మీరు హైదరాబాద్‌లో ఉంటున్నారా..! అయితే తప్పకుండా ఈ విషయం తెలుసుకోండి.. లేదంటే మీ జేబు ఖాళీ అవుతుంది..
Residents of Hyderabad : మీరు హైదరాబాద్‌లో నివసిస్తున్నారా అయితే బయటికి వచ్చినప్పుడు కచ్చితంగా మాస్కు పెట్టుకోవాలి లేదంటే వేయి రూపాయల ఫైన్ పడుతుంది.
Residents of Hyderabad : మీరు హైదరాబాద్‌లో నివసిస్తున్నారా అయితే బయటికి వచ్చినప్పుడు కచ్చితంగా మాస్కు పెట్టుకోవాలి లేదంటే వేయి రూపాయల ఫైన్ పడుతుంది.’మాస్క్ ఆన్’ విధానంపై అవగాహన కల్పించడంపై ఇప్పటివరకు దృష్టి సారించిన సిటీ పోలీసులు, ఇప్పటి నుంచి చట్టాన్ని కఠినంగా అమలు చేయడం ప్రారంభించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. బహిరంగ ప్రదేశాల్లో ముసుగులు ధరించని వారికి రూ.1000 జరిమానా విధించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గురువారం డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మహేందర్ రెడ్డికి ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆయన కమిషనర్లకు, పోలీస్ సూపరింటెండెంట్లకు, యూనిట్ హెడ్‌లకు నిబంధనలు కఠినంగా అమలు చేయాలని సూచించారు.
మాస్కు ధరించని వారి ఫోటోలు తీసి ట్రాఫిక్ పోలీసులు కేసులు నమోదు చేస్తారు. అంతేకాకుండా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి జనాలను గమనిస్తారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సిటీ కమిషనర్ సజ్జనార్ మాట్లాడుతూ.. మీ మాస్కు మిమ్మల్ని రక్షిస్తుంది.. మీ మాస్కు చుట్టుపక్కల వారిని కాపాడుతుందని తెలిపారు. కరోనా కేసులు గతంలో కంటే వేగంగా పెరుగుతుండటం వల్ల ప్రతి ఒక్కరు మాస్కు ధరించి, సామాజిక దూరం పాటించాలని కోరారు. రాచకొండ పోలీసులు కూడా తమ పరిధిలో ‘మాస్క్ ఆన్’ విధానాన్ని అమలు చేయడం ప్రారంభించారు. వైరస్ బారిన పడినవారికి దూరంగా ఉండాలని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ సూచించారు. మాస్కు ధరించని వారు వేయి రూపాయల జరిమానాతో పాటు కేసుల వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అప్రమత్తం చేశారు.
ఇదిలా ఉంటే.. దేశంలో కరోనా మహహ్మారి తీవ్ర స్థాయిలో వ్యాప్తి చెందుతోంది. దీంతో కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి. అయితే ఇతర దేశాల నుంచి మన దేశంలోకి అడుగు పెట్టే ప్రయాణికుల వల్లనే కరోనా కేసులు పెరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇక విమానాశ్రయాల్లో కరోనా నిబంధనలు కఠినతరం చేస్తున్నారు. విమానాశ్రయ ప్రాంగణంలో కోవిడ్ -19 ప్రోటోకాల్‌ను ఉల్లంఘించిన ప్రయాణికులకు జరిమానా విధించాలని రెగ్యులేటర్ పేర్కొంది. అంతర్జాతీయ విమానాశ్రయాల్లో డీజీసీఏ ఆదేశాల మేరకు ఏప్రిల్ 1 నుంచి కోవిడ్ -19 ప్రోటోకాల్‌ను ఉల్లంఘించిన ప్రయాణికులకు రూ .1000 జరిమానా విధిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఒక ప్రయాణికుడు మాస్క్ ధరించకున్నా, ఇతర కోవిడ్ నిబంధనలు పాటించకున్నా.. రూ.1000 జరిమానా విధించనున్నట్లు అధికారులు వెల్లడించారు.