West Bengal Elections: ఎన్నికల వేళ బయటపడ్డ 200 బాంబులు.. నిర్వీర్యం చేసిన పోలీసులు.. ముగ్గురు అరెస్టు
West Bengal Elections: పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నాలుగో విడత పోలింగ్ జరుగుతున్న వేళ సుమారు 200 బాంబులు బయటపడటం కలకలం రేపుతోంది. నానూర్..
West Bengal Elections: పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నాలుగో విడత పోలింగ్ జరుగుతున్న వేళ సుమారు 200 బాంబులు బయటపడటం కలకలం రేపుతోంది. నానూర్ గ్రామంలోని ప్రభుత్వ కమ్యూనిటీ హాల్లో దాదాపు 200 బాంబులను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ బీర్బం జిల్లా అధ్యక్షుడు అనుబ్రాతా మోండల్ స్వగ్రామం నానూరు కావడంతో బీజేపీ ఆరోపణలు గుప్పించింది.
నానూర్‌లో బాంబులు ఉన్నాయన్న పక్కా సమాచారంతో తనిఖీలు చేపట్టామని, ఇందులో 200 బాంబులు, బాంబుల తయారీ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు ముగ్గురిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న బాంబులను సీఐడీ బాంబ్ స్క్వాడ్ ఖాళీ ప్రదేశంలో నిర్వీర్యం చేసినట్ల పోలీసులు వెల్లడించారు. అయితే ఎన్నికల సమయంలో ఇలా బాంబులు బయటపడటంతో భయాందోళన నెలకొంది. ఇవి ఎక్కడి నుంచి తీసుకువచ్చారు..? దేని కోసం తీసుకువచ్చారు.. ? అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఒక్కసారిగా 200 బాంబులు బయట పడటంతో భారీ ఎత్తున తనిఖీలు ముమ్మరుం చేశారు.
కాగా, పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పలు ప్రాంతాల్లో ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. పోలింగ్ ప్రాంతాల్లో భద్రతా పరమైన చర్యలు చేపట్టారు. ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపడుతున్నారు. పలు ప్రాంతాల్లో ఇలాంటి బాంబులు, ఇతర పేలుడు పదార్థాలు ఉండే అవకాశాలు ఉండటంతో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు.
ఇవీ చదవండి: Congress: కాంగ్రెస్ పార్టీలో ఏం జరగబోతోంది? మే 2 ఎందుకు అధిష్టానానికి కీలకంగా మారింది? స్పెషల్ స్టోరీ!