Covid-19 News Update: కోవిడ్ కాటుకు మరో ఎమ్మెల్యే మృతి.. కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో విషాదం..
Raosaheb Antapurkar: దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. నిత్యం కేసులతోపాటు.. మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ మహమ్మారి
Raosaheb Antapurkar: దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. నిత్యం కేసులతోపాటు.. మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ మహమ్మారి సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులను కూడా పొట్టనబెట్టుకుంటోంది. తాజాగా కరోనా బారిన పడిన మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే మరణించారు. మహారాష్ట్రకు చెందిన ఎమ్మెల్యే రావు సాహెబ్ అంతపుర్కర్ (64) శుక్రవారం రాత్రి మరణించారు. కొన్ని రోజుల క్రితం రావు సాహెబ్ కు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ కావడంతో.. ఆయన ముంబైలోని ఓ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఏప్రిల్ 1వ నుంచి ఆయన పరిస్థితి విషమించడంతో వైద్యులు రావుసాహెబ్‌ను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతూ శుక్రవారం అర్థరాత్రి తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు, కుటుంబసభ్యులు తెలిపారు.
మార్చి 19న రావు సాహెబ్ అంతపుర్కర్ కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆ తర్వాత ఆయన్ను మెరుగైన చికిత్స కోసం మార్చి 22న ముంబై ఆసుపత్రికి తరలించారు. మార్చి 28న ఆయనకు కరోనా నెగిటివ్ నిర్ధారణ అయింది. అయినప్పటికీ.. ఎమ్మెల్యే ఆరోగ్యం మరింత విషమించడంతో ఆయన్ను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. రావు సాహెబ్ నాందేడ్ జిల్లాలోని డేగ్లూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి అంతపుర్కర్ రెండు సార్లు గెలుపొందారు.
Also Read: