Karthika Deepam: దీప కండిషన్ సీరియస్.. సంతోషంలో మోనిత…. దీపని ఎలా కాపాడుకోవాలి అనే ఆలోచనలో కార్తీక్..

Karthika Deepam latest episode: కార్తీక్, మోనిత ను తీసుకుని దీప ఆరోగ్యం గురించి మరో డాక్టర్ మాలతి దగ్గరకు వెళ్తాడు.. ఈ పేషేంట్ బతకడం కష్టం కార్తీక్.. అంటారు డాకర్ మాలతి.. వెంటనే అలా అనకు మాలతి.. నువ్వు ఇప్పటి వరకూ...

Karthika Deepam: దీప కండిషన్ సీరియస్.. సంతోషంలో మోనిత.... దీపని ఎలా కాపాడుకోవాలి అనే ఆలోచనలో కార్తీక్..
Karthika Deepam'
Surya Kala

| Edited By: Team Veegam

Apr 10, 2021 | 2:56 PM

Karthika Deepam Serial: తెలుగు బుల్లి తెర ప్రేక్షకులను ఆకట్టుకుని సక్సెస్ ఫుల్ గా సాగుతుంది కార్తీక్ దీపం. దాదాపు మూడేళ్లకు పైగా ప్రసారం అవుతున్న కార్తీక్ దీపం టాప్ రేటింగ్ లో దూసుకుపోతుంది. రోజుకో ట్విస్ట్ తో ఆసక్తికరంగా సాగుతున్న ఈ సీరియల్ ఈరోజు (ఏప్రిల్ 10) 1010 వ ఎపిసోడ్ లో అడుగు పెట్టింది. ఈరోజు హైలెట్స్ ను చూద్దాం..!

కార్తీక్, మోనిత ను తీసుకుని దీప ఆరోగ్యం గురించి మరో డాక్టర్ మాలతి దగ్గరకు వెళ్తాడు.. ఈ పేషేంట్ బతకడం కష్టం కార్తీక్.. అంటారు డాకర్ మాలతి.. వెంటనే అలా అనకు మాలతి.. నువ్వు ఇప్పటి వరకూ ఒక్క కేసు కూడా ఫైయిల్ కాలేదు.. ఇద్దరు పిల్లలకు తల్లి కావాలి అంటాడు. దీంతో మాలతి నేను బతకడం కష్టం అన్నాను కానీ బతికించడం కష్టంకాదు కార్తీక్ .. కేరింగ్ తీసుకోవాలి.. టైం కు మందులు వేసుకోవాలి అసలు మొత్తం ట్రీట్మెంట్ మీదే ఉండాలి.. పైగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.. నిజం చెప్పాలంటే ఒక గాజు బొమ్మలా చూసుకోవాలి అంటుంది.. దీపని ఎలాగైనా నువ్వే అంటే.. కూల్ కార్తీక్.. దీపని తీసుకుని రా.. ఆ దీపం కోడికట్టకుండా మనం చేతులు అడ్డు పెడదాం.. అంటారు మాలతి.. అర్జెంట్ గా ఆ మెడిసిన్స్ స్టార్ట్ చేయాలి.. తొందరగా దీపని ఇక్కడికి తీసుకుని రా అని చెబుతుంది.. ఇదంతా వింటున్న మోనిత .. చాలా సంతోష పడుతుంది..

మరోవైపు శ్రావ్య దిగులుగా కూర్చుకుని ఉంటుంది.. ఇంతలో సౌందర్య వచ్చి.. శ్రావ్య తో మాట్లాడుతుంది.. దీంతో శ్రావ్య.. తన అక్క దీప పరిస్థితి గురించి మాట్లాడుతుంది. మా అక్క తీసుకుని రావాలని అందరం కోరుకున్నాం.. ఎవరు సంతోషంగా ఉన్నారు.. పోనిలే ఇవాళటి తో నా కష్టాలు తీరిపోయాయని మా అక్క సంతోషంగా ఉందా అని ప్రశ్నిస్తుంది. మీరు నా కోడల్ని తీసుకుని రమన్నారు.. అయన తీసుకొచ్చారు. అంతటితో అయిపోయింది. ఇద్దరు అంతస్తులు వేరు.. ఇంకా మా అక్క గ్రౌండ్ ప్లోర్ లో ఉండిపోయింది..

ఇంకా నేలమీద నిలబడింది అత్తయ్య మీ కోడలు.. ఇవన్నీ నేను అడగలేదు అనుకున్నావా అంటుంది సౌందర్య.. మీరు ఎలా అడుగుతారు అత్తయ్య ఆ రైట్స్ లేవు. అంటుంది శ్రావ్య.. ఇంకేమి చెయ్యాలి.. చెప్పు చిన్నదానివి చెప్పవని నేను చిన్నబుచ్చుకొను అంటుంది సౌందర్య.. మా అక్కని భార్యగానే తెచ్చుకోమని బావగారికి చెప్పి ఉండాల్సింది.. అంటుంది శ్రావ్య.. ఆలా అయితే మీ బావగారు ఎప్పటికీతీసుకుని రాడు మారడు.. ఎప్పటికీ మారాడు.. ఒంటరి ఆడది.. ఇద్దరు పిల్లలు ముగ్గురు బతకాలి.. ఒంటరి ఆడది .. నేను ఎం చేయాలి.. బలవంతంగా తాడు కట్టి కట్టిపడెయ్యడానికి వాడు దూడ, ఆవు కాదు… మీ అక్కని సెల్ఫ్ రెస్పెక్ట్ చంపుకుని రమ్మనలేను.. మీ బావని కట్టిపారేయ్యాలేను.. భార్యగా తీసుకుని రాలేని వాడ్ని నా కోడలిగా తీసుకుని రమ్మాన్నాను.. అది తప్పా… వాడికి భార్య అవసరం లేదు.. కానీ నాకు నాకోడలి క్షేమం ముఖ్యం .. దాని భద్రత ముఖ్యం నా మనవరాల భవిష్యత్ ముఖ్యం.. అందుకే అత్తింటిని పుట్టిల్లుల్లా మార్చాను.. అందుకనే దానిని ప్రతి క్షణం కంటికి రెప్పలా కాపుకుంటూ ఉంటాను. రేపు సగం ఆస్తి రాసిస్తాను. ఎవరు అడ్డుపడిన ఐ డోంట్ కేర్.. ఇదంతా నా భర్త ఆస్తి.. పుట్టింటి వాళ్ళు పసుపు కుంకాలుగా రాసిచ్చిన ఆస్తిగా దానిపేరున రస్తా అంటుంది.. సౌందర్య. దీంతో శ్రావ్య కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి… అత్తగారి వ్యక్తిత్వానికి చేతులు ఎత్తి మొక్కుతుంది.

మురళీ కృష్ణ భాగ్యం అంటూ ఇంట్లోకి వస్తాడు… టెన్షన్ తో ఉన్న భాగ్యాన్ని చూస్తూ.. ఆమె చూస్తున్న వైపు చూస్తే.అక్కడ కార్తీక్ కూర్చుని ఉంటాడు. కార్తీక్ ఎదురుగా కూర్చున్న మురళీ కృష్ణ తో మీ ఫ్యామిలీలో మీ తాతముత్తాలను ఎప్పుడైనా చూశారా.. అంటాడు కార్తీక్.. దీంతో మురళీ కృష్ణ ఎందుకు బాబు అంటే.. వెర్రితనం మీ ఫ్యామిలీ ఉందేమో తెలుసుకుందామని అంటాడు కార్తీక్. మురళీ కృష్ణ షాక్ తింటాడు.ఇప్పుడు మీ అమ్మాయికి వయసు పెరిగింది కానీ.. బుద్దిపెరగలేదు.. మీకు అనుభవం పెరిగింది కానీ.. ఆలోచన పెరగలేదు.. పరిస్థితి విషమించిపోయింది.. అయినా ఏం తండ్రి అండీ మీరు.. పదేళ్ల నుంచి ఎం భర్త అండి మీరు అని నన్ను ప్రశ్నించడం కాదండీ.. అసలు దీప కన్నతండ్రిగా మీరేం వెలగబెట్టారు.. దాని బతుకు అదే బతకాలి. దాని చావు అదే చావాలి.. అంతేనా అంటాడు కార్తీక్ .. దీంతో మురళీ కృష్ణ బాబు అంటే.. ఎం వినలేకపోతున్నారా.. అంటూ కళ్లారా చూడగలిగారు కదండీ గుండె రాయి చేసుకుని..మీ కూతురు హెల్త్ బాలేదని మీకు ఎప్పుడు తెలిసింది అని కోపంగా మురళీ కృష్ణని ప్రశ్నిస్తాడు కార్తీక్. విజయనగరంలోనే బాబుఎం చేశారు.. .. హాస్పెటల్‌కి తీసుకుని వెళ్లాను బాబు అంటాడు మురళీ కృష్ణ ఎం రాశారు .. టెస్ట్‌లు.. అంటూ.. ఎం చేయించారు.. అంటే దీప .. అని నసుగుతూ ఉంటె.. చేయించలేదా .. ఒప్పుకోలేదా.. చింపి చెత్తబుట్టలో పడేశారు. మీ కూతురు అంటే.. కొవ్వొత్తిలా కరిగిపోయి పిల్లలకు గుడ్డి దీపంలా వెలుగునిద్దామనుకుంది .. మీరు ఓ ఐదు, పదివేలు పెట్టి టెస్టులు చేయించలేకపోయారా..? పోనీ మా అమ్మ ఇచ్చిన డబ్బులతో టెస్టులు చేయించాల్సిందిగా అంటాడు కార్తీక్. ఆబ్బె ఆవిడగారు ఎవరికే చెప్పవద్దు అని ఒట్టు వేయించుకుంది.. మీరు పిండి రుబ్బుతో.. పచ్చిమిర్చి మధ్యలోకి చీల్చి చింతపండు కూరుతూ కూర్చున్నారు.. అంటాడు కార్తీక్.. దీంతో మురళీకృష్ణ బుద్ధి ఉండాలి.. నాకు అది లేదు.. ఎం జరిగిందో చెప్పండి.. నాకు భయంగా ఉంది అని కన్నీరు పెడతాడు మురళీ కృష్ణ.

అసలు ఏమిటి అనారోగ్యం మరి అంతగా పాడైపోయిందా… హెల్త్ భయంగా ఉంది అంటాడు.. ఎం కాదు మందులు వాడితే తగ్గుతుంది.. అంటాడు కార్తీక్.. తెలిస్తే ఎం చేస్తారు.. తాయెత్తు కట్టిస్తారా.. దిష్టి తీస్తారా.. అంటాడు కార్తీక్.. కొన్ని మందులు ఇచ్చి.. మీ అమ్మాయికి ఇచ్చి.. మందులు రెగ్యులర్ గా వేసుకోమనండి.. నేను ఇచ్చినట్లు చెప్పకండి.. అంటాడు.. వెంటనే భాగ్యం కలుగజేసుకుని ఎందుకు బాబు.. మీరే ఇవ్వొచ్చుగా అంటుంది.. కార్తీక్.. కోపంగా మీరేమో అవసరం అయినవి చెప్పరు అనవసరమైనవి చెబుతారు. అంటాడు. ఈవిడేమో అవసరమా అనవసరమా అని ఉండదు.. అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.. మురళీకృష్ణ దీప ఎందుకు మందులు వేసుకోనంటుది అని ఆలోచిస్తాడు మురళీ కృష్ణ.. భాగ్యం దీపకి ఫోన్ చేసి కనుక్కొన్నా అంటుంది .

దీప మెట్ల మీద కూర్చుని.. తన గురించి పిల్లల భవిష్యత్ గురించి ఆలోచిస్తుంది. నా పరిస్థితే నాకు అర్ధం కావడం లేదు.. తల్లిగా చూసుకునే అత్తగారు.. కూతురిలా చూసే మామగారు.. తల్లిగా చూసుకునే మరిది.. తోడికోడలు పోరు లేదు.. మరి ఎందుకు నేను ఇక్కడ ఉండడం లేదు అని అందరూ అనుకుంటున్నారు.. కానీ నాకే ఉండబుద్ధి కావడం లేదు.. పెళ్లికి ముందు తుమ్మల పల్లి దీప.. పెళ్లైన తర్వాత కోవెలమూడి దీప.. అదే గోత్రం చెప్పుకోవాలి.. ఇదే నా ఉనికి స్త్రీ గా నేను పరిపూర్ణం కావాలంటే.. వీటన్నిటితో పాటు భర్త మనసులో నేను లేను అనే బాధ నన్ను నిలవనివ్వడం లేదు.. భర్త లేకపోతె మేమిటి.. ఇవన్నీ ఉంటాయి.. కనుక నేను ఈ ఇంట్లో ఉండాలా.. భగవంతుడా? ఏంటీ నాకీ పరీక్ష..? పిల్లల భవిష్యత్ కోసం నా ఆత్మగౌరవాన్ని చంపుకోవాలా . అప్పుడు నాకు ఈ ఇంట్లో ఉండే స్పందన లేని వస్తువులకు తేడా ఏమిటి ఉంటుంది .. ఖరీదైన మందులు కొనలేను కనుక ఉండాలా..పిల్లల భవిష్యత్ కోసం నా ఆత్మగౌరవం చంపుకోవాలా? నా మీద ప్రేమే లేదంటుంటే.. ఎందుకు ఉండాలి?’ అని ఆవేశంగా పైకి లేస్తుంది.. అనుకుంటూ మెట్ల మీద నుంచి లేచి.. కళ్ళు తిరగడంతో మళ్ళీ అక్కడే మెట్లపై కూలబడుతుంది. మేడ మీద శౌర్య తండ్రిని తల్చుంటు.. తండ్రితో గడిపిన రోజులను గుర్తు చేసుకుంటుంది. నాన్న హిమతో కూడా డల్ గానే ఉంటున్నాడు ఏమైంది అసలు.. నాన్న వస్తే నేను డాక్టర్ బాబు అని పిలుస్తాను.. అలాగే పిలువు బాగుంది అని అంటే..నా మీద ప్రేమ లేనట్టే.. వద్దు నాన్న అని పిలువు అంటే నా మీద ప్రేమ ఉన్నట్లే అంటూ ఆలోచిస్తుంది..

ఇంతలో కార్తీక్ కారు వస్తుంది.. దీంతో శౌర్య మేడ దిగి వచ్చి…పొద్దున్నే ఎక్కడికి వెళ్లారు డాక్టర్ బాబు అంటుంది. ఏమిటే రౌడీ.. కొత్తగా మాట్లాడుతున్నావు.. మీ అమ్మలాగే తిక్క ఉన్నట్లుండి..అంటాడు.. రాలొపలీ అంటూ వెళ్తుంటే.. నాన్న అంటూ శౌర్య కౌగిలించుకుంటుంది. గుడ్ ఇలాగే పిలువు అంటాడు.. ఇద్దరూ కలిసి లోపలి వెళ్లారు..మురళీ కృష్ణ ఇచ్చిన మందులను దీప తీసుకుంటుందా.. రెగ్యులర్ గా వేసుకుంటుందా..! అసలు దీప బతుకుతుందా..! నెక్స్ట్ ఎపిసోడ్ లో చూడాల్సిందే..!

Also Read: మనదేశంలో రావణ, దుర్యోధనుడు, కంస, హిడంబిలకు ఆలయాలు .. పూజలు ఎక్కడో తెలుసా..!

ప్రముఖ పుణ్యక్షేత్రం హ‌నుమంతుని జ‌న్మస్థానం.. ఆధారాలతో సహా నిరూపిస్తామంటున్న టీటీడీ .. ఎప్పుడంటే..!

వకీల్‌‌‌‌సాబ్ వసూల్.. తెలుగు రాష్ట్రాల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే…

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu