విజృంభిస్తున్న కరోనా మమ్మారి.. వైరస్ బారినపడి మాజీ ఎంపీ శ్యామాచరణ్ గుప్తా కన్నుమూత

కరోనా మహమ్మారి మరో నేతను మింగేసింది. యూపీలోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త, మాజీ ఎంపీ శ్యామాచరణ్ గుప్తా కన్నుమూశారు.

  • Balaraju Goud
  • Publish Date - 1:31 pm, Sat, 10 April 21
విజృంభిస్తున్న కరోనా మమ్మారి.. వైరస్ బారినపడి మాజీ ఎంపీ శ్యామాచరణ్ గుప్తా కన్నుమూత
Prayagraj Former Bjp Mp Shyama Charan Gupta

Former Allahabad MP dies: కరోనా మహమ్మారి మరో నేతను మింగేసింది. యూపీలోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త, మాజీ ఎంపీ శ్యామాచరణ్ గుప్తా కన్నుమూశారు. కరోనా బారిన పడిన శ్యామాచరణ్ గుప్తా ఢిల్లీలోని మ్యాక్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఈ విషయాన్ని ఆయన బంధువు అనిల్ అగ్రహరి మీడియాకు తెలియజేశారు.

మార్చి 31న శ్యామా చరణ్ గుప్తా కరోనా వైరస్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆయన ప్రయాగ్‌రాజ్‌లోని రాణి నెహ్రు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. కానీ అతని పరిస్థితి మెరుగుపడలేదు. ఆరోగ్యం క్షిణించడంతో అతన్ని ఢిల్లీలోని మాక్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వెంటిలేటర్‌పై చికిత్సపొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు.

శ్యామాచరణ్ గుప్తా భార్య జమనోత్రి కూడా ప్రస్తుతం కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం ఆమె హోం ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. శ్యామాచరణ్ గుప్తా బీజేపీ తరపున ఎంపీగా ఉన్నారు. అంతకుముందు ఆయన ప్రయాగ్‌రాజ్‌కు మేయర్‌గా కూడా వ్యవహరించారు.