- Telugu News Photo Gallery Spiritual photos Interesting stories of unconventional deities temples in india
Offbeat Indian Temples: మనదేశంలో రావణ, దుర్యోధనుడు, కంస, హిడంబిలకు ఆలయాలు .. పూజలు ఎక్కడో తెలుసా..!
భారత దేశంలో అనేక మతాలు, సంప్రదాయాలు.. నమ్మకాలు. హిందూపురాణాల్లో దేవతలుంటే దెయ్యాలు ఉంటాయి. దైవం ఉన్న చోట రాక్షసులుంటారని అంటారు. అయితే దేవతలకు గుడులు కట్టి వారిని ఆరాధిస్తున్నాం..పూజిస్తున్నాం.. అయితే కొన్ని ప్రాంతాల్లో సంప్రదాయానికి భిన్నంగా రావణ, కంస , ధుర్యోధన వంటి వారి దేవాలయాలున్నాయి.
Updated on: Apr 09, 2021 | 4:31 PM

హిందువుల పవిత్రమైన పురాణం గ్రంధం రామాయణం.. ఇందులో రాముడు హీరో అయితే.. రాముడి భార్యను ఎత్తుకెళ్లిన రావణుడు విలన్.. చెడ్డ వ్యక్తి.. అయితే మధ్యప్రదేశ్ లోని రావణ్ గ్రామ్ లో రావణ ఆలయం ఉంది. ఈ గ్రామంలోని గ్రామస్థులు రావణుడిని పూజిస్తారు. రావణుడు విశ్రమించిన భంగిమలో 10 అడుగుల ఎత్తులో ఇక్కడ విగ్రహం ఉంది. దేవుడిగా పూజలను అందుకుంటున్నారు. రావణబ్రహ్మ

కృష్ణుడు మేనమామ కంసుడు హిందూ పురాణాల ప్రకారం చెడ్డవాడు. సొంత చెల్లెలు, బావమరిదిని జైల్లో బంధించి .. తన ప్రాణాలను కాపాడుకోవడానికి పసికందులను హతమార్చాడు.. చివరికి మేనల్లుడు కృష్ణుడి చేతిలో మరణిస్తాడు. అయినప్పటికీ కంసుడిని దైవంగా పూజించే ఆలయం ఉత్తర్ ప్రదేశ్ లో హర్దోయ్ లో ఉంది. ఇక్కడ కంస ఆలయంలో కొన్నేళ్ల పాటు ధ్యానం చేశాడని స్థానికులు విశ్వసిస్తారు.

కేరళ లోని పొరువజిలో పెరువృతి అనే గ్రామంలో దుర్యోధనుడిని దైవంగా కొలుస్తారు. ఈ ఆలయం కేరళ శిల్ప కళాచాతుర్యానికి ప్రతీకగా నిలుస్తుంది. అయితే ఇక్కడ ఆలయంలో విగ్రహం ఉండదు.. ఆలయ మండపంలో ఎత్తయిన గద్దె మాత్రమే ఉంటుంది. ప్రజల క్షేమం కోసం ఆయన శివుడిని పూజించినందున, ఆయన్ని స్థానికులు పవిత్ర ఆత్మగా భావించి.. పూజిస్తారు.

పాండవుల్లో ఒకడైన భీముడు భార్యల్లో ఒకరు హిడంబి. రాక్షస జాతికి చెందిన హిడంబిని భీముడు వనవాస సమయంలో పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికీ ఘటోత్కచుడు పుట్టాడు. అయితే హిమాచల్ ప్రదేశ్ లోని మనాలిలో హిడంబికి ఓ ఆలయం ఉంది. ఆమె ధ్యానం చేసి ఆత్మజ్ఞానం పొందిన ప్రాంతం ఇది అని స్థానికులు విశ్వసిస్తారు. ఐతే ఇక్కడ ఆలయంలో హిడంబి విగ్రహం లేదు.. ఆమె రెండు పాదముద్రలు భక్తితో పూజిస్తారు స్థానికులు




