MI vs RCB Score IPL 2021 Highlights: డివిలియ‌ర్స్ వీరవిహారం..‌ బెంగ‌ళూరు విజయం..

Sanjay Kasula

|

Updated on: Apr 09, 2021 | 11:30 PM

MI vs RCB Live Score in Telugu: డివిలియ‌ర్స్ చెల‌రేగిన వేళ రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ఐపీఎల్ 14వ సీజన్‌లో బోణీ కొట్టింది. ఒక ద‌శ‌లో 106 ప‌రుగుల‌కే 5 వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డిన ఆర్సీబీని...

MI vs RCB Score IPL 2021 Highlights: డివిలియ‌ర్స్ వీరవిహారం..‌ బెంగ‌ళూరు విజయం..
Mi Vs Rcb

ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో ఒటమి అనే ఆన‌వాయితీని ఈ ఏడాది కూడా ముంబై ఇండియ‌న్స్ కొన‌సాగించింది. మిస్ట‌ర్ 360 ఏబీ డివిలియ‌ర్స్ చెల‌రేగిన వేళ రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ఐపీఎల్ 14వ సీజన్‌లో బోణీ కొట్టింది. ఒక ద‌శ‌లో 106 ప‌రుగుల‌కే 5 వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డిన ఆర్సీబీని డివిలియ‌ర్స్ ఒంటిచేత్తో గ‌ట్టెక్కించాడు. చివ‌రి బంతి వ‌ర‌కూ ఉత్కంఠ‌భ‌రితంగా జ‌రిగిన ఈ మ్యాచ్‌లో చివ‌రికి ఆర్సీబీ 2 వికెట్ల‌తో గెలిచింది.

ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లోనే రాయ‌ల్‌చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు బౌలర్లు దుమ్మురేపారు. ముంబై ఇండియన్స్‌కు చుక్కలు చూపించారు. దీంతో డిఫెండింగ్ చాంపియ‌న్స్ ముంబై ఇండియ‌న్స్ 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల‌కు 159 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. హ‌ర్ష‌ల్ చివ‌రి ఓవ‌ర్లోనే 3 వికెట్లు తీయ‌డంతోపాటు మొత్తంగా ఐదు వికెట్లు తీశాడు.

ముంబై ఇండియన్స్ త‌ర‌ఫున ఐదు వికెట్లు తీసిన తొలి బౌల‌ర్ హ‌ర్షల్ కావ‌డం విశేషం. తొలి ప‌ది ఓవ‌ర్ల‌లో వికెట్ న‌ష్టానికి 86 ప‌రుగులు చేసి భారీ స్కోరు చేసేలా క‌నిపించిన ముంబై.. ఒక్క‌సారిగా వరుస వికెట్లు కోల్పోవడంతో టార్గెట్ తగ్గిపోయింది. తొలి ఓవ‌ర్లోనే 15 ప‌రుగులు ఇచ్చిన హ‌ర్ష‌ల్‌.. త‌ర్వాత అద్భుతంగా పుంజుకున్నాడు. ముంబై స్టార్ బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిష‌న్‌, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, పొలార్డ్‌ల‌ను అత‌డు ఔట్ చేశాడు.

ఓపెన‌ర్ క్రిస్ లిన్ (35 బంతుల్లో 49) మాత్ర‌మే రాణించాడు. ఇక యువ బ్యాట్స్‌మ‌న్ ఇషాన్ కిష‌న్ (19 బంతుల్లో 28), సూర్య‌కుమార్ యాద‌వ్ (23 బంతుల్లో 31) దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించి ఔటయ్యాడు. హార్డ్ హిట్ట‌ర్ హార్దిక్ పాండ్యా (10) విఫ‌ల‌మ‌య్యాడు. చివ‌ర్లో చెల‌రేగుతార‌నుకున్న పొలార్డ్‌, కృనాల్ పాండ్యా.. ఆర్సీబీ క‌ట్టుదిట్ట‌మైన బంతులను పరుగులుగా మార్చడంలో పూర్తిగా విఫలమయ్యారు. హ‌ర్ష‌ల్ ప‌టేల్ 4 ఓవ‌ర్ల‌లో 27 ప‌రుగులు ఇచ్చి 5 వికెట్లు తీసుకున్నాడు. చివ‌రి ఓవ‌ర్లో అయితే కేవ‌లం ఒకే ఒక్క ప‌రుగు ఇచ్చి మూడు వికెట్లు తీసుకోగా.. మ‌రొక ర‌నౌట్‌తో ఆ ఓవ‌ర్లో మొత్తం 4 వికెట్లు ప‌డ్డాయి.

రాయల్‌ ఛాలెంజర్స్‌ జట్టు: విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), రజత్‌ పాటిదార్‌, ఏబీ డివిలియర్స్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్, డేనియెల్‌ క్రిస్టియన్, వాషింగ్టన్‌ సుందర్‌, కైల్‌ జేమీసన్‌, హర్షల్‌ పటేల్‌, మహ్మద్‌ సిరాజ్‌, షాబాజ్‌ అహ్మద్‌, యుజ్వేంద్ర చాహల్‌ ముంబై ఇండియన్స్‌ జట్టు: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), క్రిస్‌లిన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌, హార్దిక్‌ పాండ్య, కీరన్‌ పొలార్డ్‌, కృనాల్‌ పాండ్య, రాహుల్‌ చాహర్‌, మార్కో జెన్సన్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, జస్ప్రీత్‌ బుమ్రా

తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియ‌న్ ముంబై ఇండియ‌న్స్‌తో తొలి టైటిల్ కోసం ఆరాట‌ప‌డుతున్న రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు త‌ల‌ప‌డ‌బోతోంది. చెన్నైలోని చిదంబ‌రం స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంట‌ల‌కు మ్యాచ్ ప్రారంభం కానుంది. రెండు జట్ల సారథులు టీమిండియాకు టాప్ బ్యాట్స్‌మన్‌ కావడంతో ఈ మ్యాచ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ రెండు జట్లు తలపడ్డ చివరి ఐదు మ్యాచులు హోరాహోరీగా సాగాయి. ఈ సారి కూడా అదే రేజ్‌లో ఉంటుందని ఇరు జట్ల అభిమానులు ఉత్సాహంతో ఎదిరి చూస్తున్నారు.

ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు, ఇరు జట్లు ఈ సీజన్‌లో మొదటి మ్యాచ్‌ను మొత్తం 2 సార్లు ఆడాయి. ఈ రెండు మ్యాచ్‌లను బెంగళూరు గెలిచింది. 2008 మరియు 2013 సీజన్లలో ప్రారంభ మ్యాచ్లలో బెంగళూరు ముంబైని ఓడించింది. కాబట్టి, ఈ మ్యాచ్‌లో గెలిచి ఓటమి గొలుసును  విచ్ఛిన్నం చేయడం ముంబైకి సవాలుగా మారనుంది. బెంగళూరుకు హ్యాట్రిక్ సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి, ఈ రెండు జట్లలో ఏది విజయవంతమవుతుందో చూడటం ఆసక్తికరంగా ఉంటుంది.

కిందివాటిలో బలమైన జట్టు ఏది?

ఐపీఎల్ చరిత్రలో ఇరు జట్లు మొత్తం 27 సార్లు పోటీ పడ్డాయి. అయితే  17 మ్యాచ్‌ల్లో ముంబై గెలిచింది. బెంగళూరు 9 మ్యాచ్‌ల్లో ముంబైని ఓడించింది. 1 మ్యాచ్ డ్రా చేయబడింది. ఈ మ్యాచ్‌లో సూపర్ ఓవర్‌లో బెంగళూరు విజయం సాధించింది. అంటే బెంగళూరు మొత్తం 10 మ్యాచ్‌ల్లో గెలిచింది.

Key Events

ముంబై ఇండియన్స్..

‌రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), క్రిస్‌లిన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌, హార్దిక్‌ పాండ్య, కీరన్‌ పొలార్డ్‌, కృనాల్‌ పాండ్య, రాహుల్‌ చాహర్‌, మార్కో జెన్సన్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, జస్ప్రీత్‌ బుమ్రా

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు..

విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), రజత్‌ పాటిదార్‌, ఏబీ డివిలియర్స్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్, డేనియెల్‌ క్రిస్టియన్, వాషింగ్టన్‌ సుందర్‌, కైల్‌ జేమీసన్‌, హర్షల్‌ పటేల్‌, మహ్మద్‌ సిరాజ్‌, షాబాజ్‌ అహ్మద్‌, యుజ్వేంద్ర చాహల్

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 09 Apr 2021 11:23 PM (IST)

    ఉత్తేజకరమైన ట్విస్ట్..చివరి ఓవర్ యొక్క నాల్గవ బంతిలో..

    మ్యాచ్‌లో మళ్లీ ఉత్తేజకరమైన ట్విస్ట్ ఉంది. చివరి ఓవర్ యొక్క నాల్గవ బంతిలో డివిలియర్స్ 2 పరుగులు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. క్రునాల్ పాండ్యా బెస్ట్ త్రోలో ఇషాన్ కిషన్ స్టంప్స్ వేగవంతం చేశాడు. డివిలియర్స్ 48 పరుగులు చేశాడు.

  • 09 Apr 2021 11:19 PM (IST)

    జామిసన్ రనౌట్

    బుమ్రా వేసిన 19వ ఓవర్‌లో డివిలియర్స్‌(46) రెండు ఫోర్లు కొట్టడంతో పాటు మరో నాలుగు పరుగులు చేశాడు. దీంతో ఈ ఓవర్‌లో మొత్తం 12 పరుగులు వచ్చాయి. మరోవైపు జేమీసన్‌(4) అనవసర పరుగుకు యత్నించి రనౌటయ్యాడు.

  • 09 Apr 2021 11:11 PM (IST)

    ఆరో వికెట్‌ కోల్పోయిన బెంగళూరు

    బుమ్రా వేసిన 17వ ఓవర్‌లో క్రిస్టియన్‌ ఔటయ్యాడు. అతడు ఆడిన షాట్‌ను రాహుల్‌ చాహర్‌ అందుకోవడానికి ప్రయత్నించాడు.

  • 09 Apr 2021 11:04 PM (IST)

    విజయానికి 24 బంతుల్లో 39 పరుగులు కావాలి…

    రాహుల్‌ చాహర్‌ వేసిన ఈ ఓవర్‌లో బెంగళూరు 15 పరుగులు సాధించింది. డివిలియర్స్‌(18) ఈ ఓవర్‌లో ఒక ఫోర్‌, సిక్సర్‌ సాధించాడు. అతడికి డేనియల్‌ క్రిస్టియన్ తోడుగా ఉన్నాడు. బెంగళూరు విజయానికి 24 బంతుల్లో 39 పరుగులు కావాలి.

  • 09 Apr 2021 11:03 PM (IST)

    ఐదవ స్థానంలో డివిలియర్స్‌ను పంపడం ఆశ్చర్యం: యువరాజ్

    ఐబి డివిలియర్స్‌ను ఐదవ స్థానంలో పంపడం ద్వారా ఆర్‌సిబి తప్పు చేసిందా? ఇంతకాలం డివిలియర్స్ ని ఆపడం సరికాదని భారత మాజీ వెటరన్ యువరాజ్ సింగ్ అభిప్రాయపడ్డారు. ఈ ఫార్మాట్‌లో జట్టులోని అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లు టాప్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయాలని యువరాజ్ ట్వీట్ చేశారు.

  • 09 Apr 2021 11:00 PM (IST)

    జానేసన్‌‌కు రెండు వికెట్లు..

    జానేసన్‌ వేసిన 15వ ఓవర్‌లో రెండు వికెట్లు పడ్డాయి. తొలి బంతికి మాక్స్‌వెల్‌(39) ఔటవగా… చివరి బంతికి షాబాజ్‌ అహ్మద్‌ ఔటయ్యాడు. దీంతో ఈ ఓవర్‌లో మూడు పరుగులు, రెండు వికెట్లు వచ్చాయి.

  • 09 Apr 2021 10:56 PM (IST)

    మాక్సీ దూకుడుకు బ్రేక్

    మాక్సీ(39) దూకుడుకు బ్రేక్ పడింది. జానేసన్‌ వేసిన 15వ ఓవర్‌ తొలి బంతికి మాక్స్‌వెల్‌ భారీ షాట్ కోసం ప్రయత్నించి  క్రిస్‌లిన్‌ చేతికి చిక్కాడు. బెంగళూరు 103 పరుగుల వద్ద నాలుగో వికెట్‌ కోల్పోయింది. క్రీజులో డివిలియర్స్‌(3), షాబాజ్‌ అహ్మద్‌ ఉన్నారు. బెంగళూరు విజయానికి ఇంకా 55 పరుగులు కావాలి.

  • 09 Apr 2021 10:54 PM (IST)

    బెంగళూరు 100 పరుగులు.. ఛేజింగ్..

    రాహుల్‌ చాహర్‌ వేసిన 14 ఓవర్‌లో బెంగళూరు నాలుగు పరుగులు తీసింది. మాక్స్‌వెల్‌(39), డివిలియర్స్‌(3) చెరో రెండు సింగిల్స్‌ తీశారు. దాంతో బెంగళూరు వంద పరుగుల వరకు వచ్చింది.

  • 09 Apr 2021 10:53 PM (IST)

    విరాట్ ఔట్

    బుమ్రా వేసిన ఈ ఓవర్‌లో బెంగళూరు కెప్టెన్‌ విరాట్ కోహ్లీ ఇంటిముఖం పట్టాడు. అతడు మూడో బంతికి LBWగా వెనుదిరిగాడు.

  • 09 Apr 2021 10:49 PM (IST)

    మ్యాక్స్ వెల్ సిక్సర్

    రాహుల్‌ చాహర్‌ వేసిన 12 ఓవర్లో మొదటి బంతిని మ్యాక్స్ వెల్ సిక్సర్‌ కొట్టాడు. కోహ్లి నిలకడగా ఆడుతున్నాడు. మ్యాక్స్ వెల్‌ ఆడేందుకు సహకరిస్తున్నాడు.

  • 09 Apr 2021 10:47 PM (IST)

    మొదటి బంతి బౌండరీ

    కృనాల్‌ పాండ్య వేసిన 11 ఓవర్‌లో మొదటి బంతిని మ్యాక్స్‌వెల్(26)‌ స్టాండ్స్‌కి పంపించాడు. కోహ్లి నిలకడగా ఆడుతున్నాడు.

  • 09 Apr 2021 10:38 PM (IST)

    కోహ్లి, మ్యాక్స్‌ వెల్.. చెరో రెండు సింగిల్

    మార్కో జన్‌సెన్‌ వేసిన 10 ఓవర్‌లో కోహ్లి(29), మ్యాక్స్‌ వెల్‌(18) చెరో రెండు సింగిల్స్‌ తీశారు. రెండు పరుగులు వైడ్‌ల రూపంలో వచ్చాయి.

  • 09 Apr 2021 10:27 PM (IST)

    రాహుల్‌ చాహర్ 8వ ఓవర్లో..

    రాహుల్‌ చాహర్ 8వ ఓవర్లో మ్యాక్స్‌ వెల్‌(11) రెండు బౌండరీలు చేశాడు. కోహ్లి(26) పరుగులతో నిలకడగా ఆడుతున్నాడు.

  • 09 Apr 2021 10:13 PM (IST)

    5 ఓవర్లకు 6 పరుగులు..

    కృనాల్‌ పాండ్య వేసిన ఈ ఓవర్‌లో  6 పరుగులొచ్చాయి. రెండో బంతికి సుందర్(10 పరుగులు) క్రిస్‌లిన్‌ కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు.

  • 09 Apr 2021 10:10 PM (IST)

    వాషింగ్టన్ సుందర్‌ ఔట్..

    కృనాల్‌ పాండ్య వేసిన ఐదో ఓవర్లో రెండో బంతికి వాషింగ్టన్ సుందర్‌ క్రిస్ లిన్‌ చేతికి చిక్కాడు. రజత్‌ పాటిదార్‌ క్రీజులోకి వచ్చాడు.

  • 09 Apr 2021 10:08 PM (IST)

    ఈ ఓవర్‌లో 14 పరుగులు..

    మార్కో జన్‌సన్‌ ఈ ఓవర్‌లో 14 పరుగులు తీశాడు. కోహ్లి రెండు ఫోర్లు బాదాడు. సుందర్ (10)క్రీజులో ఉన్నాడు.

  • 09 Apr 2021 10:03 PM (IST)

    కోహ్లి బౌండరీ..

    ట్రెంట్‌ బౌల్ట్ వేసిన  ఈ ఓవర్లో రెండో బంతిని  కోహ్లి బౌండరీకి తరలించాడు. సుందర్(7) పరుగులతో నిలకడగా ఆడుతున్నాడు.

  • 09 Apr 2021 09:29 PM (IST)

    జెమీసన్ వేసిన ఈ ఓవర్‌లో బౌండరీలు..

    జెమీసన్ వేసిన ఈ ఓవర్‌లో మొత్తం 12 పరుగులొచ్చాయి‌. కృనాల్‌(7), పొలార్డ్‌(7) చెరో ఫోర్‌ కొట్టారు.

  • 09 Apr 2021 09:11 PM (IST)

    హర్షల్‌ పటేల్ ఔట్‌

    హర్షల్‌ పటేల్‌ వేసిన 16వ ఓవర్‌లో హార్దిక్‌ పాండ్య(13) ఔటయ్యాడు. చివరి బంతికి అతడు ఎల్బీగా వెనుదిరిగాడు. రివ్యూకు వెళ్లినా ఫలితం ఆర్సీబీకి అనుకూలంగా వచ్చింది. అంతకుముందు ఈ ఓవర్‌లో 7 పరుగులొచ్చాయి.

  • 09 Apr 2021 09:04 PM (IST)

    ఇషాన్‌కిషన్ దూకుడు..

    చాహల్‌ వేసిన ఈ ఓవర్‌లో మొత్తం 15 పరుగులొచ్చాయి. ఇషాన్‌కిషన్‌(17) ఒక సిక్స్‌, ఫోర్‌ సాధించాడు.

  • 09 Apr 2021 08:45 PM (IST)

    క్రిస్‌లిన్ ఔట్

    వాషింగ్టన్‌ సుందర్‌ వేసిన 12ఓవర్‌లో5 బంతికి క్రిస్‌లిన్‌(49) ఔటయ్యాడు. మంచి షాట్ ఆడేందుకు ప్రయత్నించి సుందరే క్యాచ్ ఇచ్చాడు. అంతకుముందు ఈ ఓవర్‌లో లిన్‌ ఓ బౌండరీ సాధించడంతో జట్టు స్కోర్‌ 100 పరుగులు దాటింది. క్రీజులో ఇషాన్‌ కిషన్‌(4), హార్దిక్‌ పాండ్య ఉన్నారు.

  • 09 Apr 2021 08:33 PM (IST)

    సూర్యకుమర్ యాదవ్ ఔట్..

    జెమీసన్‌ వేసిన పదకొండో ఓవర్‌ చివరి బంతికి సూర్యకుమార్‌ యాదవ్‌ ఔటయ్యాడు. వికెట్ల వెనక డివిలియర్స్‌ క్యాచ్‌ పట్టడంతో ముంబై ఇండియన్స్ 94 పరుగుల వద్ద రెండో వికెట్‌ కోల్పోయింది. క్రీజులో ఇప్పుడ క్రిస్‌లిన్‌, ఇషాన్‌కిషన్‌లు ఉన్నారు.

  • 09 Apr 2021 08:15 PM (IST)

    ముంబై ఇండియన్స్ స్కోర్‌ 55 పరుగులు

    షాబాజ్‌ అహ్మద్‌ వేసిన ఏడో ఓవర్‌లో క్రిస్‌లిన్‌(25) ఒక ఫోర్‌, ఒక సిక్సర్‌ కొట్టేశాడు. దీంతో జట్టు స్కోర్‌ 50 పరుగులు దాటింది. అలాగే మరో నాలుగు సింగిల్స్‌ రావడంతో ముంబై ఇండియన్స్ స్కోర్‌ 55కి చేరింది.

  • 09 Apr 2021 08:13 PM (IST)

    సూర్యకుమార్‌ యాదవ్‌ తొలి బౌండరీ

    రోహిత్‌ శర్మ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్‌ యాదవ్‌ వచ్చీ రాగానే బౌండరీ బాదేశాడు. జేమీసన్‌ వేసిన తొలి బంతికి ఫోర్‌ కొట్టి తర్వాతి బంతికి సింగిల్‌ తీశాడు.

  • 09 Apr 2021 08:06 PM (IST)

    క్రిస్ తొలి సిక్సర్

    క్రిస్ లిన్‌ మీద పెద్ద బాధ్యతలు పెట్టాడు. చాహల్ యొక్క కొత్త ఓవర్ యొక్క రెండవ బంతిని లిన్ లాంగ్ ఆఫ్లో సిక్సర్ బాదేశాడు.

  • 09 Apr 2021 07:51 PM (IST)

    రోహిత్ శర్మ ఔట్…

    ముంబై  ఇండియన్స్ తొలి వికెట్ కోల్పోయింది. రోహిత్ శర్మ ఔటయ్యాడు. క్రిస్‌లిన్‌ ఆడిన బంతికి అనవసర పరుగుకు యత్నించిన హిట్‌మ్యాన్‌ రనౌటయ్యాడు. దీంతో ముంబై 24 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది. క్రిస్లిన్‌(5), సూర్యకుమార్‌ యాదవ్‌ క్రీజులో వచ్చాడు.

  • 09 Apr 2021 07:48 PM (IST)

    ఈ సీజన్‌లో రోహిత్‌కు మొదటి బౌండరీ

    ఐపీఎల్ 2021లో తొలి బౌండరీ తీశాడు రోహిత్ శర్మ. రోహిత్ సిరాజ్ లాంగ్ బాల్ ను మిడ్-ఆఫ్ పైకి వచ్చింది .

  • 09 Apr 2021 07:45 PM (IST)

    సిరాజ్‌ తొలి ఓవర్ ఇలా..

    సిరాజ్ తొలి ఓవర్ బాగుంది. సిరాజ్ ఎటువంటి స్థానం ఇవ్వలేదు. రోహిత్ కూడా ఓవర్ నుండి 5 పరుగులు చేయగలిగాడు. ఐదు పరుగులు స్క్వేర్ లెగ్ వైపు వచ్చాయి. అయితే, రోహిత్ రెండు బంతుల్లో ఒక ఫోర్ కొట్టే అవకాశం ఉన్నందున ఖచ్చితంగా నిరాశ చెందుతాడు. ఇప్పటికీ మొదటి ఓవర్ ఆర్‌సిబికి మంచిది.

  • 09 Apr 2021 07:36 PM (IST)

    ముంబై ఇన్నింగ్స్ ప్రారంభమైంది

    ముంబై ఇండియన్స్ ఓపెనింగ్ కోసం కెప్టెన్ రోహిత్ శర్మ, క్రిస్ లిన్ వచ్చారు.  

  • 09 Apr 2021 07:24 PM (IST)

    జట్టులోకి వచ్చింది వీరే..

    క్రికెట్‌ ప్రేమికులంతా ఎదురుచూస్తున్న ఐపీఎల్‌ 14వ సీజన్‌ మొదలైంది. తొలి పోరులో తలపడేందుకు డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు సిద్ధమయ్యాయి. ఈ సందర్భంగా టాస్‌ గెలిచిన విరాట్‌ కోహ్లీ బౌలింగ్‌ ఎంచుకున్నాడు.

    రాయల్‌ ఛాలెంజర్స్‌ జట్టు: విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), రజత్‌ పాటిదార్‌, ఏబీ డివిలియర్స్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్, డేనియెల్‌ క్రిస్టియన్, వాషింగ్టన్‌ సుందర్‌, కైల్‌ జేమీసన్‌, హర్షల్‌ పటేల్‌, మహ్మద్‌ సిరాజ్‌, షాబాజ్‌ అహ్మద్‌, యుజ్వేంద్ర చాహల్‌ ముంబై ఇండియన్స్‌ జట్టు: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), క్రిస్‌లిన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌, హార్దిక్‌ పాండ్య, కీరన్‌ పొలార్డ్‌, కృనాల్‌ పాండ్య, రాహుల్‌ చాహర్‌, మార్కో జెన్సన్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, జస్ప్రీత్‌ బుమ్రా

  • 09 Apr 2021 07:09 PM (IST)

    టాస్ గెలిచిన విరాట్..

    టాస్‌లో ఎప్పుడూ నిరాశ చెందుతున్న విరాట్ కోహ్లీ.. ఐపీఎల్ 2021 తొలి మ్యాచ్‌లో టాస్ గెలిచాడు. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌లో ఆర్‌సిబి బౌలింగ్ చేయనుంది.

  • 09 Apr 2021 07:07 PM (IST)

    MI కోసం ఇద్దరు ఆటగాళ్ళు అరంగేట్రం

    ఈ సీజన్ యొక్క మొదటి మ్యాచ్‌లో ముంబై ఇద్దరు కొత్త ఆటగాళ్లకు అరంగేట్రం చేయడానికి అవకాశం ఇచ్చింది. క్వింటన్ డి కాక్ లేకపోవడంతో ఆస్ట్రేలియా ఓపెనర్ క్రిస్ లిన్‌కు అవకాశం ఇవ్వబడింది. గత సీజన్లో లిన్ కూడా జట్టులో ఒక భాగం, కానీ ఎటువంటి మ్యాచ్‌లు ఆడలేదు.

    ఆయనతో పాటు, 20 ఏళ్ల 7 అడుగుల పొడవైన దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ మార్కో యాన్సన్‌కు కూడా ముంబై అవకాశం ఇచ్చింది.  ఈ సీజన్‌లో అతన్ని 20 లక్షల మూల ధర వద్ద ఎంఐ కొనుగోలు చేసింది.

  • 09 Apr 2021 07:04 PM (IST)

    ఐపీఎల్ టోర్నీ నియమాలు..

    చాలా మంది క్రికెట్ అభిమానులు గత 13 ఏళ్లుగా ఐపీఎల్ చూస్తున్నారు. అయితే ఇందులో కొన్ని నియమాలను బాగా తెలుసు కోవాలి.

    • ప్రతి జట్టు ఒకదానితో ఒకటి 2-2 మ్యాచ్‌లు ఆడతాయి. రెండు మ్యాచ్‌లు వేర్వేరు మైదానంలో ఉంటాయి. ప్రతి విజయానికి 2 పాయింట్లు లభిస్తాయి.
    • పాయింట్ల పట్టికలో మొదటి 4 జట్లు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తాయి. ఇక్కడ ఫైనల్స్‌కు చేరుకోవడానికి వారి మధ్య నాకౌట్ మ్యాచ్‌లు ఆడతారు.
    • ఇప్పటి వరకు ప్రతి జట్టు తమ స్టేడియంలో మరొక జట్టుతో, వారి స్టేడియంలో ఒక మ్యాచ్ ఆడుతోంది. కరోనావైరస్ కారణంగా ఈసారి మారిపోయింది. ఈసారి తమ జట్టులో ఏ జట్టు కూడా ఆడటం లేదు.

  • 09 Apr 2021 06:49 PM (IST)

    ముంబై vs బెంగళూరు

    ఐపీఎల్ 14 వ సీజన్ నేటి నుండి ప్రారంభమవుతుంది. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరుగుతుంది. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది.

  • 09 Apr 2021 06:48 PM (IST)

    టాస్ గెలిచేది ఎవరో…

    ఈ సీజన్ మొదటి మ్యాచ్‌లో టాస్ ఎవరు గెలుస్తారో అందరూ చూస్తూనే ఉంటారు. రాత్రి 7 గంటలకు టాస్ పండబోతోంది. కాబట్టి, టాస్ ఎవరిని వరిస్తుందో అని అభిమానులు ఆసక్తికరంగా చూస్తున్నారు.

Published On - Apr 09,2021 11:28 PM

Follow us
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!