Jabardasth Fame Vinod:మళ్ళీ పోలీసులను ఆశ్రయించిన జబర్దస్త్ కమెడియన్ వినోద్ .. న్యాయం చేయమని వినతిపత్రం

Jabardasth Fame Vinod:తెరముందు తమ నటనతో అందరిని నవ్విస్తూ.. సంతోష పరిచే కొందరి కళాకారుల జీవితాలు తెరవెనుక కన్నీటి మయం.. ఈ విషయానికి రుజువు.. జబర్దస్త్ వినోద్..

Jabardasth Fame Vinod:మళ్ళీ పోలీసులను ఆశ్రయించిన జబర్దస్త్ కమెడియన్ వినోద్ .. న్యాయం చేయమని వినతిపత్రం
Jabaradast Vinod
Follow us
Surya Kala

|

Updated on: Apr 10, 2021 | 11:33 AM

Jabardasth Fame Vinod:తెరముందు తమ నటనతో అందరిని నవ్విస్తూ.. సంతోష పరిచే కొందరి కళాకారుల జీవితాలు తెరవెనుక కన్నీటి మయం.. ఈ విషయానికి రుజువు.. జబర్దస్త్ వినోద్.. జీవితం. కష్టపడి.. కూడబెట్టుకున్న డబ్బుతో ఇల్లు కొనుక్కోవాలనుకున్నాడు. ఆ ఇంటి మీద ఆశ అతనిని కష్టాలు పాలు చేసింది. గతంలోనే ఇంటి ఓనర్ దాడిలో తీవ్రంగా గాయపడి చావు అంచుల వరకూ వెళ్లి వచ్చాడు జబర్దస్త్ వినోద్.. అలియాస్ వినోదిని. అప్పుడు.. ఇంటి విషయంపై అద్దె ఇంటి యజమానిపై పోలీసు కేసు పెట్టాడు.. తర్వాత మళ్ళీ ఏ వార్తలు వినిపించలేదు.. దీంతో అంతా సెట్ అయిపోయి ఉంటుంది అని భావించారు.. అయితే తాజగా వివాదానికి కారణమైన ఇంటి విషయంలో తనకి న్యాయం జరగలేదని.. బెదిరింపులు ఎక్కువయ్యాయంటూ న్యాయం చేయాలని కోరుతూ జబర్దస్త్‌ వినోద్‌ ఈస్ట్‌ జోన్‌ డీసీపీ రమేష్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.

తాను ప్రస్తుతం నివాసం ఉంటున్న అద్దె ఇంటిని అమ్ముతానని ఇంటి ఓనర్ రూ.40లక్షలకు అగ్రిమెంట్‌ చేసుకున్నారని వినతి పత్రంలో వినోదిని పేర్కొన్నాడు. అందుకని ఏడాది క్రితం రూ.13.40లక్షలు అడ్వాన్సు కూడా ఇంటి యజమానికి ఇచ్చానని .. అయితే ఇప్పడూ ఆ ఇంటిని రూ.40లక్షల కంటే ఎక్కువ ఇస్తేనే ఇల్లు అమ్ముతానని అంటున్నాడు.. అంతేకాదు.. ఏడాది క్రితం అడ్వాన్స్ గా ఇచ్చిన రూ.13.40లక్షలు కూడా తిరిగి ఇవ్వమని బెదిరిస్తున్నాడని తెలిపాడు వినోద్..

అంతేకాదు ఇంటి విషయంలో గతంలో ఇంటి యజమాని దాడి చేశాడు.. అప్పడు ఏ ఘటనపై అప్పట్లో కాచిగూడ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని.. అయినప్పటికీ ఇప్పటి వరకూ అతనిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని.. తనకు ఎటువంటి న్యాయం జరగలేదని ఫిర్యాదులో తెలిపాడు వినోద్.. కనుక ఇప్పటికైనా తనకు న్యాయం చేయమని కోరుతూ.. వినోద్ డీసీపీకి వినతి పత్రం అందజేశాడు.

హైదరాబాద్ కుత్బిగూడలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్న వినోద్.. ఆ ఇంటిని ఖరీదు చేసే విషయంలో యజమానికి వినోద్ కి మనస్పర్థలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వినోద్ పై 2019 జూలై లో ఇంటి యజమాని దాడి చేశాడు. ఇంటి ఓనర్ ప్రమీల, భర్త బాలాజీ, పెద్ద కొడుకు ఉదయ్ సాగర్, చిన్న కొడుకు అభిషేక్, పెద్ద కోడలు సంధ్య తనపై దడి చేశారని వినోద్ పోలీసులను ఆశ్రయించాడు.

తనకి ఇల్లు అమ్ముతానని అడ్వాన్స్ తీసుకోవడమే కాకుండా.. తనపై హత్యాయత్నం చేశారని… కులం పేరుతో దూషించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు వినోద్.దాంతో నిందితులపై ఐపీసీ 323, 506 సెక్షన్లతో పాటు ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కి తరలించిన విషయం తెలిసిందే. మళ్ళీ దాదాపు 18 నెలల తర్వాత మళ్ళీ వినోద్ ఇంటి యజమానిపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను ఆశ్రయించాడు.

Also Read: దీప కండిషన్ సీరియస్.. సంతోషంలో మోనిత…. దీపని ఎలా కాపాడుకోవాలి అనే ఆలోచనలో కార్తీక్..