Ayodhya: అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో బాలరాముడు కొలువు తీరి ఏడాది పూర్తి కావస్తోంది. జనవరి 22, 2024న కోట్లాది భక్తుల కలలు నెరవేరుస్తూ అయోధ్యలో కొలువుతీరాడు. అసాధ్యం అనుకున్న రామాలయ నిర్మాణాన్ని చేపట్టి టెంట్‌లో ఉన్న బాలరాముడిని గర్భగుడిలో ప్రవేశ పెట్టారు భారత ప్రధాని నరేంద్రమోదీ. అశేష భక్తుల కన్నుల పండువగా రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరిగింది.
కొత్త సంవత్సరం వేళ అయోధ్య నగరం పర్యాటకులతో కళకళలాడనుంది. నూతన ఏడాదిలోకి అడుగుపెట్టడం, అలాగే బాలరాముడు కొలువుదీరి సంవత్సరం పూర్తి కావొస్తుండటంతో భారీగా భక్తులు తరలిరానున్నారు. దాంతో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే దర్శన వేళలు పెంచుతూ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నిర్ణయం తీసుకుంది. ‘‘భక్తులకు స్వాగతం పలికేందుకు అంతా సిద్ధంగా ఉంది. జనవరి 15 వరకు హోటల్ గదులన్నీ ముందుగానే బుక్ అయ్యాయి’’ అని స్థానిక హోటల్ యజమాని అంకిత్ మిశ్రా వెల్లడించారు. చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే గదుల లభ్యత ఉందని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఇదే అదునుగా కొందరు హోటళ్ల యజమానులు ఒక్కరోజుకు రూ.10వేల వరకు వసూలు చేస్తున్నట్లు వెల్లడించాయి. ‘‘రాముడి ఆలయంతో పాటు ఇతర ప్రఖ్యాత స్థలాల వద్ద భారీగా భద్రతను ఏర్పాటు చేశాం’’ అని అయోధ్య పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. అయోధ్య, వారణాసి ఆలయాలను దర్శించుకునే భక్తుల కారణంగా..ఉత్తరప్రదేశ్‌కు పర్యాటకులు భారీగా తరలివస్తుంటారు. ‘‘రామ మందిర ప్రారంభం తర్వాత మొదటి ఆరు నెలల్లో యూపీకి పర్యాటకుల రాక గణనీయంగా పెరిగింది. ఒక్క జనవరిలోనే రికార్డు స్థాయిలో ఏడు కోట్ల మంది సందర్శించారు’’ అని ఇటీవల యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.