AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాలతో మఖానా తింటే చాలా మంచిది..! ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఇప్పుడే మొదలుపెట్టేస్తారు..

పాలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాల్షియం, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వు వంటి బహుళ పోషకాలు ఇందులో లభిస్తాయి. మఖానాలో ప్రోటీన్, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, ఫాస్పరస్, జింక్, కాల్షియం, విటమిన్ సి వంటి పోషకాలు ఉన్నాయి. అయితే, మఖానాను పాలలో వేసుకుని తింటే ఏమౌవుతుందో ఎప్పుడైనా ఆలోచించారా..? పూల్‌ మఖానా, పాలు కలిపి తింటే ఏమవుతుందో ఇక్కడ తెలుసుకుందాం..

పాలతో మఖానా తింటే చాలా మంచిది..! ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఇప్పుడే మొదలుపెట్టేస్తారు..
Milk With Makhana
Jyothi Gadda
|

Updated on: Jan 01, 2025 | 6:28 PM

Share

పాలు, మఖానాలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే శరీరంలోని అవయవాల పనితీరు మెరుగుపడుతుంది. నాడీ వ్యవస్థ చురుకుగా పనిచేస్తుంది. మఖానాలో ప్రోటీన్లు సమృద్ధిగా లభిస్తాయి. దీనిని పాలతో కలిపినప్పుడు రెట్టింపు శక్తిని లభిస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇది ఎముకల ఆరోగ్యానికి, నరాల పనితీరుకు, ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడటానికి అవసరమైన పోషకాలను మఖానా, పాలు రెండు అందిస్తాయి. మఖానా నుండి కార్బోహైడ్రేట్లు, పాలలోని సహజ చక్కెరలతో కలిపినపుడు శక్తిని అందిస్తాయి. మఖానాలోని తక్కువ కేలరీలతో చేసే స్నాక్‌ బరువు తగ్గేందుకు కూడా సహకరిస్తుంది. పాలు, మఖానా రెండూ కలిపి తినడం మలబద్దకాన్ని తగ్గిస్తాయి. అలాగే జీర్ణక్రియ సులభంగా అవుతుంది.

గుండె ఆరోగ్యాన్ని రక్షించడంలో కూడా మఖానా సహకరిస్తుంది. ఇందులో మెగ్నీషియం, పొటాషియం అధికంగా ఉండటం కారణంగా ఇది రక్తపోటు స్థాయిలను నియత్రిస్తుంది. మెదడు పనితీరుకు మేలు చేస్తుంది. పాలలోని ప్రోటీన్, విటమిన్లు, మినరల్స్ ఏకాగ్రతను పెంచుతాయి. యాంటీ ఆక్సిడెంట్సు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీరాడికల్స్‌తో పోరాడతాయి. మఖానా తక్కువ గ్లైసెమిక్ చక్కెరను విడుదల చేస్తుంది. పాలలో విటమిన్ A,E ఆక్సీకరణ ఒత్తిడిని సహకరిస్తాయి. మఖానాను పాలలో కలిపి తీసుకోవడం వల్ల వాపు, మలబద్ధకం, కడుపు నొప్పి మొదలైన సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఎందుకంటే ఇందులో ఫైబర్ ఉంటుంది.

పాలు, మఖానాని కలిపి తీసుకుంటే శరీరానికి కావాల్సిన ప్రోటీన్ సులభంగా అందుతుంది. దీంతో కండరాలు దృఢంగా మారుతాయి. మఖానాలోని కార్బోహైడ్రేట్స్‌, పాలలోని సహజ చక్కెరలు శక్తిని రెట్టింపు చేయడంలో సహాయపడతాయి. పాలు, మఖానా కలిపి తీసుకుంటే ఎనర్జీ లెవెల్స్‌ ఒక్కసారిగా పెరుగుతాయి. బరువు తగ్గాలనుకునేవారు ఆహారంలో మఖానా పాలను చేర్చుకోవాలి. ఇది తక్కువ కేలరీల కంటెంట్‌ను కలిగి ఉంటుంది. మఖానా పాలు శక్తి బూస్టర్‌గా పనిచేస్తుంది. మీరు రోజంతా పని ఒత్తిడితో అలసిపోతే ఈ పాలు తాగడం వల్ల మీకు తక్షణ శక్తి లభిస్తుంది. మఖానాలో కెంఫరోల్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడంలో సహాయపడుతుంది. పాలలోని విటమిన్ ఈ, ఎలు కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి.

ఇవి కూడా చదవండి

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. పలు వార్తా కథనాలు, నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..