ఇక్కడోళ్లు తిడుతున్నారని.. హిందీ హీరోయిన్ల జాతకం చెబుతున్నావా సామి ??

ఇక్కడోళ్లు తిడుతున్నారని.. హిందీ హీరోయిన్ల జాతకం చెబుతున్నావా సామి ??

Phani CH

|

Updated on: Jan 04, 2025 | 3:12 PM

వేణుస్వామి! సినీ ప్రముఖులు, హీరోయిన్, సెలబ్రెటీ కపూల్స్, రాజకీయ నాయకుల జాతకాలను విశ్లేషిస్తూ ఆయన చాలా పాపులర్ అయ్యారు. అలా చెప్పిన జాతకాల వీడియోలతోనే నెట్టింట వైరల్ అవుతుంటారు. కానీ కొన్నాళ్ల క్రితం హీరో నాగచైతన్య, శోభిత వైవాహిక జీవితం గురించి వేణుస్వామి చేసిన ఓ వీడియో నెట్టింట తీవ్ర దుమారం రేపింది. దీంతో ఆయన పై కేసులు, ఆయన తీరుపై గొడవలు జరిగాయి.

అయితే ఈ ఘటనల తర్వాత వేణుస్వామి సైలెంట్ అయ్యారు. ఏ సెలబ్రెటీ జాతకాల విశ్లేషణ చేయలేదు. ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్ కాకుండా బాలీవుడ్ హీరోయిన్ వామిగబ్బీ జాతకం చెబుతూ ఓ వీడియో పోస్ట్ చేశారు. దీంతో మరో సారి నెట్టింట వైరల్ అవుతున్నాడు ఈయన. ఇక్కడోళ్లు తిడుతున్నారని హిందీ హీరోయిన్ల జాతనం చెబుతున్నావా సామి అంటూ కామెంట్ వచ్చేలా చేసుకుంటున్నాడు. బాలీవుడ్ యంగ్ సెన్సేషన్ వామికా గబ్బి జాతకాన్ని విశ్లేషిస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు వేణుస్వామి. పూర్తిగా హిందీలోనే జాతకం చెప్పారు. ఈ మధ్యకాలంలో ఓ బాలీవుడ్ హీరోయిన్ పేరు బాగా వినిపిస్తుంది. ఆమె పేరు వామికా గబ్బి అంటూ వీడియో మొదలెట్టిన ఈయన.. ఆమె కళ్లకే ఎంతో మంది అభిమానులు ఉన్నారంటూ.. ప్రస్తుతం ఆమె చాలా మందికి క్రష్ అయిపోయిందంటూ పొగడ్తల వర్షం కురిపించాడు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అల్లు అర్జున్ అరెస్టయ్యాక వాళ్లే గుర్తుకొచ్చారు

మీరు మూర్ఖులైతే ఈ సినిమాను OTTలో చూడండి