AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తిరుమలలోనే అంజనీపుత్రుడు హనుమంతుడు జన్మించాడా? మరి దేశంలోని మిగతా ప్రజల విశ్వాసమేమిటి..?

Hanuman birth place: తిరుమలలో ఉన్న జపాలి తీర్థమే ఆంజనేయుడి జన్మస్థలమంటూ పండితులు, ఆగమ సలహాదార్లు తేల్చేశారు. ఆంజనీపుత్రుడు జన్మించిన పుణ్యస్థలం తిరుమల గిరులేనంటూ గట్టిగా చెబుతున్నారు.

తిరుమలలోనే అంజనీపుత్రుడు హనుమంతుడు  జన్మించాడా? మరి దేశంలోని మిగతా ప్రజల విశ్వాసమేమిటి..?
04
Balu
| Edited By: Team Veegam|

Updated on: Apr 12, 2021 | 9:08 PM

Share

తిరుమలలో ఉన్న జపాలి తీర్థమే ఆంజనేయుడి జన్మస్థలమంటూ పండితులు, ఆగమ సలహాదార్లు తేల్చేశారు. ఆంజనీపుత్రుడు జన్మించిన పుణ్యస్థలం తిరుమల గిరులేనంటూ గట్టిగా చెబుతున్నారు. తిరుమల కొండ కృతయుగంలో వృషభాద్రిగా, త్రేతాయుగంలో అంజనాద్రిగా, ద్వాపరయుగంలో శేషాచలంగా, కలియుగంలో వేంకటాచలంగా పిలుస్తారని పురాణాల్లో ఉంది! త్రేతాయుగంలో అంజనాద్రి అన్న పేరు ఎందుకు వచ్చిందో భావిశోత్తర పురాణంలో వివరించారు. అక్కడే అంజనాదేవి హనుమంతుడికి జన్మనిచ్చింది కాబట్టే వేంకటాద్రికి అంజనాద్రి అన్న పేరు వచ్చిందన్నది పండితుల అభిప్రాయం. సంతానం కోసం మాతాంగి మహర్షి చేసిన సూచన మేరకు అంజనాదేవి పుష్కరకాలం పాటు తపస్సు చేస్తుంది. ఆమె తపస్సుకు సంతషించిన వాయుదేవుడు ఆమెకు ఓ ఫలాన్ని ప్రసాదిస్తాడు.. ఆ పండు తిన్న అంజనాదేవి హనుమంతుడికి జన్మనిస్తుంది. ఆమె తపస్సు చేసిన ప్రాంతమే నారాయణ పర్వత ప్రాంతంలోని ఆకాశగంగ తీర్థమట! హనుమంతుడు పుట్టిన ప్రదేశం కాబట్టే వేంకటాచలానికి అంజనాద్రి అన్న పేరు వచ్చిందని ద్వాదశ పురాణాలు చెబుతున్నాయి. జాపాలి తీర్థంలో ఆంజనేయస్వామి జన్మస్థలానికి ప్రతీకగా ఓ గుడి కూడా కట్టారు. ఈ ఆలయాన్ని 15వ శతాబ్దంలో విజయరాఘవరాయులు నిర్మించినట్టు శాసనాలు నిర్ధారిస్తున్నాయి. తిరుమల మహంతుల పాలనలోకి వెళ్లిన తర్వాత జాపాలి తీర్థం అభివృద్ధి చెందింది. ఇప్పటికీ జాపాలి తీర్థం మహంతుల పాలనలోనే ఉంది. ఆంజనేయుడి జన్మస్థలం తిరుమల గిరులేనంటూ తిరుమల తిరుపతి దేవస్థానం చెబుతుంది సరే.. మరి మిగతా జన్మస్థలాల సంగతి ఏమిటి? మిగతా ప్రాంత ప్రజల నమ్మకాలేమిటి? కర్నాటకలోని హంపీలో ఉన్న ఆంజనేయ పర్వతం మాటేమిటి? అక్కడ కూడా హనుమంతుడికి ఓ ఆలయం ఉంది. ఇప్పటి హంపీనే కిష్కింధ అని ఇక్కడి జనం అనుకుంటుంటారు. రామాయణంలో చెప్పిన రుష్యమూక పర్వతం కూడా ఇక్కడే ఉందని వారి నమ్మకం. అక్కడి వారే కాదు చాలా మంది కిష్కింధ దక్షిణ భారతంలోనే ఉందని విశ్వసిస్తారు. మహారాష్ట్ర ప్రజలు కూడా హనుమంతుడు పుట్టింది తమ దగ్గరేనని అంటుంటారు. నాసిక్‌-త్రయంబకేశ్వరానికి ఏడు కిలోమీటర్ల దూరంలో అంజనేరి పర్వతం ఉంది. అక్కడే హనుమంతుడు పుట్టాడని నమ్ముతుంటారు. ఈ పర్వతంపైనే హనుమంతుడి తల్లి అంజనీదేవి తపస్సు చేసిందని చెబుతుంటారు. అన్నట్టు ఇక్కడ కూడా హనుమంతుడికి గుడి ఉంది. గుజరాత్‌లోని దంగ్‌ జిల్లా నవసారి ప్రాంతంలో కూడా ఓ అంజనా పర్వతం ఉంది. ఇక్కడే హనుమంతుడు పుట్టాడని అక్కడి ప్రజల గట్టి నమ్మకం. అక్కడ ఉన్న అంజనీ గుహలోనే అంజనీదేవి హనుమంతుడికి జన్మనిచ్చిందని గిరిజనులు నమ్ముతుంటారు. ఝార్ఖండ్‌లోని గుమ్లా జిల్లా కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో అంజన్‌ అనే గ్రామం ఉంది. అంజనీదేవికి ఓ ఆలయం కూడా ఉంది. ఇక్కడే ఆంజనేయుడు పుట్టాడని, వాలి, సుగ్రీవుల రాజ్యం కూడా ఇదేనని అక్కడి ప్రజలు నమ్ముతుంటారు. హర్యానాలోని కైతల్‌ పట్టణానికి పూర్వపు పేరు కపితల్‌.. ఆ ప్రాంతాన్ని కపిరాజు కేసరి పాలించాడు. ఈ ప్రాంతంలోనే అంజనీదేవి హనుమంతుడికి జన్మనిచ్చిందని స్థలపురాణం చెబుతుంది. రాజస్తాన్‌లోని చురు జిల్లా సుజన్‌గఢ్‌ దగ్గరలో లక్షక గుట్టలు ఉన్నాయి. ఇక్కడే హనుమంతుడు పుట్టాడని ఓ నమ్మిక. స్థలపురాణం కూడా అదే చెబుతుంది..

మరిన్ని ఇక్కడ చదవండి: Super Star Rajinikanth: షూటింగ్ లో బిజీగా సూపర్ స్టార్.. మాస్ లుక్ అదరగొడుతున్న రజినీకాంత్..

Nayanthara: విఘ్నేష్‌ శివన్‌తో కలిసి కొచ్చిన్‌కు నయన్.. తగ్గేదే లేదు.. స్పెషల్ ఫ్లైట్ ఉండాల్సిందే..

66 ఏళ్ల వయసులో కూడా ఏంటీ ఎనర్జీ. ఏంటీ గ్రేస్.. నెట్టింట వైరల్‌గా మారిన రేఖ డ్యాన్స్ వీడియో