AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహారాష్ట్ర సర్కార్ సంచలన నిర్ణయం… ముంబైలో టీవీ సీరియళ్ల షూటింగ్‌ల రద్దు

కరోనా నియంత్రణలో భాగంగా మహారాష్ట్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ముంబైలో టీవీ సీరియళ్ల షూటింగ్‌లను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

మహారాష్ట్ర సర్కార్ సంచలన నిర్ణయం... ముంబైలో టీవీ సీరియళ్ల షూటింగ్‌ల రద్దు
Shutdowns Tv Serial Shooting In Mumbai
Balaraju Goud
|

Updated on: Apr 10, 2021 | 9:06 AM

Share

Shutdowns tv serial shooting: కరోనా నియంత్రణలో భాగంగా మహారాష్ట్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ముంబైలో టీవీ సీరియళ్ల షూటింగ్‌లను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే మినీ లాక్‌డౌన్‌లో భాగంగా హోటళ్లు, షాపింగ్‌ మాల్స్, సినిమా థియేటర్లు, ధార్మిక, దర్శనీయ స్థలాలు, మైదానాలు, జిమ్‌లు, సెలూన్లు మూసి వేసిన సంగతి తెలిసిందే. తాజా నిర్ణయంతో వివిధ టీవీ సీరియళ్ల షూటింగ్ నిలిచిపోనుంది.

దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరగుతోంది. మహమ్మారి కట్టడిలో భాగంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పాక్షిక లాక్‌డౌన్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఉదయం సెక్షన్‌ 144, రాత్రి సమయంలో కర్ఫ్యూతోపాటు వీకెండ్‌లో అంటే శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల నుంచి సోమవారం ఉదయం ఏడు వరకు సంపూర్ణ లాక్‌డౌన్‌ను విధించింది.

Read Also… West Bengal Election 2021 Phase 4 LIVE: బెంగాల్‌ 4వ దశ పోలింగ్‌ నేడే.. 44 స్థానాలకు 373 మంది పోటీ