వీడికి ఒంటరిగా కనబడితే చెంపలు పగలగొట్టేస్తున్నాడు.. జాగ్రత్త

వీడికి ఒంటరిగా కనబడితే చెంపలు పగలగొట్టేస్తున్నాడు.. జాగ్రత్త

Samatha J

|

Updated on: Jan 04, 2025 | 4:18 PM

ఓ యువకుడి వింత ప్రవర్తన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఒంటిరిగా కనిపిస్తే చాలు వారిని చెంపపై గట్టిగా కొట్టి పారిపోతున్నాడు. ఇలా ఎందరి చెంపలో వాయించేశాడు. చివరికి ఓ బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో విషయం నెట్టింట చేరి వైరల్‌గా మారింది.  ఉత్తరప్రదేశ్‌కి చెందిన ఓ యువకుడు రోడ్డుమీద ఒంటరిగా కనబడితే చాలు.. వారిని చెంపపై గట్టిగా కొట్టి పారిపోతున్నాడు.

అయితే, ఓ బాధితుడి ఫిర్యాదు మేర‌కు రంగంలోకి దిగిన పోలీసులు స‌ద‌రు యువ‌కుడిని పట్టుకున్నారు. అత‌నిపై బీఎన్ఎస్ సెక్షన్ 115 కింద కేసు న‌మోదు చేశారు. యూపీలోని మీరట్‌కు చెందిన కపిల్‌ కుమార్‌అనే యువకుడి ప్రవర్తనలో గత ఐదారు నెలల నుంచి వింత‌ మార్పులు వచ్చాయి. రోడ్లపై ఒంటరిగా వెళ్లే వారిని లక్ష్యంగా చేసుకుని చెంపలు వాయిస్తున్నాడు. బాధితులకు ఏం జరిగిందో అర్థమయ్యేలోపే తన బైకుపై అక్కడి నుంచి జారుకుంటున్నాడు. ఇలా ఇప్పటివరకు చాలా మందిని కొట్టాడు. అయితే తాజాగా కపిల్ కుమార్.. రిటైర్డ్ పీసీఎస్ అధికారి చెంప పగులగొట్టాడు. అతను రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా బైకుపై వెనుక నుంచి వచ్చి.. ఎడమ చేతితో గట్టిగా చెంపపై కొట్టాడు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వావ్ !! ఆటోవాలా ఐడియా అదుర్స్.. ప్రయాణికుల కోసం భలే ఫ్లాన్ చేశాడు