Kavita Kaushik: బిగ్ బాస్ వల్ల నా కెరియర్ నాశనం అయ్యింది.. సంచలన కామెంట్స్ చేసిన నటి
బిగ్ బాస్ .. భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులను అలరిస్తున్న రియాలిటీ షో ఇది. ఇప్పటికే అన్ని భాషల్లో మంచి టీఆర్పీ తో దూసుకుపోతున్న ఈ షో ద్వారా ఎంతో మంది చిన్న చిన్న ఆర్టిస్ట్ లు వెలుగులోకి వచ్చారు
Kavita Kaushik: బిగ్ బాస్.. భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులను అలరిస్తున్న రియాలిటీ షో ఇది. ఇప్పటికే అన్ని భాషల్లో మంచి టీఆర్పీ తో దూసుకుపోతున్న ఈ షో ద్వారా ఎంతో మంది చిన్న చిన్న ఆర్టిస్ట్ లు వెలుగులోకి వచ్చారు. ఇక తెలుగులోనూ ఈ షోకు మంచి క్రేజ్ ఉంది. ఇప్పటికే మనదగ్గర ఈ రియాలిటీ షో విజయవంతంగా నాలుగు సీజన్స్ పూర్తి చేసుకొని ఐదో సీజన్ కు సిద్ధం అవుతుంది. అయితే కొంతమంది బిగ్ బాస్ షో ఒక ఫేక్ షో అని రకరకాల కామెంట్లు చేస్తుంటారు. షోలో పాల్గొన్న వారు కూడా ఆ షోనుంచి బయటకు వచ్చి నెగిరిటివ్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. తాజాగా ఓ బిగ్ బాస్ బ్యూటీ కూడా అలాంటి కామెంట్లే చేసింది. ఈ షో వల్ల తన కెరియర్ నాశనం అయ్యిందని చెప్పుకొచ్చింది.
అసలు విషయం ఏంటంటే.. హిందీ బిగ్ బాస్ సీజన్ 14లో వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చింది నటి కవిత కౌశిక్ . 14వ సీజన్ విజేత రుబీనాతో పెద్ద గొడవ తర్వాత ఎలిమినేట్ అయ్యింది. అయితే తాజాగా ఆమె అభిమానులతో సోషల్ మీడియా ద్వారా ముచ్చటిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘ఈ ఫేక్ రియాలిటీ షో ద్వారా నాకు ఒరిగింది ఏమీలేదు. అయినా ఓసారి ఇమేజ్ పాడైందంటే ఇక మనం ఫ్రీగా ఉండొచ్చు.’ అని చెప్పుకొచ్చింది. అయితే హోస్ లో ఉన్నన్ని రోజులు ఈ అమ్మడు గొడవలు పడుతూనే ఉంది. కవిత బిగ్ బాస్ అనేది ఒక ఫేక్ షో అంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
మరిన్ని ఇక్కడ చదవండి ;
Trivikram Srinivas: కరోనాను జయంచిన మాటల మాంత్రికుడు.. త్రివిక్రమ్ కు నెగిటివ్ గా నిర్ధారణ
పవర్ స్టార్ పైన ప్రశంసలు కురిపించిన సూపర్ స్టార్.. పవన్ టాప్ ఫామ్ లో ఉన్నారన్న మహేష్
Prabhas: నెట్టింట చక్కర్లు కొడుతున్న రెబల్ స్టార్ ప్రభాస్ రేర్ ఫోటో.. ఆనందంలో అభిమానులు