AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gangubai Kathiawadi : ఒక్క టీజర్ తో సినిమాపై అంచనాలను ఆకాశానికి చేర్చారు..

బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న సినిమా  "గంగూబాయి కతియావాడి". బాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో ప్రముఖ జర్నలిస్ట్ హుస్సేన్‌ జైదీ రచించిన

Gangubai Kathiawadi : ఒక్క టీజర్ తో సినిమాపై అంచనాలను ఆకాశానికి చేర్చారు..
Gangubai Kathiawadi
Rajeev Rayala
|

Updated on: Apr 11, 2021 | 10:48 AM

Share

Gangubai Kathiawadi : బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న సినిమా  “గంగూబాయి కతియావాడి”. బాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో ప్రముఖ జర్నలిస్ట్ హుస్సేన్‌ జైదీ రచించిన “మాఫియా క్వీన్స్ అఫ్ ముంబై” అనే పుస్తకం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. సంజయ్‌ లీలా భన్సాలీ, డా. జ‌యంతిలాల్‌గ‌డ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రంలో ‌బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవ్‌గన్, ఇమ్రాన్ హష్మి గెస్ట్ రోల్‌లో కనిపించనున్నారు. ఈ చిత్రంలో గంగూబాయిగా అలియా భట్‌ వేశ్య గృహం నడిపే యజమానిగా నటిస్తోంది. ఇప్పటికే పాత్రకు సంబంధించిన పోస్టర్‌ విడుదలై ఆకట్టుకుంటోంది.

ఇటీవల ‘గంగూబాయి కతియావాడి’ టీజర్ ను విడుదల చేశారు చిత్రయూనిట్. ఇప్పుడు ఈ టీజర్ యూట్యూబ్ ను షేక్ చేస్తుంది. 35 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతుంది ఈ టీజర్. ఈ టీజర్ లో  యంగ్ బ్యూటీ అలియా భట్ మరోసారి తన నటనతో ఆకట్టుకుంది. ఓ వేశ్య అందరినీ శాసించే నాయకురాలిగా ఎలా ఎదిగింది ? అనేదే సినిమా ప్రధానాంశంగా ఈ సినిమాలో చూపించనున్నారు. ఒక్క టీజర్తోనే సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశారు దర్శకుడు సంజయ్ లీలా బన్సాలి. ఇటీవలే ఈ సినిమా తెలుగు టీజర్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమాను  జూలై 30న ప్రపంచవ్యాప్తంగా `గంగూబాయి క‌తియ‌వాడి` చిత్రం విడుదలవుతుంది. ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. ఇక ఈ సినిమాతోపాటు అలియా ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతుంది. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో అలియా సీత పాత్రలో రామ్ చరణ్ కు జోడీగా నటిస్తుంది. ఇక చరణ్ ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న విషయం తెలిసిందే.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Kavita Kaushik: బిగ్ బాస్ వల్ల నా కెరియర్ నాశనం అయ్యింది.. సంచలన కామెంట్స్ చేసిన నటి

Trivikram Srinivas: కరోనాను జయంచిన మాటల మాంత్రికుడు.. త్రివిక్రమ్ కు నెగిటివ్ గా నిర్ధారణ

పవర్ స్టార్ పైన ప్రశంసలు కురిపించిన సూపర్ స్టార్.. పవన్ టాప్ ఫామ్ లో ఉన్నారన్న మహేష్

Follow Us
రూ.1000 లంచం అడిగితే లక్ష బహుమతి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం..
రూ.1000 లంచం అడిగితే లక్ష బహుమతి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం..
ఉప్మా అంటే ముఖం మాడ్చుకుంటున్నారా?కమ్మని పెరుగు ఉప్మా ట్రై చేయండి
ఉప్మా అంటే ముఖం మాడ్చుకుంటున్నారా?కమ్మని పెరుగు ఉప్మా ట్రై చేయండి
6 గంటల్లోనే విజయవాడ టు బెంగళూరు.. కొత్త హైవే త్వరలోనే..
6 గంటల్లోనే విజయవాడ టు బెంగళూరు.. కొత్త హైవే త్వరలోనే..
అలాంటి పరిస్థితి వస్తే జీవితంలో అసలు పెళ్లే చేసుకోను..
అలాంటి పరిస్థితి వస్తే జీవితంలో అసలు పెళ్లే చేసుకోను..
పెళ్లైన పురుషులు అస్సలు చేయకూడని నంబర్ వన్ తప్పు ఇదీ!
పెళ్లైన పురుషులు అస్సలు చేయకూడని నంబర్ వన్ తప్పు ఇదీ!
ఐపీఎల్ తోపులకు మొండిచేయి.. దేశవాళీ హీరోలకే జై కొట్టని గంభీర్
ఐపీఎల్ తోపులకు మొండిచేయి.. దేశవాళీ హీరోలకే జై కొట్టని గంభీర్
హాస్పిటల్స్ ఖర్చులు లేకుండా ఆరోగ్యాన్ని ఇచ్చే రాగి సమోసాలు
హాస్పిటల్స్ ఖర్చులు లేకుండా ఆరోగ్యాన్ని ఇచ్చే రాగి సమోసాలు
జీతం రాగానే అయిపోతోందా? డబ్బు ఆదా చేయడానికి స్మార్ట్ టిప్స్!
జీతం రాగానే అయిపోతోందా? డబ్బు ఆదా చేయడానికి స్మార్ట్ టిప్స్!
కాల్షియం, ప్రోటీన్ డ్రింక్.. వేసవి దాహాన్ని ఇట్టే తీరుస్తుంది..
కాల్షియం, ప్రోటీన్ డ్రింక్.. వేసవి దాహాన్ని ఇట్టే తీరుస్తుంది..
మెడపై ఉన్న మొండి నలుపు మాయం అవ్వడం ఖాయం.. ఇలా చేయండి!
మెడపై ఉన్న మొండి నలుపు మాయం అవ్వడం ఖాయం.. ఇలా చేయండి!