Trivikram Srinivas: కరోనాను జయంచిన మాటల మాంత్రికుడు.. త్రివిక్రమ్ కు నెగిటివ్ గా నిర్ధారణ
కరోనా మహమ్మారి దేశంలో కల్లోలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే కరోనా కేసులు తగ్గుతున్నాయని ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో సెకండ్ వేవ్ అంటూ మరో సారి
Trivikram Srinivas: కరోనా మహమ్మారి దేశంలో కల్లోలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే కరోనా కేసులు తగ్గుతున్నాయని ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో సెకండ్ వేవ్ అంటూ మరో సారి విరుచుకుపడుతుంది ఈ మహమ్మారి.దాంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే సామాన్యులు, సినిమాతారలు అంతా కరోనా బారిన పడుతున్నారు. టాలీవుడ్ లో చాలా మంది ఇప్పటికే కరోనా మహమ్మారి బారినపడ్డారు. ఇటీవల మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. దాంతో ఆయన సెల్ఫ్ ఐసొలేషన్ లో ఉన్నారు.
తాజాగా త్రివిక్రమ్ కరోనా బారి నుంచి బయటపడ్డారని తెలుస్తుంది. తాజాగా నిర్వహించిన టెస్ట్ ల్లో ఆయనకు నెగిటివ్ గా నిర్ధారణ అయ్యింది. త్రివిక్రమ్ ఓ వైపు స్వీయ దర్శకత్వం లో సినిమా తెరకెక్కించడానికి రంగం సిద్ధం చేస్తూనే.. మరోవైపు పవన్ కళ్యాణ్ సినిమా కోసం మాటలను సిద్ధం చేస్తున్నారు. మాటల రచయితగా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడిగా తనదైన ముద్రవేశారు. ప్రస్తుతం త్రివిక్రమ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాతోపాటు సూపర్ స్టార్ మహేష్ బాబుతో కూడా సినిమాను లైన్ లో పెట్టారని తెలుస్తుంది.
మరిన్ని ఇక్కడ చదవండి :
పవర్ స్టార్ పైన ప్రశంసలు కురిపించిన సూపర్ స్టార్.. పవన్ టాప్ ఫామ్ లో ఉన్నారన్న మహేష్
Prabhas: నెట్టింట చక్కర్లు కొడుతున్న రెబల్ స్టార్ ప్రభాస్ రేర్ ఫోటో.. ఆనందంలో అభిమానులు
బాలీవుడ్లోకి ‘అపరిచితుడు’.. విక్రమ్ పాత్రలో నటించనున్న ఆ స్టార్ హీరో… అక్కడ కూడా హిట్టు కొట్టేనా ?