AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

COVID-19: ఢిల్లీలోని ప్రధాన ఆసుపత్రిల్లో కరోనా కలకలం.. 70 మంది వైద్యులకు పాజిటివ్..

AIIMS - Sir Ganga Ram Hospital: దేశవ్యాప్తంగా కరోనావైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకూ కేసులు వేలల్లో వెలుగులోకి వస్తున్నాయి. లక్షకుపైగా రికార్డు స్థాయిలో

COVID-19: ఢిల్లీలోని ప్రధాన ఆసుపత్రిల్లో కరోనా కలకలం.. 70 మంది వైద్యులకు పాజిటివ్..
UK Covid-19 Update
Shaik Madar Saheb
|

Updated on: Apr 10, 2021 | 8:35 AM

Share

AIIMS – Sir Ganga Ram Hospital: దేశవ్యాప్తంగా కరోనావైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకూ కేసులు వేలల్లో వెలుగులోకి వస్తున్నాయి. లక్షకుపైగా రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతుండటంతో అంతటా ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న ప్రధాన ఆసుపత్రుల వైద్యులకు కరోనా నిర్థారణ అవుతుండటం భయభ్రాంతులకు గురిచేస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో పెద్ద ఎత్తున వైద్యులు కరోనా బారిన పడ్డారు. ఢిల్లీ ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఆసుపత్రిలో 32 మంది వైద్యులకు కరోనా సోకింది.

ఎయిమ్స్‌లో 32 మంది డాక్టర్లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు శుక్రవారం ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. దీంతోపాటు దాదాపు 30 మంది హెల్త్ వర్కర్లకు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయినట్లు పేర్కొంటున్నారు. రోజురోజుకు పెద్దఎత్తున కేసులు నమోదవుతుండటంతో ఎయిమ్స్‌లో నేటి నుంచి అత్యవసర సర్జరీలకు మాత్రమే అనుమతిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. సాధారణ చికిత్సలు ఉండవని.. పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా.. కరోనా బారిన పడిన వారంతా క్వారంటైన్‌లో ఉన్నారని ఎయిమ్స్ తెలిపింది.

ఇదిలాఉంటే.. ఢిల్లీలోని మరో ప్రముఖ గంగా రామ్‌ ఆసుపత్రిలో గురువారం 37 మంది వైద్యులకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. వీరిలో ఎక్కువ మంది యువకులు ఉన్నారు. వీరంతా కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నారని గంగారామ్ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం 32 మంది వైద్యులు హోమ్‌ క్వారంటైన్‌లో ఉండగా, ఐదుగురు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీలో పెద్ద ఎత్తున డాక్టర్లు కరోనా బారిన పడుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం సాయంత్రం వైద్య అధికారులతో సమీక్షించారు.

Also Read:

Fire Accident: కోవిడ్ ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం.. నలుగురు మృతి.. మరో ఇద్దరి పరిస్థితి విషమం

Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌కు కరోనా.. వ్యాక్సిన్ తొలిడోసు తీసుకున్నా వదలని మహమ్మారి