400 ఏళ్ల నాటి వింత ప్రతిభ…ఎముకలతో అందమైన ఆభరణాల తయారీ.. ఎక్కడంటే..
సూక్ష్మ, చాలా క్లిష్టమైన అలంకరణ వస్తువులు, ఆభరణాలను తయారు చేయడంలో రాణిస్తున్నారు. ఇక్కడ విశేషమేమిటంటే గేదెలు, ఇతర జంతువుల ఎముకలను ఉపయోగించి వారు ఇలాంటి వస్తువులను తయారు చేస్తారు. ఈ మేరకు జలాలుద్దీన్ మాట్లాడుతూ.. గత 50 సంవత్సరాలుగా ఈ పని చేస్తున్నానని చెప్పాడు. ఇది తమ పూర్వీకుల కాలం నుంచి వస్తున్న పనిగా చెప్పారు.
భారతదేశంలోని వివిధ రాష్ట్రాలు వాటి స్వంత ప్రత్యేక కళ, కొన్ని పురాతన సంప్రదాయాలను కలిగి ఉన్నాయి. వాటిలో కొన్ని ఇప్పటికీ సజీవంగా కొనసాగుతున్నాయి. అలాంటిదే లక్నోకు చెందిన ఓ కుటుంబం గత 400 ఏళ్లుగా వారి సంప్రదాయ కళను కాపాడుకుంటూ వస్తోంది. యూపీకి చెందిన జలాలుద్దీన్ అతని కుటుంబం సూక్ష్మ, చాలా క్లిష్టమైన అలంకరణ వస్తువులు, ఆభరణాలను తయారు చేయడంలో రాణిస్తున్నారు. ఇక్కడ విశేషమేమిటంటే గేదెలు, ఇతర జంతువుల ఎముకలను ఉపయోగించి వారు ఇలాంటి వస్తువులను తయారు చేస్తారు. ఈ మేరకు జలాలుద్దీన్ మాట్లాడుతూ.. గత 50 సంవత్సరాలుగా ఈ పని చేస్తున్నానని చెప్పాడు. ఇది తమ పూర్వీకుల కాలం నుంచి వస్తున్న పనిగా చెప్పారు.
జలాలుద్దీన్ ప్రకారం, ఎముకలను చెక్కడం అనేది ఒక కళ మాత్రమే కాదు, దాదాపు ఐదు దశాబ్దాలుగా వారు కొనసాగిస్తూ వస్తున్న వారసత్వ సంపదగా భావిస్తున్నారు. మనదేశంలో మొఘలుల కాలంలోనే ఇలాంటి కళ ప్రాచుర్యంలోకి వచ్చిందని చెప్పారు. ఆ సమయంలో చేతివృత్తులవారు ఈ పని కోసం ఏనుగు దంతాలను ఉపయోగించేవారిని చెప్పారు. ప్రస్తుతం ఏనుగు దంతాన్ని నిషేధించడంతో కళాకారులు ఇతర జంతువుల ఎముకలతో తమ వృత్తిని కొనసాగిస్తున్నట్టుగా చెప్పారు.
View this post on Instagram
ఎముకలను చెక్కడం అనేది శ్రమతో కూడుకున్న పని అంటున్నారు. ఇందులో వాటిని కత్తిరించడం, శుభ్రపరచడం, ఆ ఎముకలకు ఒక ఆకృతిని అందించడం వంటివి ఉంటాయి. ఆభరణాల పెట్టెలు, దీపాలు, ఫ్రేమ్‌లు, పెన్నులు, పేపర్‌వెయిట్‌లు వంటి వాటిని ఎముకలతో తయారు చేస్తారు. ఇప్పుడు ఈ కళను కాపాడుకోవడం చాలా కష్టంగా మారిందని జలాలుద్దీన్ అన్నారు. కొన్నిసార్లు ఎముకలు నెలల తరబడి లభించవని అంటున్నారు.. అందువల్ల రూ.లక్షకు పైగా ఖరీదు చేసే ఏడెనిమిది నెలల ముడిసరుకును నిల్వ చేసుకుంటామని చెప్పారు.. ఇప్పుడు కళాభిమానులు చాలా తక్కువ మంది మిగిలి ఉన్నారని, ప్రజలు తమ వస్తువులకు సరైన ధర చెల్లించడం లేదని అన్నారు. శ్రమకు తగిన ఫలితం లేక చాలా కష్టపడాల్సి వస్తుందని ఆయన వాపోయారు. అందుకే ప్రస్తుతం యువత ఈ పనిని నేర్చుకోవడానికి ఆసక్తి చూపడం లేదని చెప్పారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ క్లిక్ చేయండి..