AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rebel Star Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్ కు చిర్రెత్తుకొచ్చింది.. ఏకంగా సోషల్ మీడియాలో..

రెబల్ స్టార్ ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే రాధాకృష దర్శకత్వంలో తెరకెక్కిన రాధేశ్యామ్ సినిమా షూటింగ్ ను పూర్తి చేసాడు. ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.

Rebel Star Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్ కు చిర్రెత్తుకొచ్చింది.. ఏకంగా సోషల్ మీడియాలో..
Prabhas
Rajeev Rayala
|

Updated on: Apr 10, 2021 | 12:01 PM

Share

Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే రాధాకృష దర్శకత్వంలో తెరకెక్కిన రాధేశ్యామ్ సినిమా షూటింగ్ ను పూర్తి చేసాడు. ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. పిరియాడికల్ లవ్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా తర్వాత బాలీవుడ్ దర్శకుడు ఓ రౌత్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఈ సినిమా రామాయణ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటిస్తున్నాడు. సీతగా బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్ నటిస్తుంది. లంకేశ్ గా సైఫ్ అలీఖాన్ కనిపించనున్నాడు.

ఈ మూవీ తర్వాత డార్లింగ్ ‘కేజీఎఫ్’ తో సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు ‘సలార్’ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ సినిమా షూటింగ్ ను కూడా మొదలు పెట్టేసాడు ప్రభాస్. ఈ సినిమాలతోపాటు నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. అయితే ఇన్ని సినిమాలతో బిజీగా డార్లింగ్ ఉంటే.. అభిమానులు మాత్రం తీవ్ర నిరాశలో ఉన్నారు. నిజం చెప్పాలంటే యూవీ క్రియేషన్స్ పై కోపంగా ఉన్నారు. దానికి కారణం ఏంటంటే..

రాధేశ్యామ్ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. అయినా ఇంతవరకు సినిమాకు సంబందించిన అప్డేట్స్ విషయంలో నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ఆలస్యం చేయడంతో ఫ్యాన్స్ కు చిర్రెత్తుకొచ్చింది. రాధేశ్యామ్ సినిమా కంటే వెనకాల మొదలైన ఇతర హీరోల సినిమాలు రిలీజ్ కూడా అవుతున్నాయి. ఈ తరుణంలో రాధేశ్యామ్ నుంచి టీజర్ ను కానీ ట్రైలర్ ను కానీ , కనీసం సాంగ్స్ కానీ రిలీజ్ చేయడంలేదు. దాంతో అభిమానులంతా గుర్రుగా ఉన్నారు. అప్పుడెప్పుడో సినిమాకు సంబందించిన చిన్న గ్లిమ్స్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. దాంతో నిరాశలో ఉన్న అభిమానులు సోషల్ మీడియా వేదికగా నిర్మాతలను ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు ‘నిద్ర లే యువీ క్రియేషన్స్’ అనే హ్యాష్ ట్యాగ్ తో నెగెటివ్ ట్రెండ్ క్రియేట్. ఇప్పుడు ఇది వైరల్ అవుతుంది. ఇది నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతోంది. మరి ఇప్పటికైనా యువీ క్రియేషన్స్ ఫ్యాన్స్ మొర ఆలకిస్తారేమో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Jabardasth Fame Vinod:మళ్ళీ పోలీసులను ఆశ్రయించిన జబర్దస్త్ కమెడియన్ వినోద్ .. న్యాయం చేయమని వినతిపత్రం

థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు