Viral Video: న్యూఇయర్‌కి రైళ్లు భలే స్వాగతం చెప్పాయ్.. వీడియో చూస్తే ఫిదానే
2024 ముగిసిపోయింది. 2025 ఎంటరయ్యింది. అందరూ పాత సంవత్సరానికి గుడ్ బై చెప్పి.. కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించారు. దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటాయి. కాగా భారతీయ రైల్వే ఉద్యోగులు, రైలు పైలట్లు న్యూ ఇయర్‌ను ఎలా ఇన్వైట్ చేశారో చూస్తే మీరు ఫిదా అవుతారు. వీడియో కూడా ఉందండోయ్...
ఎన్నో తీపి, చేదు అనుభవాలను ప్రజలకు మిగిల్చి వెళ్లిపోయింది 2024వ సంవత్సరం. బుధవారం ప్రపంచం కొత్త ఏడాది 2025లోకి అడుగుపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. భారతదేశంలోనూ న్యూఇయర్ సెలబ్రేషన్స్ అత్యంత ఉత్సాహంగా జరుపుకున్నారు ప్రజలు. కొందరు ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీలు చేసుకోగా, మరికొందరు కుటుంబ సభ్యులతో కలిసి కేక్‌లు కట్ చేసి వేడుకలు చేసుకున్నారు. ఇక, విధుల్లో ఉన్న భారతీయ రైల్వే ఉద్యోగులు కూడా తమదైనశైలిలో సెలబ్రేషన్స్ చేసుకున్నారు.
రైల్వే ప్లాట్‌ఫామ్‌పై న్యూఇయర్ వేడుకలకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రైల్వే ఉద్యోగులు, ప్రయాణికులు, రైలు పైలట్లు చాలా ఉత్సాహంగా 2025కి స్వాగతం పలికారు. అర్ధరాత్రి సరిగ్గా 00:00 గంటలకు పైలట్లు రైలు హారన్లను కొద్దిసేపు ఏకధాటికి మోగించారు. దీంతో ప్లాట్‌ఫామ్‌పై ప్యాసింజర్లు కేరింతలు కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. రైల్వే ఉద్యోగుల న్యూఇయర్ వేడుక గూస్‌బంప్స్ తెప్పించిందని ఓ వ్యక్తి వ్యాఖ్యానించాడు. 2025కి అద్భుతంగా స్వాగతం పలికారని కొందరు అభివర్ణించారు. ఇదొక స్ఫూర్తిదాయకమైన వేడుక అని, అక్కడ ఉన్న అందరినీ ఐక్యం చేసిందని ఓ వ్యక్తి పేర్కొన్నాడు. కాగా, ఈ సెలబ్రేషన్స్ ఏ రైల్వే స్టేషన్‌లో జరిగాయనేది తెలియరాలేదు.
"Pure Goosebumps" Indian Railways Welcoming 2025 in Style ❤️ pic.twitter.com/SmvfkeOvXi
— Trains of India (@trainwalebhaiya) December 31, 2024