Modi Cabinet: కొత్త సంవత్సరం తొలి రోజున రైతులకు ప్రధాని మోదీ వరాలు.. వారికి ఏకంగా 10 వేలు

మోదీ సర్కార్ రైతు భారతానికి శ్రీకారం చుట్టింది. రైతుకు రొక్కం...చేనుకు చేవ అన్న ఫార్ములాను పక్కాగా ఫాలో అయింది. ప్రకృతి విపత్తులతో విలవిలలాడుతున్న రైతులకు తామున్నామన్న భరోసా కల్పించేందుకు పలు చర్యలు తీసుకుంది. కొత్త ఏడాదిని రైతునామసంవత్సరంగా ప్రకటిస్తూ....తొలిసారి జరిగిన కేబినెట్‌లో అన్నదాతలకు అద్బుతమైన గిప్ట్ట్‌లను అందించింది.

Modi Cabinet: కొత్త సంవత్సరం తొలి రోజున రైతులకు ప్రధాని మోదీ వరాలు.. వారికి ఏకంగా 10 వేలు
PM Modi With Farmers
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 01, 2025 | 7:37 PM

2025 కొత్తఏడాది రైతులకు గుడ్‌న్యూస్ చెబుతూ..కేంద్రం రైతుల సంక్షేమానికి అనేక చర్యలు చేపట్టింది. ఈసందర్భంగా జరిగిన తొలి కేంద్రకేబినెట్ లో పలు కీలకనిర్ణయాలు తీసుకుంది మోదీ సర్కార్. ప్రకృతి వైపరిత్యాలతో తల్లడిల్లుతున్న రైతాంగాన్ని ఆదుకోవడానికి ప్రధాని ఫసల్‌ బీమా యోజన పరిధిని పెంచింది. ఇందుకు 69 వేల 515 కోట్లు ఈ పథకానికి కేటాయించింది. ఈ పథకంతో 4 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. అంతేకాకుండా పీఎం ఫసల్‌ బీమా యోజనలో మార్పులు చేశారు. 23 రాష్ట్రాలకు , 4 కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ పథకంలో భాగస్వామ్యం ఉంది. అయితే బీమా చెల్లింపు విషయంలో ఈశాన్య రాష్ట్రాలకు 90 శాతం ప్రీమియంను కేంద్రమే భరించబోతోంది. మిగతా రాష్ట్రాల్లో 50 శాతం చెల్లిస్తారు.. మరోవైపు ఎరువులపై సబ్సిడీని పెంచింది కేంద్రం.. విపత్తు తీవ్రతను తగ్గించడానికి కృషి చేస్తునట్టు తెలిపారు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌.. ఈ సంవత్సరాన్ని రైతు సంక్షేమ సంవత్సరంగా ప్రధాని మోదీ ప్రకటించారని అన్నారు. ఫసల్‌ బీమా యోజన రైతు జీవితాల్లో గణనీయమైన మార్పును తెచ్చిందన్నారు. రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం 11.9 లక్షల కోట్లు గత పదేళ్లలో ఖర్చు చేసినట్టు వెల్లడించారు. అంతేకాదు 2025లో తొలి క్యాబినెట్‌ భేటీని ప్రధాని మోదీ రైతులకు అంకితం చేసింది కేంద్రం.

ఇక డీఏపీపై అదనపు భారాన్ని కేంద్రమే భరించనుంది. ఇకపై ఒక 50 కిలోల డీఏపీ బస్తా 1350 రూపాయలకే లభ్యం కానుంది. కేంద్రం తాజాగా తీసుకున్న ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా 4 కోట్ల మంది రైతులకు లబ్ధి చూకూరనుంది. అదేవిధంగా ఫండ్‌ ఫర్‌ ఇన్నోవేషన్‌ అండ్‌ టెక్నాలజీ’కి కేంద్రం రూ.800 కోట్ల నిధిని ఏర్పాటు చేసింది. పీఎం కిసాన్‌ సమ్మాన్‌ యోజన పథకం కింద అందించే మొత్తాన్ని రూ.6 వేల నుంచి రూ.10 వేలకు పెంచాలని నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో నిర్వహించిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు.

క్యాబినెట్‌ నిర్ణయాలపై హర్షం వ్యక్తం చేస్తూ ‘ఎక్స్‌’లో పోస్టు పెట్టారు ప్రధానిమోదీ. రైతుల సంక్షేమానికి పూర్తిగా కట్టుబడి ఉన్న ప్రభుత్వం తమదేనని.. దేశానికి అన్నం పెట్టేందుకు శ్రమించే మన రైతులు గర్వకారణమన్నారు. 2025 మొదటి క్యాబినెట్ భేటీని రైతుల శ్రేయస్సు కోసం అంకితం చేయడం…ఆనందంగా ఉందన్నారు మోదీ.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..