Mars Mission: అంగారక గ్రహంపై అత్యద్భుత డ్యూన్లు.. రంగుల్లో మెరిసిపోతున్న డ్యూన్లకు ఫిదా

అరుణ గ్రహం అంగారకునిపై ప్రయోగాలలో కొత్త శకం మొదలైంది. దాదాపు 20 ఏళ్ళుగా సేవలందిస్తున్న ఒడిస్సీ పంపిన తాజా సమాచారం అంతరిక్ష విషయాలపై ఆసక్తి చూపే వారిలో..

Mars Mission: అంగారక గ్రహంపై అత్యద్భుత డ్యూన్లు.. రంగుల్లో మెరిసిపోతున్న డ్యూన్లకు ఫిదా
Dunes
Follow us
Rajesh Sharma

|

Updated on: Apr 12, 2021 | 7:41 PM

Mars Mission revealed interesting blue dunes: అరుణ గ్రహం అంగారకునిపై ప్రయోగాలలో కొత్త శకం మొదలైంది. దాదాపు 20 ఏళ్ళుగా సేవలందిస్తున్న ఒడిస్సీ పంపిన తాజా సమాచారం అంతరిక్ష విషయాలపై ఆసక్తి చూపే వారిలో సంబ్రమాశ్చర్యాలకు కారణమైంది. అరుణ గ్రహం మార్స్‌పై నీలి డ్యూన్లున్నాయని నాసా పంపిన ఒడిస్సీ ఆర్బిటర్ పసిగట్టింది. వాటిని చిత్రీకరించి భూమ్మీదికి పంపింది. నాసా పోస్టు చేసిన ఆ ఛాయా చిత్రాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అంగారక గ్రహంపై జరుగుతున్న పరిశోధనలో త్వరలోనే మరిన్ని ఆసక్తికరమైన అంశాలు వెల్లడవుతాయని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా వెల్లడించడంతో నెటిజన్లు మరింత ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు.

ఎర్రని గ్రహంగా పేరుపొందిన అంగారకుడు (మార్స్)పై నీటి రంగులో ఉన్న డ్యూన్లు (ఇసుక దిబ్బలు) ఫోటోలు నాసాకు చేరాయి. ఆ ఫోటోలిపుడు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. అంగారక గ్రహంపై పరిశోధనలు జరిపేందుకు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా (NASA) ఒడిస్సీ ఆర్బిటర్‌ను ప్రయోగించింది. సుమారు 20 ఏళ్ళుగా అంగారక గ్రహం చుట్టూ సంచరిస్తున్న ఒడిస్సీ తాజాగా పంపిన చిత్రాలు ఆ గ్రహంపై మానవాళిలో మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. అంగారక గ్రహం ఇంత అద్భుతంగా వుంటుందా? ఇంత అందమైన ప్రకృతి రమణీయత వుంటుందా అంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు.

ఒడిస్సీ ఈ ఫొటోలు ఎలా తీసిందంటే…?

ఒడిస్సీ ఆర్బిటర్‌లో అమర్చిన శక్తివంతమైన థర్మల్ ఎమిషన్ ఇమేజింగ్ వ్యవస్థ (టీహెచ్ఈఎంఐఎస్)ను ఉపయోగించి అత్యంత స్పష్టమైన చిత్రాలను తీశారు. ఈ చిత్రాల్లో రెండు రకాల (రంగుల) డ్యూన్లు పిక్చరైజ్ అయ్యాయి. పసుపు రంగులో లేదా నారింజ రంగుల్లో కన్పించే చిత్రాలతోపాటు.. నీలి లేదా పాలిపోయిన రంగుల్లో మరికొన్ని చిత్రాలున్నాయి. పసుపు లేదా నారింజ రంగులో కనిపిస్తున్న డ్యూన్లు చిత్రాలున్న ప్రదేశాల్లో వాతావరణ వెచ్చగా వుంటుందని శాస్త్రవేత్తలు అంఛనా వేస్తున్నారు. నీలం రంగు లేదా పాలిపోయిన రంగుల్లో కనిపిస్తున్న ఫోటోలున్న డ్యూన్ల ప్రాంతాల్లో వాతావరణం శీతలంగా వుంటుందని వారంటున్నారు. డూన్లు ఎలా ఏర్పడతాయన్న విషయంపై కూడా నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు. గూగుల్‌లో డ్యూన్లు గురించిన సమాచారం కోసం వెతుకుతున్నారు. సాధారణంగా గాలి కోత కారణంగా మట్టి లేదా ఇసుక ఒకచోటికి చేరి దిబ్బల్లా ఏర్పడతాయి. వాటినే డూన్లు అంటారు. డ్యూన్లలోను కొన్ని రకాలున్నాయి. దూరం నుంచి చూస్తే ఇవి శిఖరంలా కనిపిస్తాయి. పైన బ్లేడ్ చివరలా షార్ప్‌గా కన్పిస్తాయి. మరి కొన్ని చోట్ల లాగూన్లు లేదా క్రేటర్లలా కన్పిస్తాయి. అయితే ఇవి రంగుల్లో కన్పిస్తుండటంతో అక్కడి మట్టి, వాతావరణంపై మరింత ఆసక్తి పెరుగుతోంది.

ఒడిస్సీ ఆర్బిటర్ కథేంటంటే?

అమెరికన్ అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా 2001 ఏప్రిల్ ఏడవ తేదీన మార్స్ (అంగారక గ్రహం)పై ప్రయోగం కోసం రాకెట్‌ను ప్రయోగించింది. అందులో ఒడిస్సీ ఆర్బిటర్‌ను మార్స్ చుట్టూ సంచరించేందుకు నిర్దేశించింది. ఒడిస్సీని అంతరిక్షానికి మోసుకుపోయిన రాకెట్ పేరు డేల్టా2 7925-9.5. ఒడిస్సీలో థర్మల్ ఎమిషన్ ఇమేజింగ్ సిస్టంను అమర్చారు. మార్స్ ఉపరితలంపై విస్తరించిన ఖనిజాల వివరాలను ఈ సిస్టం ద్వారా ఫోటోలు తీయవచ్చు. ఇన్ ఫ్రారెడ్ ఇమేజ్‌లు, మామూలు కన్నులతో చూడగలిగే ఇమేజ్‌లు తీయగలిగే శక్తి థర్మల్ ఎమిషన్ ఇమేజింగ్ సిస్టంకు ఉంది. జీఆర్ఎస్.. అనే గామా రెస్పెక్టో మీటర్.. ను కూడా ఒడిస్సీ ఆర్బిటర్‌లో అమర్చారు. ఇందులో అత్యధిక శక్తివంతమైన న్యూట్రాన్లను గుర్తించే వ్యవస్థను అమర్చారు. ఈ జీఆర్ఎస్ వ్యవస్థను నాసాకు రష్యా అందించింది. మార్స్ రేడియేషన్ ఎన్విరాన్ మెంట్ ఎక్స్‌పరిమెంట్ (ఎంఏఆర్ఐఈ) కూడా ఇందులో వుంది. మార్స్‌పై రేడియేషన్ స్థాయిలను ఈ వ్యవస్థ లెక్క కడుతుంది.

ప్రముఖ సైన్స్ ఫిక్షన్ రచయిత అర్దర్ సి క్లార్క్‌కు నివాళిగా ఈ మిషన్ కు ‘ఒడిస్సీ’ అని పేరు పెట్టారు. ఇతని రచన ఆధారంగా 1968లో స్టాన్లీ కుర్బిక్ దర్శకత్వంలో ‘2001 ఎ స్పేస్ ఒడిస్సీ’ అనే హాలివుడ్ మూవీ రిలీజై ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణ చూరగొన్న విషయం తెలిసిందే. కాగా ఏప్రిల్ 7వ తేదీ (2001)న దీనిని ప్రయోగించగా.. దాదాపు ఆరు నెలల తర్వాత ఒడిస్సీ మార్స్ కక్ష్యలోకి చేరుకున్నది. 2001 అక్టోబర్ 24 తేదీన ఒడిస్సీ మార్స్ గ్రహం చుట్టూ సంచరించడం ప్రారంభించింది. 2002 మే 28వ తేదీన మార్స్‌పై భారీ స్థాయిలో హైడ్రోజన్, ఉపరితలంపై మీటరు మందంలో పేరుకుపోయిన మంచు వున్నట్లు ఒడిస్సీ తొలిసారిగా గుర్తించి, అందుకు సంబంధించిన చిత్రాలను జీఆర్ఎస్( గామా రే స్పెక్టో మీటర్) పరికరం ద్వారా నాసాకు పంపింది.

భూమి చుట్టూ పరిభ్రమిస్తున్న కృత్రిమ ఉపగ్రహాలను మినహాయించి ఇతర గ్రహాల చుట్టూ పరిభ్రమిస్తున్న స్పేస్ క్రాఫ్టులతో పోలిస్తే ఒడిస్సీ మార్స్ కక్ష్యలో పరిభ్రమిస్తూ సుదీర్ఘ కాలం అంటే దాదాపు 20 సంవత్సరాలుగా సేవలందిస్తూ రికార్డు సృష్టించింది. ఒడిస్సీ ఆర్బిటర్ ప్రాథమిక కాల పరిమితి 2004 ఆగస్టుతో ముగిసింది. అప్పట్నించి ఒడిస్సీ కాలపరిమితిని తరచూ పొడిస్తూ వస్తోంది నాసా. 2006, 2008, 2010, 2012, 2014, 2016 వరకు ఒడిస్సీ కాల పరిమితిని పొడిగిస్తూ వచ్చారు. తాజాగా ఒడిస్సీ కాలపరిమితిని 2025 దాకా నాసా పొడిగించింది. ఈ నేపథ్యంలోనే ఒడిస్సీ అత్యంత ఆసక్తికరమైన చిత్రాలను భూమ్మీదకు పంపడం విశేషం. 2010 డిసెంబర్ 15వ తేదీనాటికే ఒడిస్సీ 3,340 రోజుల పరిభ్రమణాన్ని పూర్తి చేసుకున్న అంతరిక్ష నౌకగా రికార్డు సృష్టించింది.

అంగారక గ్రహ ప్రయోగాలలో భాగంగా నాసా క్యూరియోసిటీ రోవర్‌ను కూడా పంపింది. ఈ రోవర్ అందించే సమాచారాన్ని కూడా భూమి మీదకి పంపుతూ గత పదేళ్ళుగా ఒడిస్సీ సేవలందిస్తోంది. ఇప్పటికీ… సుదీర్ఘ కాలంగా మార్స్ కక్ష్యలో ఉంటూ సేవలందిస్తున్న స్పేస్ క్రాఫ్టుగా ఒడిస్సీ కొనసాగుతోంది. గతంలో.. శుక్ర గ్రహంపైకి ప్రయోగించిన పయినీర్ వీనస్ ఆర్బిటర్ 14 ఏళ్ళపాటు సేవలందించింది. మార్స్ ఎక్స్‌ప్రెస్ కూడా గత 17 ఏళ్లుగా సేవలందిస్తోంది.

ALSO READ: అంతరిక్షంలో అంతకంతకూ పెరుగుతున్న చెత్తా చెదారం.. ఫ్యూచర్‌లో జరిగేది ఇదే!

ALSO READ: వంట గదిలో నూనె మంట.. అదే పనిగా పెరుగుతున్న ధరలు

అబ్బాయి కోసం బాబాయ్.రీల్ గేమ్ గేమ్ ఛేంజర్ కోసం పొలిటికల్ గేమ్ ఛేం
అబ్బాయి కోసం బాబాయ్.రీల్ గేమ్ గేమ్ ఛేంజర్ కోసం పొలిటికల్ గేమ్ ఛేం
దర్శక ధీరుడు రాజమౌళి ఇంట్లో ఆ మహనీయుని చిత్ర పటం
దర్శక ధీరుడు రాజమౌళి ఇంట్లో ఆ మహనీయుని చిత్ర పటం
సుడాన్ శిశువును నిలోఫర్ వైద్యులు కాపాడారు... ఏం జరిగిందంటే..
సుడాన్ శిశువును నిలోఫర్ వైద్యులు కాపాడారు... ఏం జరిగిందంటే..
ఇదేందీ అయ్యో ఇది నిజమేనా..!గాల్లో ఎగురుతున్న జింక...వీడియో చూస్తే
ఇదేందీ అయ్యో ఇది నిజమేనా..!గాల్లో ఎగురుతున్న జింక...వీడియో చూస్తే
నిను వీడని నీడను నేను. పాటను ప్రాక్టీస్‌ చేస్తున్న దీపిక పదుకోన్‌
నిను వీడని నీడను నేను. పాటను ప్రాక్టీస్‌ చేస్తున్న దీపిక పదుకోన్‌
షాకింగ్.. తమన్నా బాయ్ ఫ్రెండ్‌కు ఆ అరుదైన చర్మ సమస్య
షాకింగ్.. తమన్నా బాయ్ ఫ్రెండ్‌కు ఆ అరుదైన చర్మ సమస్య
నిద్రపోయేటప్పుడు ఫోన్‌ని దగ్గర పెట్టుకుంటున్నారా? పెద్ద ప్రమాదం..
నిద్రపోయేటప్పుడు ఫోన్‌ని దగ్గర పెట్టుకుంటున్నారా? పెద్ద ప్రమాదం..
ఎర్ర తోటకూరతో ఎన్ని లాభాలో తెలిస్తే..అసలు వదిలిపెట్టకుండా తింటారు
ఎర్ర తోటకూరతో ఎన్ని లాభాలో తెలిస్తే..అసలు వదిలిపెట్టకుండా తింటారు
టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు.. బియ్యం గింజ సైజులో 2025 లోగో
టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు.. బియ్యం గింజ సైజులో 2025 లోగో
పిస్తా తింటున్నారా..? అయితే, ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి.!
పిస్తా తింటున్నారా..? అయితే, ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి.!
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..