చలికాలంలో వాల్‌నట్స్, ఖర్జూరాలు కలిపి తింటే ఈ లాభాలన్నీ మీ సొంతం..! ట్రై చేసి చూడండి..
శీతాకాలంలో నట్స్, డ్రైఫ్రూట్స్ వంటివి తగిన మోతాడులో తీసుకోవాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. బాదాం, కాజు, వాల్‌నట్స్, ఖర్జూరాలు వంటివి తింటే వాటిలోని మంచి కొవ్వులతోపాటు శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే గుణం ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే, వాల్‌నట్స్, ఖర్జూరాలను కలిపి తింటే ఏమౌతుందో తెలుసా..?
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడం చాలా అవసరం. ఇందుకోసం వెచ్చటి దుస్తులు ధరించటం మాత్రమే కాదు.. తినే ఆహారం ద్వారా శరీరానికి వెచ్చదనాన్ని అందించాలి. అందుకే శీతాకాలంలో నట్స్, డ్రైఫ్రూట్స్ వంటివి తగిన మోతాడులో తీసుకోవాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. బాదాం, కాజు, వాల్‌నట్స్, ఖర్జూరాలు వంటివి తింటే వాటిలోని మంచి కొవ్వులతోపాటు శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే గుణం ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే, వాల్‌నట్స్, ఖర్జూరాలను కలిపి తింటే ఏమౌతుందో తెలుసా..?
చలికాలంలో వాల్‌నట్స్, ఖర్జూరాలను కలిపి తినడం వల్ల శరీరానికి అనేక గొప్ప ప్రయోజనాలు అందుతాయి. ఖర్జూరంలో ఫైబర్, పొటాషియం, విటమిన్ బి6 పుష్కలంగా లభిస్తాయి. వాల్‌నట్స్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, మెగ్నీషియం పుష్కలంగా ఉన్నాయి. చలికాలంలో వాల్‌నట్‌లు, ఖర్జూరాలు కలిపి తింటే రోజంతా శక్తివంతంగా ఉంటారు. ఇది కండరాలు దృఢంగా ఉండేలా చేస్తుంది. చలికాలంలో వాల్ నట్స్, ఖర్జూరం కలిపి తినటం వల్ల మీ కండరాలు బలపడతాయి.
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, వాల్‌నట్‌లు, ఖర్జూరాల్లో కొన్ని యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. విటమిన్ సి పుష్కలంగా ఉండే ఖర్జూరం, వాల్‌నట్‌లను కలిపి తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఖర్జూరం, వాల్‌నట్‌లు ఈ వ్యాధుల నుండి మీకు ఉపశమనం కలిగిస్తాయి. అలాగే, చలికాలంలో కచ్చితంగా తీసుకోవాల్సినవి నువ్వులు. బెల్లంతో కలిపి లడ్డూలుగా చేసి తింటే ఐరన్, మెగ్నీషియం, కాల్షియం లభిస్తాయి. శరీరం వెచ్చగా ఉంటుంది.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. పలు వార్తా కథనాలు, నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..