ఎర్ర తోటకూరతో ఎన్ని లాభాలో తెలిస్తే.. వెతికి మరీ కొనితెచ్చుకుంటారు..!
ఎర్ర తోటకూరలో ఉండే కాల్షియం ఎముకలు, దంతాలను దృఢంగా ఉంచుతాయి. తోటకూర తింటే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. రెగ్యులర్‌గా తోటకూర తినడం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి స్థిరంగా ఉంటుంది. తోటకూర జీవక్రియ రేటును పెంచుతుంది. దీంతో షుగర్ కంట్రోల్ అవుతుంది. వారంలో రెండు సార్లు ఎర్ర తోటకూర తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు.
ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అలాంటి ఆకుకూరల్లో ఎన్నో రకాలు ఉన్నాయి. పాలకూర, బచ్చలికూర, గోంగూర, చామకూర, ఉల్లికాడలు, ఆవకూర, బతువా ఇలాంటివి అనేకం ఉన్నాయి. అయితే, తోటకూరలో ఎర్రతోట కూర గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.. కానీ, ఎర్రతోట అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వారంలో రెండు సార్లు ఎర్ర తోటకూర తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెబుతున్నారు.
అన్ని ఆకుకూరల మాదిరిగానే తోటకూరలో కూడా పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్ ఎ, కె, సి, బిలు అధికంగా లభిస్తాయి. వీటితో పాటు సోడియం, మెగ్నీషియం, ఐరన్, కాల్షియం వంటి మినరల్స్ కూడా ఉంటాయి. ఇకపోతే, ఎర్రతోట కూరలో విటమిన్ ఎ, సి, ఇ, బి, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైరర్, ప్రోటీన్‌లు పుష్కలంగా ఉన్నాయి. ఎర్రతోట కూర తినడం వలన పేగు ఆరోగ్యంతో పాటు కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతుంది. ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. అధిక రక్తపోటుతో బాధపడే వారు ఎర్ర తోట కూర తింటే మంచిది.
రక్తపోటు స్థాయిలను అదుపులో ఉంచడంలో ఎర్ర తోట కూర సహాయపడుతుంది. గొంతు క్యాన్సర్‌ను రాకుండా అడ్డుకుంటుంది. సీజనల్‌గా వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్లతో ఎర్రతోట కూర పోరాడుతుంది. ఎర్ర తోటకూరలో ఉండే కాల్షియం ఎముకలు, దంతాలను దృఢంగా ఉంచుతాయి. తోటకూర తింటే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. రెగ్యులర్‌గా తోటకూర తినడం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి స్థిరంగా ఉంటుంది. తోటకూర జీవక్రియ రేటును పెంచుతుంది. దీంతో షుగర్ కంట్రోల్ అవుతుంది.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. పలు వార్తా కథనాలు, నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..