Karthika Deepam: అనుమానం పోకుండా అభిమానం ఎలా వస్తుంది.. నేను డాక్టర్‌బాబుని నమ్మను అంటున్న భాగ్యం..

Karthika Deepam Serial: తెలుగు బుల్లి తెర ప్రేక్షకులను ఆకట్టుకుని సక్సెస్ ఫుల్ గా సాగుతుంది కార్తీక్ దీపం. దాదాపు మూడేళ్లకు పైగా ప్రసారం అవుతున్న కార్తీక్ దీపం టాప్ రేటింగ్ లో దూసుకుపోతుంది. రోజుకో ట్విస్ట్ తో ఆసక్తికరంగా సాగుతున్న ఈ సీరియల్..

Karthika Deepam: అనుమానం పోకుండా అభిమానం ఎలా వస్తుంది.. నేను డాక్టర్‌బాబుని నమ్మను అంటున్న భాగ్యం..
Karthika Deepam
Follow us

|

Updated on: Apr 09, 2021 | 12:49 PM

Karthika Deepam Serial: తెలుగు బుల్లి తెర ప్రేక్షకులను ఆకట్టుకుని సక్సెస్ ఫుల్ గా సాగుతుంది కార్తీక్ దీపం. దాదాపు మూడేళ్లకు పైగా ప్రసారం అవుతున్న కార్తీక్ దీపం టాప్ రేటింగ్ లో దూసుకుపోతుంది. రోజుకో ట్విస్ట్ తో ఆసక్తికరంగా సాగుతున్న ఈ సీరియల్ ఈరోజు (ఏప్రిల్ 9) 1009 వ ఎపిసోడ్ లో అడుగు పెట్టింది. ఈరోజు హైలెట్స్ ను చూద్దాం..!

హిమ.. అమ్మ ఒక్కతే గెస్ట్ రూమ్ లో ఉంటుంది.. అమ్మ అమ్మే కదా అమ్మ గెస్టా .. ఎవరికి గెస్ట్ నీకా.. అందరికా.. మరి గెస్ట్ అంటే వచ్చి వెళ్లిపోయేవారు కదా డాడీ.. అంటూ తండ్రిని ప్రశ్నిస్తుంది. దీంతో కార్తీక్ ఆలోచనలో పడతాడు.. దీప నా జీవితంలోకి వచ్చిన గెస్టా… లేక ఈ లోకంలోకి వచ్చిన గెస్టా.. అనుకుంటాడు.

మురళీ కృష్ణ తో భాగ్యం మాట్లాడుతూ.. నాకు నా కూతురుగురించి దిగులు లేదు… కానీ నీకు నీ కూతురుగురించి ఏమైనా దిగులుందా అని ప్రశ్నిస్తుంది.. ఏమైనా ఉంటె…దీప చెబుతుంది అంటాడు.. దీప ఏనాడైనా మనకు కష్టం చెప్పుకోవడానికి వచ్చిందా? ఆయన దీపను నమ్మడు.. నేను ఆయన్ని నమ్మను..పదేళ్లుగా మారని మనిషి..పదిరోజుల్లోనే మారిపోయాడు అంటే నేను నమ్మను.. దీప మీద అనుమానం పోనిదే అభిమానం ఎలా పుట్టుకొస్తుంది అంటుంది. మరి ఎం చేద్దాం అని అంటాడు మురళీ కృష్ణ.. దీపని రోజూ వెళ్లి పలకరించి వస్తే.. అక్కడ ఎం జరుగుతుందో తెలుస్తుంది. ఈరోజు నేను వెళ్తాను.. రేపు మీరు వెళ్ళండి అని అంటుంది భాగ్యం.. సరేనంటాడు. కానీ భాగ్యం మాటలనే తలుచుకుంటూ మురళీ కృష్ణ ఆలోచనలో పడతాడు.

దీప చీరలు మడత పెడుతుంటే.. కార్తీక్ వచ్చి రెడీ అవ్వు..ఆస్పత్రికి వెళ్దాం అంటాడు. నీ ఆరోగ్యం బాగోలేదు ఆస్పత్రికి వెళ్దాం అంటే.. పదేళ్లుగా బాగోలేదు.. నా తలరాతే బాగోలేదు.. నా మనసే బాగోలేదు అయితే అంటుంది. అయితే ఆస్పటల్ కి తీసుకుని వెళ్తాను.. అంటే అవసరం లేదు.. నీకు అవసరం లేకపోవచ్చు.. నీ పిల్లలకు నీ అవసరం ఉంది. అయితే హాస్పటల్ కి వెళ్లాల్సిందే.. ఒక్కమాట అడుగుతా చెప్పండి డాక్టర్ బాబు.. ఇప్పుడు సౌందర్య కోడలిగా ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారా..! మీ భార్యకు ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారా..! లేదంటే దేశోద్ధారకులు కదా.. పేదలకు అనాథలకుఉచితంగా వైద్య సేవ అందిస్తున్నట్లు నాకు చికిత్స చేయిస్తున్నారా.. మీ పిల్లలకు పెంపుడు తండ్రిగా ఇప్పిస్తున్నా అంటాడు కార్తీక్.. అయితే రాను.. నేను పిల్లలని పెంపకానికి ఇచ్చి.. ఇప్పుడు వైద్యం తీసుకుంటే.. వాళ్ళని అమ్మకానికి పెట్టుకున్నదానిని అవుతా అంటుంది దీప.. స్టుపిడ్ లా ఆలోచిస్తున్నావు.. అంటాడు కార్తీక్.. దీంతో దీప అక్కడ ఏమని చెప్పాలి పెళ్లి కాకముందు డాటర్ ఆఫ్ మురళీ కృష్ణ అని రాసేదానిని.. పెళ్లి అయ్యాక వైఫ్ ఆఫ్ డాక్టర్ కార్తీక్ అని రాజధానిని ఇప్పుడు ఏమని రాయాలి అని అంటుంది.. ఏమి అక్కర్లేదు దీప అని రాస్తే చాలు అంటదు కార్తీక్.. అయితే అసలు రాను… నాకు ఏ ఐడెంటిటీ లేకుండా అసలు రాను అంటుంది.

‘ఇది పంతమా? మొండితనమా? మూర్ఖత్వమా?’ అంటాడు. ‘మూడు అనుకోండి.. మరి మీరు చేసింది ఏంటీ? నేను చెప్పనా? మోసం..’ అంటుంది దీప. ‘ఏంటీ నేను నిన్ను మోసం చేశానా?’ అంటాడు కార్తీక్. పదేళ్ల క్రితం మీరు చేసిన మోసం గురించి నేను మాట్లాడం లేదు.. రెండు రోజుల క్రితం చేసిన మోసం గురించి మాట్లాడుతున్నా అంటూ కన్నీరు పెట్టుకుంటుంది. మోసమే.. అక్కడ నాకు ఏం చెప్పకుండా మీరు ఎందుకు తీసుకొస్తున్నారో చెప్పకుండా ఈ ఇంటికి తీసుకొచ్చి ఒకే ఒక్క వేటు వేశారు..

అది మోసం కాదా అని ప్రశ్నిస్తుంది. నీ ఆరోగ్యం అసలు బాగోలేదు.. ఇంకా క్షీణించిపోతుంది అంటాడు కార్తీక్.. ఈ అనారోగ్యం నీరసం నాకు ఎప్పుడూ ఉండేదే.. నా పేరు ముందు అత్తింటి పేరు, నా భర్త పేరు లేకుండా ఒట్టి దీపగా రాలేను.. అయినా ఈ ఒట్టి దీప ఇంట్లో ఉంటె ఏమిటి..? అడవిలో ఉంటె ఏమిటి అంటుంది కన్నీరుతో దీప.. అసలు కర్మం ఏమిటంటే భర్త ఉండి కూడా భర్త పేరు చెప్పుకోకపోవడం.. ఆ భర్త హృదయం స్థానం లేకపోవడం.. పెళ్ళైన స్త్రీకి భర్తే లోకం.. నా భర్త మనసులో స్థానం లేదు ఇదే నన్ను మానసికంగా కుంగదీసి నా ఆరోగ్యం క్షీణించేలా చేస్తోంది. దయచేసి తులసి చెప్పింది నమ్మి నా మీద పడిన నిందని చెరిపేసి నన్ను మీ భార్యగా స్వీకరించండి.. చితి మీద నుంచైనా మీరు పిలిస్తే లేచి వస్తాను.. లేదంటే.. అని కార్తీక్ కి దణ్ణం పెట్టి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కార్తీక్ కన్నీరుతో అక్కడ సోఫాలో కూర్చుండిపోతాడు. మరోవైపు హిమ బాధగా ఆలోచిస్తుంటుంది.. ఇంతలో శౌర్య వచ్చి.. నువ్వు కూడా అమ్మలా ఆలోచిస్తున్నావు అని ప్రశ్నిస్తుంది. ఎం లేదు.. అమ్మ గురించే అమ్మ ఎందుకు గెస్ట్ రూమ్ లో ఉందా అని ఆలోచిస్తున్నా అంటుంది. దీంతో శౌర్య అమ్మ ఉంది గెస్ట్ రూమ్ అని అంటారా.. మరి నువ్వు నాన్నని అడగలేదా అంటే.. అడిగా ఎం చెప్పలేదు.. వెళ్ళిపోయాడు.. అని హిమ అనగానే.. పోనీ అమ్మని అడగాల్సింది కదా అంటుంది శౌర్య.. లేదు.. అమ్మ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అదోమాదిరిగా ఉంది.. ఇక్కడ ఉండడం ఇష్టం లేదు అన్నట్లుగా ఉంది. అంటుంది. శౌర్య అమ్మకి ఇష్టం లేకపోతె ఎందుకువస్తుంది.. మనతో చాలా సార్లు అందికదా నాన్నతో కలిసి ఉండడం ఇష్టం అంటుంది. నాన్నని నువ్వే అడగాలి.. అంటుంది శౌర్య.. రిచ్ ఇళ్లలో భార్యాభర్తలు ఇద్దరూ వేరువేరుగా ఉంటారా అని శౌర్య అని ప్రశ్నిస్తుంది. వారణాసి ఉంటె అన్ని చెప్పేవాడు.. వారాణసికి డ్రైవర్ గా ఉద్యోగం ఇప్పించాలి.. అంటుంది హిమ.. ఒప్పుకోకపోతే పళ్లు ఊడగొడతాను నేను .. అప్పుడు పెళ్లి కాదు కాబట్టి చచ్చినట్లు వస్తాడు అంటుంది శౌర్య.

ఇక దీప కోపంతో రగిలిపోతూ.. కూరగాయలు కట్ చేస్తుంటుంది. ఇంతలో ఆనందరావు సౌందర్యలు వస్తారు.. ఎందుకు నీకు ఇంకా ఈ పనులు అని అంటుంది సౌందర్య.. మళ్ళీ ప్రాక్టీస్ పొతే వంటలక్కలా బతికే రోజు కష్టమవుతుంది అంటుంది. ఇందుకా నేను తిరిగి వచ్చింది? ఇందుకా నేను నమ్మి వచ్చింది.? ఎవరికి అర్ధమవుతుంది నా బాధ అంటూ కన్నీరు పెట్టుకుంటుంది.. మాకు అర్ధమవుతుంది నీ బాధ.. వాడు మరెవరకూ నువ్వు కాస్త ఓపిక పట్టు అంటుంది.. ఇలా మీరుచెప్పిన ప్రతిసారి నా మనసుకు సర్దిచెప్పుకుంటూనే ఉంటున్నా.. అని దీప ఏడుస్తుంది. కానీ ప్రతిసారీ బొమ్మని చేసి ఆడుకుంటున్నాడు. ఈ ఇల్లు మీది .. ఈ ఆస్థి మీది నీకు ఆస్తిమీద నీకు హక్కు ఉంది అంటాడు ఆనందరావు. ఎందుకు అతయ్య ఆస్తి .. ఆస్తి కోసమా ఇన్నాళ్లు ఎదురు చూసింది.. అదే మోనిత లాంటిది అయితే ఇప్పటికి ఆస్థి తీసుకుని పిల్లలని తీసుకుని వెళ్లిపోయేది అంటుంది.. నాకు మనసు ఉంటుందని మరిచిపోతున్నాడు. ఎందుకు నేను ఉండాలి? ఎందుకు బతికుండాలి?’ అని ఏడుస్తూ అక్కడనుంచి వెళ్లిపోతుంది దీప. దీప వైపు కన్నీరు పెట్టుకుని సౌందర్య, ఆనందరావులు చూస్తుండిపోతారు,..

Also Read: తెలంగాణలో కలకం సృస్టిస్తోన్న కరోనా.. భారీగా పెరుగుతోన్న కేసులు.. తాజాగా..

పవన్ అభిమానుల పండగ మొదలైంది.. ప్రేక్షకుల ముందుకు వచ్చిన వకీల్ సాబ్..

IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన