హృదయ విదారకం.. విజయవాడలో తండ్రి, కుమార్తె ఆత్మహత్య… సూసైడ్ నోట్‌లో కన్నీరు పెట్టించే మాటలు

విధి ఆడిన వింత నాటకంలో ఆ కుటుంబం బలైపోయింది. ఏడాదిన్నర క్రితం భార్య, బిడ్డతో ఆనందంగా గడిపిన వ్యక్తికి ఊహించని విధంగా ఆర్ధిక ఇబ్బందులు దాడి చేయడం, భార్య అనారోగ్యానికి...

  • Ram Naramaneni
  • Publish Date - 1:14 pm, Sun, 11 April 21
హృదయ విదారకం.. విజయవాడలో తండ్రి, కుమార్తె ఆత్మహత్య... సూసైడ్ నోట్‌లో కన్నీరు పెట్టించే మాటలు
Father Daughter Suicide

విధి ఆడిన వింత నాటకంలో ఆ కుటుంబం బలైపోయింది. ఏడాదిన్నర క్రితం భార్య, బిడ్డతో ఆనందంగా గడిపిన వ్యక్తికి ఊహించని విధంగా ఆర్ధిక ఇబ్బందులు దాడి చేయడం, భార్య అనారోగ్యానికి గురవడం వంటి సమస్యలు ఒకదాని తర్వాత మరొకటి దాడి చేయడంతో భరించలేకపోయాడు. అంతే కన్నబిడ్డతో కలిసి తాను ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ హృదయ విదారక ఘటన విజయవాడలోని సత్యనారాయణపురంలో చోటుచేసుకుంది.

శ్రీనగర్ కాలనీకి చెందిన జగానీ రవి అతని పదేళ్ల కూతురు సహస్త్ర ఇంట్లో ఉరివేసుకొని చనిపోయారు. సరిగ్గా ఏడాదిన్నర క్రితం హైదరాబాద్లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేశాడు రవి. పరిస్థితుల కారణంగా ఉద్యోగం మానేసి వచ్చి విజయవాడలో స్థిరపడ్డాడు. వచ్చిన కొంతకాలానికే భార్య భరణి కిడ్నీ సంబంధిత వ్యాధి బయటపడటంతో అప్పులు చేసి మరీ చికిత్స చేయిస్తూ వచ్చాడు. ఉద్యోగం లేకపోవడం..మరోవైపు కుటుంబ సభ్యుల్ని సరిగా చుూసుకోలేకపోతున్నాననే మనోవేదనతో బిడ్డ సహస్త్రతో కలిసి ఉరివేసుకున్నాడు రవి. బంధువులు ఫోన్ చేస్తే రిప్లై ఇవ్వకపోవడంతో ఇంటికి వచ్చి చూడటంతో విషాదం అందర్ని కలచివేసింది.

రవి ఆత్మహత్య చేసుకునే ముందుకు తన కూతురుకు మెరుగైన భవిష్యత్ ఇవ్వలేక పోతున్నాని నోట్ రాయడం అందర్ని కంటతడి పెట్టించింది. అంతే కాదు తాను చనిపోయిన తర్వాత అవయవాలను దానం చేయమని …కిడ్నీని తన భార్యకు మార్చమని సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నాడు రవి.  ఆర్ధిక పరిస్థితులు ప్రాణాలు తీసుకునే విధంగా ప్రేరేపిస్తాయనడానికి ఈ విషాద ఘటనే నిదర్శనంగా మారింది.

Also Read:  భార్య ప్రేమతో లంచ్ చేస్తుంటే… ఆఫీసులో అమ్ముకుంటున్న భర్త.. రీజన్ చాలా సిల్లీ..!

57 ఏళ్ల మహిళ 62 ఏళ్ల తన భర్తను పక్కా స్కెచ్ వేసి హతమార్చింది.. షాకింగ్ రీజన్.. ఇలా కూడా ఆలోచిస్తారా..?