Maharashtra: బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
అక్షరానికి దూరంగా ఉన్న కాలంలో ఆడపిల్లలకు జన్మనిచ్చేందుకు భయపడేవారు తల్లిదండ్రులు. కానీ నేటికాలంలో కాస్తోకూస్తో అందరూ చదువుకుంటున్నారు. విద్యావంతులవుతున్నారు.. అయినా ఆడపిల్లల పట్ల వివక్ష మారడం లేదు. తాజాగా ఓ మృగాడు తన భార్య వరుసగా ముగ్గురు ఆడపిల్లకు జన్మనిచ్చిందన్న కోపంతో పెట్రోల్ పోసి సజీవ దహనం చేశాడు.
ఆడపిల్ల పుట్టిందన్న కారణంతో ఓ భర్త మృగం కన్నా హీనంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె ముగ్గురు పిల్లలూ తల్లి లేని పిల్లలయ్యారు. ఈ దుర్ఘటన మహారాష్ట్రలో శనివారం డిసెంబర్ 28న జరిగింది. మహారాష్ట్రలోని గంగాఖేడ్ నాకా వద్ద కుండ్లిక్ ఉత్తమ్ కాలేకు ఇద్దరు ఆడపిల్లలు. మూడోసారి గర్భం దాల్చిన అతడి భార్య మైనా గురువారం రాత్రి ప్రసవించింది. మళ్లీ ఆడపిల్లే పుట్టింది. మూడోసారి కూడా ఆడపిల్ల పుడితే.. ప్రాణాలు తీస్తానని ఆమె భర్త ఉత్తమ్ కాలే గతంలో పలుమార్లు భార్యను, ఆమె పుట్టింటి వారిని బెదిరించాడు. ఈ విషయమై దంపతుల మధ్య చాలాసార్లు గొడవలు కూడా జరిగాయి. ఈ క్రమంలో మైనా.. ఆడపిల్లకు జన్మనివ్వడంతో ఉత్తమ్ కాలే ఈ విషయమై శనివారం రాత్రి భార్యతో మరోమారు గొడవపడ్డాడు. కోపంతో రగిలిపోయి.. భార్య మైనాపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.
మైనా కేకలు వేస్తూ ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీసింది. స్థానికులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. అప్పటికే ఆమె శరీరం చాలా వరకు కాలిపోయింది. స్థానికులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. నిందితుడు కాలేపై మైనా సోదరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మగపిల్లాడినే కనాలని లేదంటే చంపేస్తానని తన అక్కను బెదిరించినట్లు చెప్పింది. గంగాఖేడ్ పోలీసులు కాలేను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.