Jackfruit Seeds Benefits : పనస గింజల అద్భుతాలు తెలిస్తే ఇక అస్సలు పడేయరు.. శరీరంలో జరిగే ఇదే..!
పనస పండు.. కమ్మటి వాసనతో అందరినీ ఊరిస్తుంది. అయితే, పనస పండును ఇష్టంగా తినే వారు దాని గింజలను మాత్రం చెత్తబుట్టలో పడవేస్తుంటారు.. కానీ, ఈ గింజల ఉపయోగాలు తెలిస్తే ఇకపై అలాంటి పొరపాటు అస్సలు చేయరండోయ్..ఎందుకంటే పనస గింజల్లో బోలెడు పోషకాలుంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఒకరకంగా దీనిని చౌక బాదం అని కూడా పిలుస్తారట. పనసలో ఫోలేట్, నియాసిన్, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్ లాంటి మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. పనసలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. మరీ దీని లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..
Updated on: Jan 01, 2025 | 4:15 PM

పనస గింజలలో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. పనస గింజలలోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. ఇది మలబద్ధకాన్ని నివారించడానికి కూడా సహాయపడుతుంది.

పనస గింజలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. పనస గింజలలోని యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడంలో కూడా సహాయపడతాయి.

బరువు తగ్గాలనుకునే వారికి పనస గింజలు బెస్ట్ ఆప్షన్ అంటున్నారు నిపుణులు. ఎందుకంటే పనస గింజలలోని ఫైబర్.. ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచడంలో సహాయపడుతుందని తద్వారా ఇది అతిగా తినడాన్ని నివారించడంలో, బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

పనస పండు గింజలలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఎర్రరక్తకణాలను పెంచడంలో సహాయపడుతుంది. పనస గింజలలో మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇవి రెండూ గుండె ఆరోగ్యానికి ముఖ్యమైన ఖనిజాలు. పొటాషియం రక్తనాళాలను సడలించి గుండె వ్యవస్థను మెరుగ్గా ఉంచుతుంది.

పనస గింజలలోని విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అవి చర్మం స్థితిస్థాపకతను మెరుగుపరచడంలో, ముడతలను తగ్గించడంలో, జుట్టు రాలడాన్ని నివారించడంలోనూ మేలు చేస్తుంది.




