AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New Covid Centers : హైదరాబాద్‌లో కొత్తగా నాలుగు కొవిడ్ కేర్‌ కేంద్రాల ఏర్పాటు.. ఆమోదం తెలిపిన తెలంగాణ ప్రభుత్వం

New Covid Centers : హైదరాబాద్ నగరంలో కొత్తగా నాలుగు కొవిడ్‌ కేర్‌ కేంద్రాల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. బేగంపేటలోని ప్రకృతి చికిత్సాలయం, ఎర్రగడ్డలోని

New Covid Centers : హైదరాబాద్‌లో కొత్తగా నాలుగు కొవిడ్ కేర్‌ కేంద్రాల ఏర్పాటు..  ఆమోదం తెలిపిన తెలంగాణ ప్రభుత్వం
Covid-19
uppula Raju
|

Updated on: Apr 10, 2021 | 6:12 AM

Share

New Covid Centers : హైదరాబాద్ నగరంలో కొత్తగా నాలుగు కొవిడ్‌ కేర్‌ కేంద్రాల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. బేగంపేటలోని ప్రకృతి చికిత్సాలయం, ఎర్రగడ్డలోని ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల, చార్మినార్‌లోని నిజామియా టీబీ ఆసుపత్రి, మెహదీపట్నంలోని సరోజినీ కంటి ఆసుపత్రిలో కొవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈమేరకు కొవిడ్‌ కేర్‌ సెంటర్ల కోసం ₹1.79 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించింది.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం సీఎం కేసీఆర్ వైద్య ఆరోగ్య శాఖలతో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై సమీక్షించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్ పలు విషయాలను సూచించారు. తెలంగాణలో కరోనా మళ్లీ విజృంభిస్తోందన్నారు. కరోనా పరీక్షలను భారీ గాపెంచాలని అధికారులను ఆదేశించారు. ఫ్రంట్‌లైన్ వర్కర్లకు వాక్సినేషన్ భారీగా చేయించాలన్నారు. ఈ ప్రక్రియను వారం రోజుల్లో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

పోలీస్, పంచాయతీరాజ్, మునిసిపల్, ఆర్టీసీ, రెవెన్యూ శాఖల సిబ్బందికి వందశాతం వ్యాక్సినేషన్ చేపట్టడం కోసం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని ఆదేశించారు. కరోనా పరీక్షలను భారీగా పెంచేందుకు అన్ని జిల్లాలోను ఆర్టీపీసీఆర్ పరీక్షా కేంద్రాలను అధికంగా ఏర్పాటు చేయాలన్నారు. మాస్కులు ధరించే నిబంధనను కఠినంగా అమలు చేయాలన్నారు. ప్రజలు మాస్కు ధరించకపోతే వేయి రూపాయల జరిమానా విధించేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో పోలీస్ శాఖ తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. 45 సంవత్సరాల వారందరు వ్యాక్సినేషన్ వేయించుకోవాలని కోరారు.

Maharastra Covid Update : మహారాష్ట్రలో మరణ మృదంగం మోగిస్తున్న కరోనా..! టీకాల కొరతతో ఇబ్బందిపడుతున్న జనాలు..

మీరు హైదరాబాద్‌లో ఉంటున్నారా..! అయితే తప్పకుండా ఈ విషయం తెలుసుకోండి.. లేదంటే మీ జేబు ఖాళీ అవుతుంది..

Corona Mask: మాస్క్‌ లేకుండా పట్టుబడిలో 5 వేల రూపాయల జరిమానా.. కఠినంగా వ్యవహరిస్తున్న ఆ ప్రభుత్వం