Anant Ambani Watch: అనంత్ అంబానీ ధరించిన వాచ్ ధరెంతో తెలిస్తే.. కళ్లు బైర్లు కమ్మాల్సిందే..!
ఇవి మాత్రమే అనంత్ అంబానీ వద్ద పటెక్ ఫిలిప్పె, అడెమార్స్ పిగ్యుట్ వంటి పలు రకాల బ్రాండ్ల మోడళ్లకు చెందిన వాచ్‌ల కలెక్షన్ కూడా అంబానీ వద్ద ఎక్కువగానే ఉందట. అంతేకాదు.. అనంత్ వివాహ వేడుక సందర్భంగా వచ్చిన అతిథులకు అడెమార్స్ పిగ్యుట్ బ్రాండ్‌కు చెందిన వాచ్‌లను రిటర్న్ గిఫ్ట్‌గా అందించారట. ఆ వాచీ ధర సుమారు కోటిన్నర నుంచి రూ.2 కోట్లుగా ఉంటుందని అంచనా.
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, దిగ్గజ వ్యాపారవేత్త, భారత్‌లోనే అత్యంత సంపద కలిగిన ముకేశ్ అంబానీ- నీతా అంబానీ దంపతుల చిన్న కుమారుడు అనంత్ అంబానీ మరోమారు వార్తల్లో నిలిచారు. ఈ సారి అతను ధరించిన వాచ్ ఇంటర్‌నెట్ వేదికగా చర్చనీయాంశంగా మారింది. అనంత్ అంబానీ కి వాచ్‌లపై మక్కువ ఎక్కువ అని చెబుతారు. అందుకే ఆయన వద్ద ఖరీదైన వాచ్‌లు పెద్ద సంఖ్యలో ఉంటాయని అంటుంటారు. తాజాగా అనంత్ అంబానీ ధరించిన వాచ్ ఒక అందరినీ ఆకర్షిస్తోంది. దాని ధర తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!
అనంత్ అంబానీ తన భార్య రాధికతో కలిసి ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఆ వీడియోలో అనంత్ అంబానీ చేతికున్న వాచ్ స్పెషల్ మరింత స్పెసల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఐస్‌క్యూబ్ మాదిరిగా నీలం రంగులో డయల్‌తో మెరిసిపోతున్న ఆ వాచ్‌పై నెటిజన్లు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.. రిచర్డ్ మిల్లే బ్రాండ్‌కు చెందిన దాని ధర అక్షరాల రూ.22 కోట్లని జాతీయ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. అంతేకాదు.. అనంత్ అంబానీ ధరించిన ఈ తరహా వాచ్‌లు కేవలం మూడే తయారు చేసినట్లు సమాచారం. అందులో ఒకదానిని అనంత్ అంబానీ తీసుకున్నట్టుగా సమాచారం.
View this post on Instagram
ఇవి మాత్రమే అనంత్ అంబానీ వద్ద పటెక్ ఫిలిప్పె, అడెమార్స్ పిగ్యుట్ వంటి పలు రకాల బ్రాండ్ల మోడళ్లకు చెందిన వాచ్‌ల కలెక్షన్ కూడా అంబానీ వద్ద ఎక్కువగానే ఉందట. అంతేకాదు.. అనంత్ వివాహ వేడుక సందర్భంగా వచ్చిన అతిథులకు అడెమార్స్ పిగ్యుట్ బ్రాండ్‌కు చెందిన వాచ్‌లను రిటర్న్ గిఫ్ట్‌గా అందించారట. ఆ వాచీ ధర సుమారు కోటిన్నర నుంచి రూ.2 కోట్లుగా ఉంటుందని అంచనా.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ క్లిక్ చేయండి..