ఇక చాయ్, సమోసాతో అమెరికాలో ముచ్చట్లు హోటళ్ల మెనూలో కొత్తగా..!
భారత పర్యాటకులను ఆకర్షించేందుకు అమెరికా హోటళ్లు వినూత్న పంథాను అనుసరిస్తున్నాయి. టీ, సమోసా అమ్ముతున్నాయి. లాంజ్‌లలో భారతీయ టీవీ ఛానళ్లను పెడుతున్నాయి. యూఎస్ నేషనల్ ట్రావెల్ అండ్ టూరిజం ఆఫీస్ డేటా ప్రకారం 2024లో 19 లక్షల మంది భారతీయులు అమెరికాలో పర్యటించారు. 2019తో పోలిస్తే 48 శాతం వృద్ధి నమోదైంది.
విజిటింగ్, బిజినెస్ వీసాలు పెరగడం ఇందుకు కారణం. వ్యాపార సందర్శనల కోసం జారీ చేసే బిజినెస్ వీసాలు 50 శాతం పెరిగాయి. అలాగే పర్యటనల కోసం ఇచ్చే విజిటింగ్ వీసాలు 43.5 శాతం పెరుగుదలను నమోదు చేశాయి. దీనిని బట్టి.. అమెరికాకు మనోళ్లు భారీగా క్యూ కట్టారని అర్థమవుతోంది. దీన్ని తమకు అనుకులంగా మార్చుకున్న అక్కడి హోటళ్లు.. భారతీయ పర్యాటకులను ఆకర్షించే పనిలో పడ్డాయి. హోటళ్ల లాబీలలో చాయ్, సమోసాలను పెట్టడంతో పాటు గెస్ట్ రూమ్‌లలో ప్రముఖ భారతీయ టీవీ ఛానెళ్ళను ప్రసారం చేస్తున్నాయని ఆసియన్ అమెరికన్ హోటల్ ఓనర్స్ అసోసియేషన్ సీఎం లారా లీ బ్లేక్ తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సంక్రాంతికి వేళ ప్రయాణికులకు గుడ్ న్యూస్
తప్పతాగడం ఎందుకు ?? ఇలా రోడ్లపై సోలడం ఎందుకు ??
సుక్కు కూతురంటే.. నేషనల్ కాదు ఇంటర్నేషనల్
ఇక్కడోళ్లు తిడుతున్నారని.. హిందీ హీరోయిన్ల జాతకం చెబుతున్నావా సామి ??