Pawan Kalyan’s Vakeel Saab: వకీల్‌‌‌‌సాబ్ వసూల్.. తెలుగు రాష్ట్రాల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే…

Vakeel Saab first day collection : దాదాపు మూడేళ్ల తర్వాత పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా 'వకీల్ సాబ్'. ఈ మూవీ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయింది. బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ 'పింక్‌'కు రీమేక్‌గా వచ్చిన 'వకీల్ సాబ్'కు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించగా..

Pawan Kalyan's Vakeel Saab: వకీల్‌‌‌‌సాబ్ వసూల్.. తెలుగు రాష్ట్రాల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే...
Vakeel Saab
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 10, 2021 | 12:35 PM

Vakeel Saab : దాదాపు మూడేళ్ల తర్వాత పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా ‘వకీల్ సాబ్’. ఈ మూవీ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయింది. బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ‘పింక్‌’కు రీమేక్‌గా వచ్చిన ‘వకీల్ సాబ్’కు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించగా.. దిల్ రాజు, బోనీకపూర్ సంయుక్తంగా నిర్మించారు. మొదటి షో నుంచే  పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న వకీల్ సాబ్‌.. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ భారీగా కలెక్షన్లు రాబడుతోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ.20 కోట్లు కలెక్ట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.38 నుంచి రూ.40 కోట్ల వరకు కలెక్ట్ చేసిందని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి.

అమెరికాలో ఈ చిత్రాన్ని వీకెండ్ సినిమా, సదరన్ స్టార్ ఇంటర్నేషనల్ సుమారు 260కి పైగా లోకషన్లలో విడుదల చేశాయి. అక్కడ ఒకరోజు ముందుగానే(ఏప్రిల్ 8న) పడ్డ ప్రీమియర్ల ద్వారా ఏకంగా 3 లక్షల డాలర్ల కలెక్షన్స్ వచ్చినట్లు వీకెండ్ సినిమా వెల్లడించింది. అలాగే ఇప్పటి వరకు వకీల్ సాబ్‌కు 4 లక్షల డాలర్లు వసూళ్లయ్యాయని వీకెండ్ సినిమా ట్వీట్ చేసింది. శుక్రవారం మధ్యాహ్నం 3.20 గంటల(యూఎస్ కాలమానం ప్రకారం) వరకు ఈ వసూళ్లు వచ్చినట్లు తెలియజేసింది. లాక్‌డౌన్ తర్వాత ఈ స్థాయిలో కలెక్షన్స్ సాధించిన తొలి భారతీయ చిత్రం కూడా వకీల్ సాబే.ఇక  వకీల్ సాబ్ సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకుంది కాబట్టి వారాంతంలో సినిమా వసూళ్లు ఇంకా పెరిగే అవకాశం ఉంది. కాగా, పవన్ కల్యాణ్ చివరగా నటించిన ‘అజ్ఞాతవాసి’ చిత్రం అమెరికాలో 2.06 మిలియన్ డాలర్ల కలెక్షన్లు రాబట్టింది. అలాగే  అయితే ఇటీవలే బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ అందుకున్న జాతిరత్నాలు సినిమా కూడా అక్కడ బాగానే వసూల్ చేసింది. జాతిరత్నాలు  ప్రీమియర్ షోలతో 132కే డాలర్స్ వసూల్ చేసినట్లు తెలుస్తుంది.

ఇక ఈ సినిమాకు యువ సంగీత దర్శకుడు తమన్ అందించిన సంగీతం స్పెషల్ అట్రాక్షన్స్ గా నిలిచింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఎలివేషన్స్ సన్నివేశాల్లో, తమన్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో థియేటర్స్ దద్దరిల్లుతున్నాయి. అలాగే వకీల్ సాబ్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ శివమణి, తమన్ లతో కలిసి డ్రమ్స్ వాయించడం ఆ ఈవెంట్ కే హైలైట్ గా నిలిచింది. ఈ క్రమంలో ఒక అభిమాని తమన్ తో కలిసి పవన్ డ్రమ్స్ వాయిస్తున్న ఫోటోను అందంగా ఆర్ట్ గా గీశాడు. ఈ ఆర్ట్ను తన సోషల్ మీడియాలో షేర్ చేసిన తమన్ ఆ ఫ్యాన్ కు ధన్యవాదాలు తెలిపాడు.

మరిన్ని ఇక్కడ చదవండి :  Karthika Deepam: దీప కండిషన్ సీరియస్.. సంతోషంలో మోనిత…. దీపని ఎలా కాపాడుకోవాలి అనే ఆలోచనలో కార్తీక్..

Vakeel Saab: వకీల్ సాబ్ పై ఆచార్య ప్రశంశలు.. తనదైన స్టైల్ లో పవన్ సినిమాకు రివ్యూ ఇచ్చిన మెగాస్టార్

రైతులకు కేంద్రం గుడ్ న్యూస్… ఎరువు ధరలపై కీలక ప్రకటన.. వివరాలు ఇవే…