Covid-19: ఆ దేశాల్లో అత్యధిక కరోనా కేసులు…బ్రెజిల్‌ను అధిగమించిన భారత్

Covid-19 News: ప్రపంచంలో ఇప్పటి వరకు అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల జాబితాలో భారత్ రెండో స్థానానికి ఎగబాకింది. ఇప్పటి వరకు బ్రెజిల్ ఈ స్థానంలో ఉండగా...

Covid-19: ఆ దేశాల్లో అత్యధిక కరోనా కేసులు...బ్రెజిల్‌ను అధిగమించిన భారత్
ప్రతీకాత్మక చిత్రం
Follow us
Janardhan Veluru

|

Updated on: Apr 12, 2021 | 7:33 PM

ప్రపంచంలో ఇప్పటి వరకు అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల జాబితాలో భారత్ రెండో స్థానానికి ఎగబాకింది. ఇప్పటి వరకు బ్రెజిల్(Brazil) ఈ స్థానంలో ఉండగా…ఇప్పుడు భారత్ ఆ దేశాన్ని వెనక్కినెట్టింది. మొత్తం 3.12 కోట్ల కరోనా కేసులతో అగ్రరాజ్యం అమెరికా ఈ జాబితాలో మొదటి స్థానంలో నిలుస్తోంది. 1.35 కోట్ల కేసులతో భారత్ రెండో స్థానంలో…బ్రెజిల్ 1.34 కోట్ల కేసులతో మూడో స్థానంలో ఉన్నట్లు రాయిటర్స్ వార్తా సంస్థ ఓ కథనంలో వెల్లడించింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం ఉదయం విడుదల చేసిన డేటా మేరకు దేశంలో కొత్తగా 1,68,912 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 904 మంది మృతి చెందడంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,70,179కి చేరుకుంది.

భారత్‌లో ఆగని కరోనా ఉధృతి.. దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో పలు రాష్ట్రాలు రాత్రిపూట కర్ఫ్యూలు విధిస్తున్నాయి. కోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర తదితర రాష్ట్రాలు పూర్తి స్థాయి లాక్‌డౌన్ విధించే యోచనలో ఉన్నాయి. ఈ నెల 14న జరిగే రాష్ట్ర కేబినెట్ సమావేశంలో పూర్తిస్థాయి లాక్‌డౌన్‌పై ఉద్ధవ్ థాక్రే సర్కారు నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. తక్కువలో తక్కువ 15 రోజుల పాటు పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధించే యోచనలో మహారాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.

అటు రాష్ట్రంలో కోవిడ్ కేసులు మరో వారం రోజుల్లో అదుపులోకి రానిపక్షంలో అవసరమైతే లాక్‌డౌన్ విధించే యోచనలో ఉన్నట్లు కర్ణాటక సీఎం బీఎస్ యడ్యూరప్ప స్పష్టంచేశారు. ఆ పరిస్థితి రాకుండా ప్రజలే జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. దేశ రాజధాని దిల్లీలోనూ కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 10వేలను దాటడంతో అక్కడ కూడా లాక్‌డౌన్‌ విధించే యోచనలో ఉన్నట్లు ఆ రాష్ట్ర సీఎం అర్వింద్ కేజ్రీవాల్ హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి..ఏపీలో మరోసారి వికృతరూపం దాల్చుతున్న కరోనా.. కొత్తగా 3,263 పాజిటివ్ కేసులు