అల్లు అర్జున్ అరెస్టయ్యాక వాళ్లే గుర్తుకొచ్చారు

అల్లు అర్జున్ అరెస్టయ్యాక వాళ్లే గుర్తుకొచ్చారు

Phani CH

|

Updated on: Jan 04, 2025 | 3:02 PM

జైలు నుంచి బెయిల్ పై బయటకు వచ్చిన జానీ మాస్టర్ మొదట కొన్ని రోజులు ఎవ్వరికీ కనిపించలేదు. ఎక్కువగా ఇంటికే పరిమితమైపోయాడు. భార్య, పిల్లలతోనే సమయం గడిపాడు. ఆ తర్వాత సినిమా ఫంక్షన్లు, ఈవెంట్లకు హాజరయ్యాడు. ఇప్పుడు మళ్లీ కొరియోగ్రాఫర్ గా అవకాశాలు అందుకుంటున్నాడు. ఈ క్రమంలోనే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమాలో జానీ మాస్టర్ కంపోజ్ చేసిన ధోప్ సాంగ్ బయటికి వచ్చింది.

సూపర్బ్ రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంది. జానీ డ్యాన్సింగ్ గురించి మరోసారి నెట్టింట చర్చను షురూ చేసింది. దీంతో జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత జానీ మాస్టర్ తన భార్యతో కలిసి మొదటిసారి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా తన జైలు జీవితం గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యాడీ స్టార్ కొరియోగ్రాఫర్. అలాగే అల్లు అర్జున్ అరెస్ట్ పై కూడా రియాక్టయ్యాడు. జైలు జీవితం గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. అల్లు అర్జున్ తర్వాత జానీ మాస్టర్ హ్యాపీగా ఉన్నాడంటూ కొన్ని మీమ్స్ చూశాను. నిజం చెప్పాలంటే అసలు పగవాడికి, శత్రువుకి కూడా జైలు జీవితాన్ని చూసే పరిస్థితి రాకూడదన్నాడు జానీ మాస్టర్ . అల్లు అర్జున్ అరెస్ట్ వార్త విన్న తరువాత వెంటనే తనకు బన్నీ పిల్లలు గుర్తుకు వచ్చారని… ఆ పిల్లల పరిస్థితి ఏంటో అని ఆలోచించానన్నాడు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మీరు మూర్ఖులైతే ఈ సినిమాను OTTలో చూడండి