AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Grama Volunteer: కృష్ణా జిలాల్లో గ్రామవాలంటీర్ల నియామకానికి నోటిఫికేషన్.. ఆసక్తి ఉన్నవారు అప్లై చేసుకోండి ఇలా

AP Grama Volunteer Recruitment 2021: ఏపీ ప్రభుత్వం వాలంటీర్ నియామకాలు చేపట్టి.. ప్రజలకు ఎంతో దగ్గరైంది. ఈ వాలంటీర్లు ప్రభుత్వ పథకాలను నేరుగా ప్రజలకు చేరవేస్తున్నారు. దీంతో ప్రజలకు.. ప్రభుత్వానికి...

AP Grama Volunteer:  కృష్ణా జిలాల్లో గ్రామవాలంటీర్ల నియామకానికి నోటిఫికేషన్.. ఆసక్తి ఉన్నవారు అప్లై చేసుకోండి ఇలా
Ap Grama Volunteer
Surya Kala
|

Updated on: Apr 09, 2021 | 6:38 PM

Share

AP Grama Volunteer Recruitment 2021: ఏపీ ప్రభుత్వం వాలంటీర్ నియామకాలు చేపట్టి.. ప్రజలకు ఎంతో దగ్గరైంది. ఈ వాలంటీర్లు ప్రభుత్వ పథకాలను నేరుగా ప్రజలకు చేరవేస్తున్నారు. దీంతో ప్రజలకు.. ప్రభుత్వానికి మధ్య వాలంటీర్ వ్యవస్థ వారధిగా మరింది. అంతేకాదు.. ఎంతోమందికి ఉపాధి కూడా లభించింది. ఇక కరోనా సమయంలోనూ వాలంటీర్లు చేస్తున్న సేవల గురించి ఎంత చెప్పినా తక్కవే.. అయితే తాజాగా కృష్ణ జిల్లాలో వాలంటీర్ ఉద్యోగాల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఆప్లైకేషన్లకు చివరి తేదీ ఏప్రిల్ 13 వ తేదీ అని నోటిఫికేషన్ లో ప్రకటించారు. ఈ నోటిఫికేషన్ ద్వారా కృష్ణా జిల్లాలోని 200 ఖాళీలను భర్తీ చేయనున్నారు. మరిన్ని వివరాల కోసం ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్: https://gswsvolunteer.apcfss.in/ ను సందర్శించాల్సి ఉంటుంది.

విద్యార్దత :

టెన్త్, ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి

అభ్యర్థులు స్థానిక గ్రామ, వార్డు పరిధిలో నివసిస్తూ ఉండాలి

వయస్సు :

18-35 ఏళ్ల మధ్య ఉండాలి

వేతనం :

నెలకు రూ. 5000

ఆసక్తి కల్గిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ప్రతిభ ఆధారంగా ఎంపిక ఉంటుంది. మొత్తం 100 మార్కులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అభ్యర్థులకు ప్రభుత్వ పథకాలు, నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలపై అవగాహన తప్పనిసరిగా ఉండాలి.

Also Read: 3 వేల ఏళ్ల తర్వాత పురావస్తు తవ్వకాల్లో బయటపడ్డ బంగారు నగరం.. ఎక్కడంటే..!

మైనోపాజ్ దశలో ఉన్న మహిళలకు చేమదుంపలు చేసే మేలు తెలిస్తే..