వావ్ !! ఆటోవాలా ఐడియా అదుర్స్.. ప్రయాణికుల కోసం భలే ఫ్లాన్ చేశాడు
తెలంగాణలో ఒకప్పుడు ఆటోల వల్ల ఆర్టీసీ ఆదాయం తగ్గుతోందన్న అభిప్రాయం కొంతమందిలో ఉండేది. ఇప్పుడు బస్సుల వల్ల ఆటోల ఆదాయం తగ్గుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహాలక్ష్మీ పథకం కింద బస్ జర్నీ తో ఉపాధిని కోల్పోతున్నామంటున్నారు కొందరు ఆటో డ్రైవర్లు. ఈ నేపథ్యంలోనే ఓ ఆటో డ్రైవర్ ప్రయాణికులను ఆకర్షించేందుకు వినూత్నంగా ఫ్లాన్ చేశాడు.
ఆటో ఎక్కే ప్రయాణికులకు వినోదం పంచేందుకు టివీ ఏర్పాటు చేశాడు. అంతేకాదు చిన్నపాటి ఫ్యాన్‌ను కూడా అమర్చాడు. ఆటోలో టీవీ, ఫ్యాన్ చూసిన ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో బస్సు సౌకర్యాలు తక్కువగా ఉన్న చోట ఆటోలలో ప్రయాణాలు చేస్తుంటారు. అందుకే పట్టణాలు, గ్రామాల్లో ఆటోలు విపరీతంగా పెరిగిపోయాయి. చాలా మందికి ఇది ఉపాధి అవకాశంగా ఉంది. అయితే తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కీమ్ ను అమలుచేయడంతో.. ఆటో డ్రైవర్లకు ఉపాధి తగ్గిందన్న వాదనుంది. దీంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట పట్టణానికి చెందిన రాము అనే ఆటో డ్రైవర్ బాగా ఆలోచించి, ప్రయాణికులను ఆకర్షించడానికి, తన ఆటోలో ఒక చిన్న ఎల్ఈడీ టివి, ఒక మినీ ఫ్యాన్ ను, మంచి సౌండ్ సిస్టంను ఏర్పాటు చేశాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇక్కడోళ్లు తిడుతున్నారని.. హిందీ హీరోయిన్ల జాతకం చెబుతున్నావా సామి ??