Covid-19: కోవిడ్ డేంజర్ బెల్స్…దేశంలో అత్యధిక యాక్టివ్ కేసులు ఈ 10 జిల్లాల్లోనే…
Covid-19 News Update: దేశంలో కరోనా సెకండ్ వేవ్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం విడుదల చేసిన డేటా మేరకు 24 గం.ల వ్యవధిలో దేశంలో 1.45 లక్షల కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి.
దేశంలో కరోనా సెకండ్ వేవ్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం విడుదల చేసిన డేటా మేరకు 24 గం.ల వ్యవధిలో దేశంలో 1.45 లక్షల కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో యాక్టివ్ కోవిడ్ కేసుల సంఖ్య తొలిసారిగా 10 లక్షల ఎగువునకు చేరింది. శనివారం ఉదయానికి దేశంలో 10,46,000 యాక్టివ్ కోవిడ్ కేసులున్నాయి. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోనే అత్యధిక కోవిడ్ కేసులు నమోదవుతున్నారు. యాక్టివ్ కేసుల్లో దాదాపు 46 శాతం 10 జిల్లాల్లోనే నమోదవుతున్నాయి. ఆ జిల్లాలు ఏవేవో ఇక్కడ చూద్దాం.
1.పూణె: దేశంలోని మొత్తం యాక్టివ్ కేసుల్లో అత్యధికంగా 9.54 శాతం పూణె జిల్లాలో ఉన్నాయి.
2.ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబై జిల్లాలో 8.41 శాతం యాక్టివ్ కేసులున్నాయి.
3.థానె: మహారాష్ట్రలోని మరో నగరం థానెలో 6.45 శాతం యాక్టివ్ కేసులున్నాయి.
4.నాగ్‌పూర్: మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నగరంలో 6.02 శాతం యాక్టివ్ కేసులున్నాయి.
5.బెంగళూరు అర్బన్: దేశంలోని మొత్తం యాక్టివ్ కేసుల్లో 4.06 శాతం ఇక్కడివే.
6.నాసిక్: మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో 3.44 యాక్టివ్ కోవిడ్ కేసులున్నాయి.
7.దిల్లీ: దేశ రాజధానిలో 2.54 శాతం కోవిడ్ యాక్టివ్ కేసులున్నాయి.
8.రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాజధానిలోనూ అత్యధిక కోవిడ్ యాక్టివ్ కేసులున్నాయి. అక్కడ 1.78 శాతం కేసులున్నాయి.
9.దుర్గ్: ఛత్తీస్‌గఢ్‌లోని రెండో పెద్ద నగర ప్రాంతమైన దుర్గ్‌లో 1.76 శాతం కోవిడ్ యాక్టివ్ కేసులున్నాయి.
10.ఔరంగాబాద్: మహారాష్ట్రలోని ఈ జిల్లాలో 1.62 శాతం యాక్టివ్ కేసులున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది .
దేశంలో కోవిడ్ యాక్టివ్ కేసులు అత్యధికంగా ఈ ఐదు రాష్ట్రాలు… మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, కేరళలో నమోదయ్యాయి.