AP volunteers: వాలంటీర్లకు సీఎం జగన్ గుడ్ న్యూస్… అందుకోసం రూ.260 కోట్లు విడుదల

ఏపీలో వాలంటీరు వ్యవస్థకు దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తోన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కరోనా వ్యాప్తి సమయంలో వారి సేవలు అభినందనీయం...

AP volunteers: వాలంటీర్లకు సీఎం జగన్ గుడ్ న్యూస్... అందుకోసం రూ.260 కోట్లు విడుదల
CM-Jagan
Follow us

|

Updated on: Apr 11, 2021 | 3:47 PM

ఏపీలో వాలంటీరు వ్యవస్థకు దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తోన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కరోనా వ్యాప్తి సమయంలో వారి సేవలు అభినందనీయం. ఈ క్రమంలో ఉత్తమ పనితీరు కనబర్చిన వాలంటీర్లను ఉగాది రోజున సత్కరించాలని సీఎం జగన్ నిర్ణయించారు. తాజాగా ఈ కార్యక్రమానికి అవసరమైననిధులను ఏపీ సర్కార్ విడుదల చేసింది. మొత్తం రూ.261 కోట్లు రిలీజ్ చేస్తూ ఆర్ధికశాఖ ప్రత్యేక కార్యదర్శి సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. సేవా వజ్ర, సేవా రత్న, సేవామిత్ర పేరిట మొత్తం మూడు కేటగిరీల్లో వాలంటీర్లను సత్కరించనున్నారు.  ఉగాది రోజున సీఎం చేతుల మీదుగా ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం కానుంది. సేవా వజ్రకు రూ.30 వేలు, సేవారత్నకు రూ.20 వేలు, సేవా మిత్రకు రూ.10 వేల నగదు పురస్కారం ఇవ్వనున్నారు.

మొత్తం 2,22,900 మంది గ్రామ, వార్డు వాలంటీర్లను ఈ అవార్డులతో సత్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉగాది నుంచి ప్రతి జిల్లాలో రోజూ ఒక నియోజవర్గంలో వాలంటీర్లకు అవార్డులు, సత్కార కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఫస్ట్ కేటగిరీలో 2,18,115 మంది వాలంటీర్లకు సేవా మిత్ర అవార్డు అందజేస్తారు. ఎలాంటి కంప్లైంట్ లేకుండా ఏడాదికిపైగా సేవలందించినవారిని ఈ అవార్డుకు ఎంపిక చేస్తారు. వీరికి రూ.10 వేలు నగదు, ప్రశంసా పత్రం, శాలువా, బ్యాడ్జితో సత్కరిస్తారు. సెకండ్ కేటగిరీలో 4,000 మంది వాలంటీర్లకు సేవా రత్న అవార్డు ఇస్తారు. ఈ అవార్డుకు ప్రామాణికంగా పింఛన్ల పంపిణీ, ఇంటివద్దకే డెలివరీ, ఇంటింటి సర్వే,పెన్షన్‌ కార్డు, రైస్‌ కార్డు, ఆరోగ్య శ్రీ కార్డులు మంజూరు చేయించడం వంటి కార్యక్రమాల్లో చూపిన సమర్థత ఆధారంగా ఎంపిక చేస్తారు. ప్రతి మండలంలో ఐదుగురు చొప్పున, మున్సిపాలిటీల్లో ఐదుగురు చొప్పున, కార్పొరేషన్లలో పది మంది చొప్పున మొత్తం 4,000 మంది వాలంటీర్లను సేవా రత్న అవార్డులకు ఎంపిక చేస్తారు. వీరికి రూ.20 వేలు నగదు, సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జి, మెడల్‌తో సత్కరించనున్నారు.

మూడో కేటగిరీలో 875 మంది వాలంటీర్లకు ‘సేవా వజ్ర’ అవార్డు ఇస్తారు. వృత్తిలో నిబద్ధత చూపించినవారిని అసెంబ్లీ నియోజకవర్గానికి ఐదుగురు చొప్పున 875 మంది వాలంటీర్లను ‘సేవా వజ్ర’ అవార్డుకు ఎంపిక చేస్తారు. వీరిని రూ.30 వేల నగదు, సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జి, మెడల్‌తో సత్కరించనున్నారు.

Also Read:  భార్య ప్రేమతో లంచ్ చేస్తుంటే… ఆఫీసులో అమ్ముకుంటున్న భర్త.. రీజన్ చాలా సిల్లీ..!

57 ఏళ్ల మహిళ 62 ఏళ్ల తన భర్తను పక్కా స్కెచ్ వేసి హతమార్చింది.. షాకింగ్ రీజన్.. ఇలా కూడా ఆలోచిస్తారా..?

ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?