగా వెనుకబడిన రిజర్వేషన్లు (ఈడబ్ల్యూఎస్) అమలవుతాయని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది. ఈడబ్ల్యూఎస్ కోటా అమలు నేపథ్యంలో మార్చి 31న జారీ చేసిన నోటిఫికేషన్‌కు తాజాగా టీఎస్‌పీఎస్‌సీ అనుబంధ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. రెండు విశ్వవిద్యాలయాల్లో కలిపి 127 సీనియర్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ నోటిఫికేషన్‌లోని పోస్టులకు 10 శాతం ఈడబ్ల్యూఎస్ కోటాను వర్తింపజేస్తూ రోస్టర్ పాయింట్లను సైతం ఖరారు చేసింది. ఈ పోస్టులకు ఈనెల 19 నుంచి మే 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని టీఎస్‌పీఎస్‌సీ తెలిపింది. నిరుద్యోగులు ఈ విషయాలను గమనించి దరఖాస్తు చేసుకోవాలిన సూచించింది.
ఇదిలా ఉంటే.. తెలంగాణ ప్రభుత్వం టీఎస్‌పీఎస్‌సీ తాత్కాలిక చైర్మన్‌గా చింతా సాయిలును నియమించిన సంగతి తెలిసిందే. సిట్టింగ్ తాత్కాలిక చైర్మన్ కృష్ణారెడ్డి పదవీకాలం ముగిసిన తర్వాత టీఎస్‌పీఎస్‌సీలో మిగిలిన ఏకైక సభ్యుడు సాయిలు మాత్రమే. అయితే ప్రభుత్వం పూర్తి స్థాయి చైర్మన్ నియమించే వరకు సాయిలును టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్‌గా కొనసాగుతారు. ఒక చైర్మన్, ముగ్గురు సభ్యులతో 2014 డిసెంబర్ 17న ఏర్పడిన తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల ఆరేళ్ల పదవీ కాలం పూర్తయినందున వారందరు తమ తమ పదవులను కోల్పోయారు. కమిషన్‌లో ఇద్దరు సభ్యులు మాత్రమే మిగిలి ఉన్నారు. అందులో కృష్ణారెడ్డి, చింతా సాయిలు. అయితే కృష్ణారెడ్డి పదవీ విరమణతో చింతా సాయిలును తాత్కాలిక చైర్మన్‌గా నియమించారు.