AP Corona: ఏపీలో మరోసారి వికృతరూపం దాల్చుతున్న కరోనా.. కొత్తగా 3,263 పాజిటివ్ కేసులు

సెకండ్‌ వేవ్‌తో దేశం వణికిపోతోంది. ప్రతీరోజూ రికార్డుస్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా మహమ్మారి విజృంభణ అంతకంతకు పెరుగుతూనే ఉంది.

AP Corona: ఏపీలో మరోసారి వికృతరూపం దాల్చుతున్న కరోనా.. కొత్తగా 3,263 పాజిటివ్ కేసులు
Corona
Follow us
Balaraju Goud

|

Updated on: Apr 12, 2021 | 7:08 PM

AP Coronavirus: సెకండ్‌ వేవ్‌తో దేశం వణికిపోతోంది. ప్రతీరోజూ రికార్డుస్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా మహమ్మారి విజృంభణ అంతకంతకు పెరుగుతూనే ఉంది. గడిచిన 24గంటల వ్యవధిలో 33,755 సాంపిల్స్ పరిక్షించగా, 3,263 మందికి కోవిడ్ 19 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యినట్లు ఏపీ వైద్యారోగ్య శాఖ సోమవారం సాయంత్రం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. దీంతో ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారిన పడినవారి సంఖ్య 9,28,664కు చేరుకుంది.

ఇక, 24గంటల వ్యవధిలో 11మంది కరోనా బారిన పడి ప్రాణాలను కోల్పోయారు. చిత్తూరు జిల్లాలో ఐదుగురు, నెల్లూరు జిల్లాలో ఇద్దరు, అనంతపూర్, కడప, కర్నూల్, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరి చొప్పున మృత్యువాతపడ్డారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 7,311 చేరుకుంది.

ఇక, మరోవైపు సోమవారం ఒక్కరోజే 1,091 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారని రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 8,98,238 చేరింది. ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కోటి 54 లక్షల 63 వేల 146 సాంపిల్స్‌ను పరీక్షించినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

ఇక, జిల్లాలవారీగా నమోదైన కోవిడ్ కేసుల జాబితా ఇలా ఉంది….

Ap Corona Cases

AP Corona Cases

ఇదిలావుంటే , కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. హాట్‌స్పాట్లు భావించే అన్ని ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు అమలు చేయాలని నిర్ణయించింది. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు అధికారులు.

దీంతో గ్రామాల్లో సైతం కరోనా నియంత్రణ విషయంలో ప్రజా చైతన్యం బాగా కనిపిస్తోంది. పాజిటివ్‌ కేసులు నమోదయ్యే గ్రామాల్లో స్థానికులు స్వచ్ఛందంగా తమ ఊరిలో ఒకే చోట ఎక్కువ మంది గుమికూడకుండా ఆంక్షలు ఏర్పాటు చేసుకుంటున్నారు. దైనందిక కార్యక్రమాలకు ఇబ్బంది లేకుండా ఎక్కువ మంది గుమికూడడానికి అవకాశం ఉన్న వ్యాపార, వాణిజ్య సముదాయాల విషయంలోనే ఆంక్షలు అమలు చేసుకుంటున్నారు.

కరోనా కేసులు నమోదవుతున్న గ్రామాల్లో పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు ప్రత్యేకంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నారు. సోడియం హైపోక్లోరైడ్‌ను పిచికారీ చేయడంతోపాటు బ్లీచింగ్‌ పౌడరును ప్రధాన రోడ్ల వెంట చల్లుతున్నారు. ప్రజలు సామూహిక కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఆంక్షలు విధిస్తున్నారు.

Read Also… ఆయన కామెంట్లపై స్పందించాల్సిన అవసరం లేదన్న రాములమ్మ .. కేటీఆర్ని‌ ఎంతమాటనేసింది..!

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!