Andhra News: టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు.. బియ్యం గింజ సైజులో 2025 లోగో.. చూస్తే వావ్ అనాల్సిందే..
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పట్టణంకి చెందిన ప్రముఖ స్వర్మకారుడు కొత్తపల్లి రమేష్.. చిన్నతనం నుండే వంశపారపర్యంగా తమ పూర్వీకుల నుండి వచ్చిన కులవృత్తిని ఎంచుకున్నాడు రమేష్.. స్వర్ణకారుడిగా రాణిస్తూ వచ్చాడు. తాజాగా బియ్యం గింజంత సైజులో వెల్కమ్ 2025 అంటూ లోగో రూపొందించాడు. అది అందర్నీ ఎంతోగాను ఆకట్టుకుంది.
మనం ఎప్పుడైన మనకు ఇష్టమైన వృత్తిలో కొనసాగాలి. లేదంటే మనం చేసే పనిని ఇష్టపడాలి. అప్పుడే మనం చేసే పనిలో క్రియేటివిటీ పెరుగుతుంది. తద్వారా అద్భుతాలను సృష్టించగలుగుతాం. అదే విషయాన్ని నిరూపించాడు శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పట్టణంకి చెందిన ప్రముఖ స్వర్మకారుడు కొత్తపల్లి రమేష్.. చిన్నతనం నుండే వంశపారపర్యంగా తమ పూర్వీకుల నుండి వచ్చిన కులవృత్తిని ఎంచుకున్నాడు రమేష్.. స్వర్ణకారుడిగా రాణిస్తూ వచ్చాడు. వృత్తి పట్ల అంకితభావం, ఆసక్తి పెంచుకోవటంతో ఇతని వృత్తి, ప్రవృత్తి ఒక్కటే అయ్యింది. వృత్తిలో క్రియేటివిటీ అందిపుచ్చుకున్నాడు. దీంతో స్వర్ణకారుడిగా వృత్తిని ప్రారంభించిన రమేష్ సూక్ష్మ శిల్పిగాను పేరు తెచ్చుకున్నాడు. తన చేతి నుండి అద్భుత కళాఖండాలను రూపొందిస్తున్నాడు.
తాజాగా బియ్యం గింజంత సైజులో వెల్కమ్ 2025 అంటూ లోగో రూపొందించాడు. ఈ నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ 2025 బంగారపు లోగోను తయారు చేసి శుభాకాంక్షలు తెలియజేశాడు. ఈ లోగో తయారు చేయడానికి సుమారు ఐదు గంటల సమయం పట్టినట్లుగా తెలియజేశారు. పలుచటి బంగారపు రేకు పైన కేవలం 0.30 మిల్లీ గ్రాముల బంగారాన్ని ఉపయోగించి తయారు చేసినట్లు రమేష్ తెలిపారు. దీని ఎత్తు కేవలం అర సెంటి మీటరు కాగా వెడల్పు అర సెంటీమీటర్‌గా తెలియజేశారు. రమేష్ క్రియేటివిటిని చూసినవారంతా ఫిదా అవుతున్నారు. ఆయన వృత్తి నైపుణ్యానికి అభినందిస్తున్నారు. కొత్తపల్లి రమేష్ ఆచారి గతంలోను పలు సూక్ష్మ కళా రూపాలను రూపొందించి అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే అతను స్వర్ణరత్న, బ్రహ్మర్షి వంటి బిరుదులను పొందాడు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి