AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sonia Gandhi: దేశంలో కరోనా వ్యాక్సిన్ కొరత.. ప్రధాని మోదీపై కామెంట్స్ చేసిన సోనియా గాంధీ..

Sonia Gandhi: దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ ఉధృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ..

Sonia Gandhi: దేశంలో కరోనా వ్యాక్సిన్ కొరత.. ప్రధాని మోదీపై కామెంట్స్ చేసిన సోనియా గాంధీ..
Sonia Gandhi
Shiva Prajapati
|

Updated on: Apr 10, 2021 | 4:05 PM

Share

Sonia Gandhi: దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ ఉధృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ శనివారం నాడు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడిన ఆమె.. కోవిడ్19 పరీక్ష, ట్రాకింగ్, టీకాలు వేయడాన్ని ప్రధానంగా చేపట్టాలని సూచించారు. ‘టెస్టింగ్, ట్రాకింగ్, వ్యాక్సినేషన్.. ఈ మూడు అత్యంత ప్రధాన్యతో కూడిన అంశాలు. వీటిని పకడ్బందీగా అమలు చేయండి.’ అని సోనియా పేర్కొన్నారు. కాగా, టీకా లభ్యత, మెడిసిన్స్, వెంటిలేటర్లతో సహా కోవిడ్19 నివారణకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై కూడా సోనియా గాంధీ సమీక్షించారు. అలాగే.. కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీలతో ఆశించిన ఫలితం వచ్చిందా? అని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులను సోనియా గాంధీ ఆరా తీశారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బాగేల్ ఉన్నారు.

కాగా, కోవిడ్ వ్యాక్సిన్ నిర్వహణ అంశంలో కేంద్రం తీరును కాంగ్రెస్ నేతలు తీవ్రంగా విమర్శించారు. కోవిడ్ సంక్షోభాన్ని అంచనా వేయడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందన్నారు. వ్యాక్సిన్లను విదేశాలకు ఎగుమతి చేసి.. దేశంలో వ్యాక్సిన్ల కొరతను సృష్టించిందని కేంద్రం తీరుపై కాంగ్రెస్ నేతలు ధ్వజమెత్తారు. దేశంలో రోజు రోజుకు కోవిడ్19 కేసులు పెరిగిపోతున్నందున అన్ని బహిరంగ సభలు, ఎన్నికల ర్యాలీలను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సోనియా గాంధీ డిమాండ్ చేశారు. ఎన్నికలు, మతపరమైన ఫెస్టివల్స్, సామూహిక సమావేశాలు కరోనా వైరస్‌ వ్యాప్తిని మరింత పెంచాయాన్నరు. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలన్నారు. దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అవసరమైన చర్యలు చేపట్టాలని కేంద్రాన్ని ఆమె కోరారు.

ఇదిలాఉంటే.. దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ కొరత ఏర్పడటంపై కాంగ్రెస్ నేతలు భగ్గుమన్నారు. విదేశాల ప్రాపకం కోసం.. దేశ ప్రజలను ఇబ్బంది పెట్టడం ఏంటని ప్రధాని నరేంద్ర మోదీ తీరును ఎండగట్టారు. ఏప్రిల్ 11వ తేదీ నుంచి 14 వ తేదీ రవకు ‘టీకా ఉత్సవ్’ పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపునకు రాహుల్ గాంధీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఓవైపు దేశంలో టీకా కొరత సృష్టించి.. మరోవైపు టీకా ఉత్సవ్ చేసుకోమనడం ఏంటని ప్రశ్నించారు. ‘ఇది తీవ్రమైన సమస్య.. పండుగ కాదు’ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. వ్యాక్సిన్ కొరత నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోదీకి.. రాహుల్ గాంధీ లేఖ రాశారు. ‘వ్యాక్సిన్ ఎగుమతులపై తక్షణం నిషేధం విధించండి. వ్యాక్సిన్ల ఉత్పత్తి వేగం పెంచండి. ఇతర వ్యాక్సిన్లకూ అనుమతి ఇవ్వండి’ అని లేఖలో ప్రధాని మోదీని కోరారు.

Congress Tweet:

Also read:

Pushpa Teaser: “తగ్గేదే లే” అంటున్న అల్లు అర్జున్.. రికార్డులు బద్దలు కొట్టుకుంటూ.. దూసుకుపోతున్న పుష్ప టీజర్

Viral News: 73 ఏళ్ల వృద్ధ మహిళ వరుడు కావాలంటూ ప్రకటన.. ముందుకొచ్చిన 69 ఏళ్ల వ్యక్తి..!

West Bengal Election 2021 Phase 4 LIVE: బెంగాల్‌ కొనసాగుతున్న 4వ దశ పోలింగ్‌.. సీఆర్పీఎఫ్ బలగాల కాల్పుల్లో నలుగురు మృతి