Viral: ఇదేం విచిత్రం.! మూడు వారాల గర్భవతి మళ్లీ గర్భం దాల్చింది.. నోరెళ్లబెడుతున్న ప్రజలు..
Viral News Update: సోషల్ మీడియాలో తరచూ ఎన్నో రకాల విచిత్రమైన వార్తలు చదివి ఉంటారు. ఇప్పుడు చెప్పబోయేది కూడా అలాంటిదే...
Viral News Update: సోషల్ మీడియాలో తరచూ ఎన్నో రకాల విచిత్రమైన వార్తలు చదివి ఉంటారు. ఇప్పుడు చెప్పబోయేది కూడా అలాంటిదే. మూడు వారాల గర్భవతి మళ్ళీ గర్భం దాల్చిన చిత్రమైన సంఘటన గురించి మీరు ఎప్పుడైనా విన్నారా.? ఈ విషయాన్ని నమ్మడం కొంచెం కష్టమే అయినా.. ఇది నిజం. ఈ చిత్రమైన సంఘటన ఇంగ్లాండ్‌లోని విల్ట్‌షైర్‌లో చోటు చేసుకుంది.
రెబెక్కా రాబర్ట్స్ అనే మహిళ మొదటిగా ఓ బిడ్డతో గర్భం దాల్చి.. అనూహ్యంగా మూడు వారాల వ్యవధిలోనే మరో బిడ్డను కూడా కడుపులో మోస్తోంది. ఈ విషయాన్ని వైద్యులే స్వయంగా వెల్లడించారు. ఇదేం విచిత్రం అంటూ డాక్టర్లు ఖంగుతిన్నారు. దీన్ని అరుదైన ఘటనగా పేర్కొన్నారు.
మొదట గర్భం దాల్చిన రెబెక్కా శరీరంలో మూడు వారాల వ్యవధిలో మరో అండం విడుదలైనట్లు వైద్యులు పేర్కొన్నాడు. ఇక అది అనూహ్య రీతిలో పిండంగా మారిందని వివరించారు. అయితే రెండో బిడ్డలో ఎదుగుదల సరిగ్గా లేదని.. పుట్టిన ఎక్కువసేపు జీవించకపోవచ్చునని భావించారు. అయితే ఆ ఊహలన్నీ పటాపంచలు అయ్యాయి. గతేడాది సెప్టెంబర్‌లో రెబెక్కా ఇద్దరూ బిడ్డలకు జన్మనిచ్చింది. పుట్టిన తర్వాత బిడ్డలను కొన్ని రోజులు వైద్యుల పర్యవేక్షణలో ఉంచగా.. ఇప్పుడు ఆ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు.
Also Read:
Viral: గుడిలో చోరీకి యత్నించాడు.. దేవుడు పనిష్మంట్ ఇచ్చాడు.. ఆ శిక్ష ఏంటంటే.
ఆ గ్రామంలో నివసించాలనుకునే వారికి ఇల్లు, కారు ఫ్రీ.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు.!
Viral News: 10 ఏళ్లు.. రూ. 221 కోట్లు.. ఈ బుద్దోడు ఇంతలా ఎలా సంపాదించాడంటే.!
View this post on Instagram