AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: 66 ఏళ్ల వయసులో కూడా ఏంటీ ఎనర్జీ. ఏంటీ గ్రేస్.. నెట్టింట వైరల్‌గా మారిన రేఖ డ్యాన్స్ వీడియో

రేఖ వయసెంత? ఆమె గ్లామర్‌ సీక్రెట్టేంటి? ఆమె వేసే స్టెప్పులేంటి? ఇప్పుడు సర్వత్రా నడుస్తున్న హాట్ టాపిక్‌ ఇదే! అంతలా సీనియర్ హీరోయిన్‌గ రేఖ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు.

Viral News: 66 ఏళ్ల వయసులో కూడా ఏంటీ ఎనర్జీ. ఏంటీ గ్రేస్.. నెట్టింట వైరల్‌గా మారిన రేఖ డ్యాన్స్ వీడియో
Rekha Dance
Ram Naramaneni
| Edited By: Team Veegam|

Updated on: Apr 12, 2021 | 9:07 PM

Share

రేఖ వయసెంత? ఆమె గ్లామర్‌ సీక్రెట్టేంటి? ఆమె వేసే స్టెప్పులేంటి? ఇప్పుడు సర్వత్రా నడుస్తున్న హాట్ టాపిక్‌ ఇదే! అంతలా సీనియర్ హీరోయిన్‌గ రేఖ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. రీసెంట్‌ ఇండియన్‌ ఐడల్‌ షోలో గెస్ట్ గా పాల్గొన్న ఈ గ్లామర్‌ క్వీన్.. తన ప్రజెన్స్‌తో పాటు పర్ఫామెన్స్‌తోనూ మెస్మరైజ్‌ చేశారు. 66 ఏళ్ల వయసులోనే ఆమెలోని గ్లామర్‌ మాత్రమే కాదు గ్రేస్‌ కూడా ఏ మాత్రం తగ్గలేదని ప్రూవ్ చేశారు రేఖ.

లాస్ట్ వీక్ ఇండియన్‌ ఐడల్‌ను టీవీ ఆడియన్స్‌ అస్సలు మర్చిపోలేకపోతున్నారు. అందుకు మెయిన్‌ రీజన్‌ సీనియర్‌ నటి రేఖ. ఈ షోలో గెస్ట్‌గా పాల్గొన్న రేఖ, కంటెస్టెంట్‌లతో కలిసి కాలు కదిపారు. ముఖ్యంగా షణ్యుఖ ప్రియ పాటకు రేఖ చేసిన డ్యాన్స్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఈ షోలో తన ఎంట్రీతోనే అందరి మనసూ గెలుచుకున్నారు రేఖ. చేతిలో దీపంతో వచ్చిన రేఖ… కంటెస్టెంట్‌లతో పాటు జెడ్జెస్‌, గెస్ట్‌కు కూడా దిష్టి తీశారు. తరువాత షణ్ముఖ ప్రియ పాటకు ఫిదా అయిన రేఖ.. ఆమెను పొగడ్తలతో ముంచెత్తారు. అక్కడితో ఆగిపోలేదు.. ఆమెతో కలిసి డ్యాన్స్‌ కూడా చేశారు. ఈ షోలో తన పర్సనల్ లైఫ్‌ గురించి కూడా ఓపెన్‌గా మాట్లాడారు రేఖ. హోస్ట్ జై… రేఖను ఉద్దేశించి ఓ ఇంట్రస్టింగ్ కామెంట్ చేశారు.. ‘ఓ మహిళ ఓ వ్యక్తిని ఇంతగా ప్రేమిస్తుందా…? అది కూడా పెళ్లైన వ్యక్తిని’ అంటూ కామెంట్ చేశారు. అయితే ఈ కామెంట్‌ను సరదాగా తీసుకున్న రేఖ.. ఏది ‘నన్ను డైరెక్ట్‌గా అడుగు’ అని నవ్వుతూ రియాక్ట్ అయ్యారు.

షోలో రేఖ చూపించిన ఎనర్జీ అందరినీ ఆశ్చర్యనికి గురి చేసింది. షోలో కంటెస్టెంట్‌లను ఎంకరేజ్‌ చేస్తూ వారితో కలిసి డ్యాన్స్‌ చేస్తూ పాటలు పాడుతూ స్టేజ్‌ను మరింత కలర్‌ఫుల్‌గా మార్చేశారు. అయితే అక్కడక్కడ ఎమోషన్స్‌ కూడా పండాయి. సవాయ్‌ భట్‌ పాటతో ఎమోషనల్ అయిన రేఖ సవాయ్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ఆమె మాటలతో సవాయ్‌ కూడా ఆనందంతో కంటతడిపెట్టుకున్నారు. సవాయ్‌ కోసం స్పెషల్‌గా పన్నీర్‌తో తయారు చేసిన వంటకాన్ని కూడా తెచ్చారు రేఖ.

ఫైనల్‌గా ‘దిల్‌ హితో హై’ సాంగ్‌కు రేఖ పర్ఫామెన్స్‌ షోకే హైలెట్‌గా నిలిచింది. ఈ ఏజ్‌లోనూ అద్భుతమైన డ్యాన్స్‌తో అలరించిన రేఖకు కంటెస్టెంట్‌లు స్టాండింగ్‌ ఓవేయేషన్ ఇచ్చారు. ఈ సీజన్‌ చాలా రోజులుగా ప్రసారం అవుతున్నా.. రేఖ పాల్గొన్న ఈ ఎపిసోడ్ మాత్రం మోస్ట్ మెమరబుల్ అంటున్నారు టెలివిజన్ ఆడియన్స్‌.

Also Read: హృదయ విదారకం.. విజయవాడలో తండ్రి, కుమార్తె ఆత్మహత్య.. సూసైడ్ నోట్‌లో కన్నీరు పెట్టించే మాటలు

వాలంటీర్లకు సీఎం జగన్ గుడ్ న్యూస్ .. అందుకోసం రూ.260 కోట్లు విడుదల

తిరుమలలోనే అంజనీపుత్రుడు హనుమంతుడు జన్మించాడా? మరి దేశంలోని మిగతా ప్రజల విశ్వాసమేమిటి..?